BigTV English

Chia Seeds Benefits for Skin: చియా సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం

Chia Seeds Benefits for Skin: చియా సీడ్స్‌తో ఫేస్ ప్యాక్.. మీ చర్మం మెరిసిపోవడం ఖాయం

Chia Seeds Benefits for Glowing Skin: సాధారణంగా చియా విత్తనాలను నానబెట్టుకుని తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే.. సబ్జా గింజల మాదిరిగా కనిపించే ఈ చియా సీడ్స్ ఆరోగ్యానికే కాదు.. చర్మ సౌందర్యానికి కూడా ఒక వరమని చెప్పాలి. చియా సీడ్స్ లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, ప్రొటీన్, వంటి ఇతర పోషకాలు పుష్కలంగా దొరుకుతాయి. చియా సీడ్స్‌ నిప్రతిరోజు డైట్‌లో తీసుకోవడం ద్వారా.. ముఖంపై మచ్చలు, ముడతలు, వృద్దాప్య సాంకేతాలు, మొటమలు తొలగిపోతాయి. చియా విత్తనాలు ఫ్రీ రాడికల్స్ వల్ల చర్మం దెబ్బతినకుండా రక్షిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో తోడ్పడుతుంది.


చియా సీడ్స్ తో ఫేస్ ప్యాక్ తయారు చేసుకునే విధానం.

చియా సీడ్స్, నిమ్మకాయ, కొబ్బరి నూనె ఫేస్ ప్యాక్


రెండు టేబుల్ స్పూన్ చియా విత్తనాలు తీసుకొని 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా మిక్స్ చేయండి.. జెల్ మాదిరిగా  తయారవుతుంది. దీన్ని ముఖంపై, మెడకు అప్లై చేసి ఒక 20 నిముషాల పాటు అలానే ఉంచి గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒక సారి చేస్తే మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాని చాలా మంచిది. కొబ్బరి నూనె చర్మానికి తేమను అందించడంలో, అనేక పోషకాలు అందించండంలో సహాయపడుతుంది.

చియా విత్తనాలు, తేనె, ఆలివ్ ఆయిల్

ఒక గుప్పెడు చియా విత్తనాలను తీసుకుని ఒక అరగంట సేపు నానబెట్టండి. వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో ఒక టీస్పూన్ తేనె, ఆలివ్ ఆయిల్  వేసి వాటిని మిక్స్ చేసి ముఖంపై అప్లై చేయండి. అరగంట సేపు అలానే ఉంచి ఆ తర్వాత ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేస్తూ గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల ముఖంపై మచ్చలు, కంటి కింద నల్లటి వలయాలు, మొటిమలు తగ్గిపోతాయి.

Also Read: ఈ పండుతోనే కాదు.. దీని ఆకులతోను ఉండే లాభాలు తెలిస్తే షాక్ అవుతారు..

చియా విత్తనాలు, పాలు, తేనె ఫేస్ ప్యాక్

మూడు టేబుల్ స్పూన్ చియా విత్తనాలు పాలలో వేసి ఒక అరగంట సేపు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేసి అందులో టేబుల్ స్పూన్ తేనె వేసి.. ముఖానికి ఫేస్ ప్యాక్ అప్లై చేసి.. 20 నిమిషాలపాటు అలానే ఉంచండి. తర్వాత గోరు వెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలకు రెండుసార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మెరుస్తూ.. నిగారింపు మీ సొంతం అవుతుంది.

గమనిక: ఈ కథనం పూర్తిగా ఇంటెర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఏదైనా ట్రై చేసే ముందు వైద్యుడి సలహా తీసుకుని ఉపయోగించడం మంచిది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×