BigTV English

Chicken Kebab: చికెన్ బంగాళదుంప కబాబ్ ఇలా చేశారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, ఇదిగో రెసిపీ

Chicken Kebab: చికెన్ బంగాళదుంప కబాబ్ ఇలా చేశారంటే లొట్టలు వేసుకుంటూ తినేస్తారు, ఇదిగో రెసిపీ

కబాబ్ పేరు చెబితేనే నోరూరిపోతుంది. క్రిస్పీగా ఉండే కబాబ్‌లను తింటూ ఉంటే స్వర్గపు రుచి కనిపిస్తుంది. దీనికోసం చాలామంది ఆర్డర్లు పెట్టుకుంటారు. నిజానికి ఇంట్లోనే చికెన్ బంగాళదుంప కబాబ్‌ను సులువుగా చేసేయొచ్చు. అరగంటలోనే ఇవి రెడీ అయిపోతాయి. ఎలా చేయాలో ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము.


చికెన్ పొటాటో కబాబ్ రెసిపీకి కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు – మూడు
చికెన్ కీమా – పావు కిలో
గరం మసాలా – అర స్పూను
ఉప్పు – రుచికి సరిపడా
జీలకర్ర పొడి – ఒక స్పూను
సోయాసాస్ – ఒక స్పూను
మిరియాల పొడి – అర స్పూను
అల్లం వెల్లుల్లి పేస్టు – ఒక స్పూను
పచ్చిమిర్చి తరుగు – ఒక స్పూను
కొత్తిమీర తరుగు – రెండు స్పూన్లు
పుదీనా ఆకుల తరుగు – ఒక స్పూను
గుడ్లు – రెండు
నూనె – వేయించడానికి సరిపడా
బ్రెడ్ ముక్కలు – రెండు

చికెన్ బంగాళదుంప కబాబ్ రెసిపీ
1. చికెన్ కీమాను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 2.బంగాళదుంపలను బాగా ఉడికించి పొట్టు తీసి చేత్తోనే మెత్తగా నలిపి ఒక గిన్నెలో వేయాలి.
3. అందులోనే చికెన్ తురుమును కూడా వేయాలి.
4. రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా తరుగు, సోయా సాస్ ను, కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి.
5. పచ్చిమిర్చి తరుగును కూడా వేసుకోవాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని పావుగంట పాటు ఫ్రిజ్లో ఉంచి మ్యారినేట్ చేయాలి.
6. ఇప్పుడు ఒక గిన్నెలో కోడిగుడ్లను కొట్టి సొనను వేయాలి. 7.మరోపక్క బ్రెడ్‌ను మిక్సీలో వేసి పొడి లాగా చేసుకుని ఒక ప్లేట్లో వేయాలి.
8.ఇప్పుడు ఫ్రిజ్ లో మ్యారినేట్ చేసిన చికెన్ బంగాళదుంప మిశ్రమాన్ని తీసి పైన పెట్టుకోవాలి.
9. ఇందులోంచి చిన్న మొక్కను తీసి కబాబ్ రూపంలో ఒత్తుకోవాలి.
10. దాన్ని ఒకసారి గుడ్డు మిశ్రమంలో ముంచి తర్వాత బ్రెడ్ పొడి పై దొర్లించాలి.
11. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేసి ఈ కబాబులను రెండు వైపులా వేయించుకోవాలి.
12. అంతే టేస్టీ చికెన్ పొటాటో కబాబ్ లేదా టిక్కి రెడీ అయినట్టే. దీన్ని టమోటా కెచప్ తో తిని చూడండి అద్భుతంగా ఉంటుంది.


చికెన్ పొటాటో కబాబ్ ఒక్కసారి తిన్నారంటే మర్చిపోలేరు. ఎవరైనా ఇంటికి అతిధులు వచ్చినప్పుడు దీన్ని వండి పెడితే వారికి కచ్చితంగా నచ్చుతుంది.

Related News

Paneer SideEffects: పనీర్ ఇష్టంగా తింటున్నారా? అయితే ఈ ఆరోగ్య సమస్యలతో జాగ్రత్త

Protein Shake: క్షణాల్లోనే రెడీ అయ్యే.. ప్రోటీన్ షేక్, సూపర్ టేస్ట్‌తో.. !

Gutti Vankaya Curry: నోరూరించే గుత్తి వంకాయ కర్రీ.. ఇలా చేస్తే ఎవ్వరైనా ఫిదానే !

Walk With Friend: ఫ్రెండ్‌తో కలిసి నడిస్తే.. ఇలా జరుగుతుందా? చాలా మిస్ అవుతున్నారు బ్రో !

Hyderabad: లాంఛనంగా ప్రారంభమైన “ది హౌస్ ఆఫ్ కోయిలా”.. అతిథులు వీరే!

Interval Walking Benefits: జాగింగ్ కంటే ఇదే బెస్ట్.. అందుకేనా జపాన్‌లో అంత క్రేజ్ !

Velaterapia: జుట్టుకు మంటలు.. ఇదేం మాయదారి ట్రెండ్ రా? ఇది ఏ దేశంలో మొదలైందో తెలుసా?

Director Sukumar: హైదరాబాదులో సుకుమార్ సందడి.. ఘనంగా ప్రారంభోత్సవం!

Big Stories

×