E-Paper
Advertisement

సీఎం రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ సవాల్!

సీఎం రేవంత్ రెడ్డికి.. బండి సంజయ్ సవాల్!
Advertisement

Bandi Sanjay: సిక్కులను ఊచకొత కోసిన సంఘటనపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ అన్నారు. ప్రజలు రాష్ట్రంలో అనేక అవస్థలు పడుతున్నారని, దేశంలో ప్రతిపక్ష, రాష్ట్రంలో అధికార పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉందని, ప్రజలను అందుకునేలా రాజకీయ పార్టీలు పనిచేయాలని బండి సంజయ్ అన్నారు. మూర్ఖపు ఆలోచనలతో కాంగ్రెస్ తెరమరుగు అవుతుంది అయినా ఆ విషయాన్ని గమనించడం లేదని అన్నారు. విదేశీ నిధులతో రాజ్యాంగ బద్ధమైన సంస్థలపై విషం కక్కడం ఎంతవరకు సమంజసమో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని అన్నారు.

12 సార్లు ఓటర్ల జాబితా సవరణ..

సైనికల ఆత్మస్థైర్యం దెబ్బ తీసే లా  కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని, ఓడిపోయిన ప్రతిసారీ ఎన్నికల కమిషనర్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తుందని అన్నారు. ఎస్ఐఆర్ అంటే ఏందో కాంగ్రెస్ పార్టీ అర్థం చేసుకోవాలని, అనర్హులైన వారిని జాబితాలో లేకుండా చేయడమే ఎస్ఐఆర్ ప్రక్రియ అని, ఈ ప్రక్రియ ఉండాలో లేదో కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలని బండి సంజయ్ అన్నారు. 1952 నుంచి ఇప్పటి వరకు 12 సార్లు ఓటర్ల జాబితా సవరణ జరిగిందని, 10 సార్లు కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందని, రాహుల్ గాంధీ తను ప్రధాని కాలేక పోతున్నా అన్న ఆవేదనతో ఎస్ఐఆర్ ను వ్యతిరేకిస్తున్నాడని అన్నారు.

13 కోట్ల ఓట్లు..

Advertisement

ఎస్ఐఆర్ లో తప్పులు జరిగి ఉంటే సిబ్బంది పై ఎందుకు చర్యలు తీసుకోలేదని అన్నారు. కోర్టులను ఎందుకు ఆశ్రయించలేదు. తొలగించిన ఓట్లు ఎవరివి అన్నదానిపై కాంగ్రెస్ పార్టీకి సోయి లేదని, శాశ్వతంగా షిఫ్ట్ అయిన ఆరుకోట్ల ముప్పై లక్షల మంది ని కాంగ్రెస్ పార్టీ గుర్తించాలని అన్నారు. 13 కోట్ల ఓట్లు ఇంకొ తొలగించలేదు. అవి కేవలం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ మాత్రమేనని బండి సంజయ్ అన్నారు. ఓట్లు తొలగించిన వారు ఎవరూ ధర్నాలలో కనిపించడం లేదని, 2004నుంచి 18.7 లక్షల చనిపోయిన వారి పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయని అన్నారు.

Also read: ఒకే నగరంలో ఇద్దరు సీరియల్ కిల్లర్లు… పోలీసులకే చుక్కలు చూపించే కొత్త సైకో… కిరాక్ క్లైమాక్స్

2014 కంటే ముందు..

Advertisement

రాష్ట్రంలో 6.70 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి. దీంతో ఇవే 25 లక్షల ఓట్లు అధికారికంగా ఉన్నాయని అన్నారు. 2004లో పీవీ నరసింహారావు చనిపోతే ఆయన పేరు ఇంకా ఉంది. తొలగించాలా వద్దా పాతబస్తీలో 2014 కంటే ముందు అనేక మంది రోహింగ్యాలు వచ్చారు. హైదరాబాద్ ను సత్రంగా మార్చి ఉచిత బియ్యం, డబుల్ బెడ్ రూం ఇచ్చి వారి ఓట్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లు గెలిచాయ ఆ ఓట్లను తొలగించాలా వద్దా కాంగ్రెస్ పార్టీ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో పేదలకు కాకుండా ఓట్ల కోసం రోహింగ్యాలకు ఇల్లు ఇచ్చిందని, కాంగ్రెస్ పతనం ఈ ఎస్ఐఆర్ తో ప్రారంభం కాలేదని అన్నారు.

అజిత్ ధోవల్‌ను..

కాంగ్రెస్ పార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం హైదరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్నామని, జగ్జీవన్ రాం విగ్రహం నుంచి ఎంజే మార్కెట్ వరకు  నిర్వహించే ర్యాలీలో అమిత్ షా పాల్గొంటారని అన్నారు. 13 మంది కూడా ఓటు కోల్పోయిన వారు కనిపించడం లేదని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీనామా చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు సిద్దమా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని బండిసంజయ్ సవాల్ విసిరారు. మా ఎంపీ లు, ఎమ్మెల్యే లు కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాంమని, అజిత్ ధోవల్‌ను పాకిస్థాన్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు. అవే మాటలు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

Also read: తల్లి కాబోతున్న బుల్లితెర నటి.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు!

Tags

Related News

40 ఏళ్లుగా పన్నులు చెల్లిస్తున్నా వదల్లేదు.. రామంతాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు!

నల్గొండలో దారుణం.. తండ్రిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

మిమ్మల్ని బొక్కలో వేసి తన్నే రోజులు త్వరలోనే వస్తాయి.. అద్దంకి దయాకర్ వార్నింగ్!

రావల్‌కోల్‌లో వీధి కుక్కల బీభత్సం.. 10 గొర్రెలు మృతి, రూ. 2 లక్షల నష్టం!

తెలంగాణలో సీనియర్ రెసిడెంట్ పోస్టింగ్‌ల రగడ.. రికమెండేషన్ దందాలకు చెక్!

ర్యాపిడోలో బంగారం పార్సిల్.. చేతివాటం చూపించిన డెలివరీ బాయ్!

సీజ్ చేసిన ఫోన్‌తో రూ.1.70 లక్షలు బదిలీ.. 12 తులాల బంగారం తాకట్టు పెట్టిన కానిస్టేబుల్ అరెస్ట్

Big Stories

Advertisement
×