HEALTH BENEFITS OF ANJEER: అంజీర్ పండ్లను ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ప్రయోజనకరమైన పండ్లు అంటున్నారు. ఇందులో ఉండే పోషకాలు పుష్కలంగా నిండి ఉంటాయి. ప్రతిరోజూ గ్లాస్ అంజీర్ జ్యూస్ తీసుకోవటం వల్ల శరీరంలో మీరు ఊహించని అద్భుతమైన మిరాకిల్స్ జరుగుతాయని అంటున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
అంజీర్‌లో ఉండే అధిక ఫైబర్ జీర్ణవ్యవస్థను చక్కబెట్టడంలో సహాయపడుతుంది. మలబద్ధకం ఉన్నవారికి ఇది బాగా ఉపశమనం ఇస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే దీనిలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు గుండెకు మేలు చేసే విధంగా పనిచేస్తాయి. ఇవి రక్తపోటును నియంత్రించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంజీర్ జ్యూస్‌లో తేనె కలుపుకొని తరచుగా తాగితే బ్లీడింగ్ డిజార్డర్ తగ్గుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
అంజీర్ జ్యూస్‌లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా అంజీర్ జ్యూస్‌లో తక్కువ కేలరీలు, అధికంగా ఫైబర్ ఉంటాయి. ఇవి ఆకలిని నియంత్రిస్తాయి, బరువు తగ్గాలని అనకునే వారికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అలాగే మానసిక ఒత్తిడుల నుంచి బయటపడడానికి అంజీర్ చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. చాక్లెట్స్, ఐస్‌క్రీమ్ తినడానికి బదులు భోజనం తర్వాత స్వీట్స్‌కి ప్రత్యామ్నాయంగా వీటిని తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
చర్మ సంరక్షణ:
అంజీర్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మంచి నిగారింపు, మృదుత్వాన్ని అందించి యవ్వనాన్ని కాపాడుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించగలదు, సాధారణ మోతాదులో తీసుకుంటే, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే అంజీర్ పేస్ట్ ముఖానికి రాసుకోవడం వల్ల మెలనిన్ తగ్గుతుంది. చర్మం మరింత కాంతివంతగా అవుతుంది.
ఎముకలకు బలం:
అంజీర్‌లో ఉన్న కాల్షియం, మెగ్నీషియం లాంటి ఖనిజాలు ఎముకల దృఢత్వాన్ని పెంపొందిస్తాయి. అంజీర్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇది మన శరీరంలో స్వయంగా సరైన కాల్షియంను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా నిద్ర సమస్యలు ఉన్న వారికి దీని ద్వారా ఉపశమనం లభిస్తుంది. అలాగే అంజీర్‌లోని ట్రిప్టోఫాన్ అనే సహజ రసాయనం నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది.
పునరుత్పత్తి సమస్యలు దూరం..
అంజీర్‌లో జింక్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. వీటి వల్ల మహిళల్లో పునరుత్పత్తి సమస్యలు దూరమవుతాయి. వీటిని తినడం వల్ల మీ శరీరాన్ని హార్మోన్ల అసమతుల్యత, రుతుక్రమం ఆగిపోయిన సమస్యల నుండి రక్షిస్తుంది. అంజీర్ పండ్లు పీఎమ్‌ఎస్ సమస్యలను తగ్గించడంలో కూడా సాయపడతాయి. అంజీర్ పండ్లలో ఉండే కొన్ని రకాల ఔషధ గుణాలు.. రొమ్ము క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.
Also Read: రాత్రి పూట మొబైల్ చూస్తున్నారా ? ఈ వ్యాధులు రావడం ఖాయం
శ్వాసకోశ సమస్యలు మాయం:
అంజీర్లో ఉండే పోషకాలు శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శ్లేష్మం తగ్గించడంలో, గొంతునొప్పిని శాంతింపజేయండంలో ఇది ఎంతో ఉపయోగకరంగా పని చేస్తుంది. అలాగే అంజీర్ మూత్రవిసర్జనను ప్రోత్సహించే లక్షణాలతో, మూత్రపిండాల్లో రాళ్లను ఏర్పడకుండా నిరోధిస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా డాక్టర్ లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.