2024 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లిన కుమార సంగక్కరను తప్పించడంతో ఆయన మనస్థాపం చెందాడు. ఇదే సమయంలో కోల్ కతా నుంచి పిలుపు వచ్చింది. ఎందుకంటే అక్కడ గౌతంగంభీర్ లేకపోవడంతో కుమార సంగక్కరను మెంటార్ గా తీసుకునేందుకు చర్చలు మొదలయ్యాయి. అవి సఫలీకృతమయ్యాయని అంటున్నారు. ఇదే విషయాన్ని స్పోర్ట్స్ టుడే ప్రచురించింది.
కుమార సంగక్కర ఏమీ తక్కువోడేమీ కాదు.. తను శ్రీలంక క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా పేరుపొందాడు. మంచి స్ట్రోక్ ప్లేయర్ గా పేరుపొందాడు. క్రీజులో నిలదొక్కుకోవడం వరకే. తర్వాత తనని అవుట్ చేయడం అంత ఈజీ కాదన్నట్టు ఆడేవాడు. ఇక మైండ్ గేమ్ లో తనని మించినవారు లేరని అంటారు. ప్రత్యర్థుల ఫీల్డింగ్ సెటప్, బౌలర్ బాల్ వేసేవిధానం చూసి…కరెక్టు ప్లేస్ మెంట్లలోకి బాల్ ని పంపించడంలో సిద్ధహస్తుడిగా పేరుపొందాడు.
Also Read: లక్ష్యాన్ని దాటి.. దూసుకుపోతున్న భారత్
అలాంటి తను రాజస్థాన్ రాయల్స్ ను వదిలి కోల్ కతా కు మెంటార్ గా వెళ్లడం మంచి పరిణామమే అంటున్నారు. ఎందుకంటే 2024 ఐపీఎల్ విజేత అయిన కోల్ కతాపై అంచనాలు భారీగా ఉంటాయి. అందుకు కుమార సంగక్కర కరెక్టు అంటున్నారు.
ఇక కుమార సంగక్కర ప్రొఫైల్ చూస్తే 134 టెస్టులు ఆడి, 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు, 11 డబుల్ సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 404 వన్డేలు ఆడి 14,234 పరుగులు చేశాడు. ఇందులో 25 సెంచరీలు, 93 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీ 20లు 56 ఆడి 1382 పరుగులు చేశాడు. అందులో 8 హాఫ్ సెంచరీలున్నాయి. ఇంత ట్రాక్ రికార్డు ఉండటం వల్లే ఫ్రాంచైజీలు తన కోసం క్యూ కడుతున్నాయి.