E-Paper
Advertisement

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు

ఈ సందర్భాల్లో అబద్ధం చెప్పాలని పిల్లలకు చెప్పాలి.. తల్లిదండ్రులు నేర్పాల్సిన 5 ముఖ్యమైన విషయాలు
Advertisement

Child Safety Parenting Tips| చిన్నప్పటి నుంచే పిల్లలకు నిజం చెప్పాలని తల్లిదండ్రులు నేర్పిస్తారు. ఇది మంచి అలవాటు కూడా. నిజాయితీ మంచి వ్యక్తిత్వానికి గుర్తు. అయితే కొన్ని ప్రమాదకర పరిస్థితుల్లో పిల్లలు తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అలాంటి సందర్భాల్లో నిజం చెప్పకుండా ఉండడం వారి రక్షణకు ఉపయోగపడుతుంది. చైల్డ్ సేఫ్టీ నిపుణులు కూడా ఇలాంటి పరిస్థితులకు పిల్లలను ముందుగానే సిద్ధం చేయాలని సూచిస్తున్నారు.

ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నిజం చెప్పకూడదు

ఒకవేళ అపరిచిత వ్యక్తి ఇంటి తలుపు తట్టి “అమ్మానాన్న ఇంట్లో ఉన్నారా?” అని అడిగితే పిల్లలు తాము ఒంటరిగా ఉన్నామని చెప్పకూడదు. దానికి బదులుగా “అందరూ ఇంట్లోనే ఉన్నారు. మీకు ఏం కావాలి?” అని చెప్పాలని నేర్పాలి. దీంతో ఎదుటివారికి ఇంట్లో పెద్దలు ఉన్నారనే భావన కలుగుతుంది. చెడు ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి వెనక్కి వెళ్లే అవకాశం ఉంటుంది.

అపరిచితుల లిఫ్ట్‌ను తిరస్కరించాలి

Advertisement

కొన్నిసార్లు తెలియని వ్యక్తులు పిల్లలకు లిఫ్ట్ ఇస్తామని చెప్పవచ్చు. అలాంటి సమయంలో పిల్లలు ఎప్పుడూ వారి వాహనంలో ఎక్కకూడదు. ఎవరైనా బలవంతం చేస్తే “మా అమ్మ లేదా నాన్న నన్ను తీసుకెళ్లడానికి వస్తున్నారు” అని చెప్పాలని నేర్పాలి. ఈ చిన్న సమాధానం పిల్లలను ప్రమాదం నుంచి కాపాడవచ్చు.

అపరిచితుల బహుమతులను తీసుకోకూడదు

కొంతమంది చాక్లెట్లు, బొమ్మలు లేదా ఇతర బహుమతులు ఇచ్చి పిల్లల నమ్మకాన్ని పొందేందుకు ప్రయత్నించవచ్చు. పిల్లలు అలాంటి బహుమతులను మర్యాదగా తిరస్కరించడం నేర్చుకోవాలి. అవసరమైతే “నేను ఇప్పుడు ఏమీ తీసుకోలేను” లేదా “నాకు ఆరోగ్యం బాగోలేదు” అని చెప్పవచ్చు. ఇలా చెప్పడం వల్ల గొడవ లేకుండా అక్కడి నుంచి సురక్షితంగా వెళ్లిపోవచ్చు.

వ్యక్తిగత వివరాలు చెప్పకూడదు

Advertisement

తెలియని వ్యక్తులకు ఇంటి చిరునామా, పాఠశాల పేరు, ఫోన్ నంబర్ లేదా తల్లిదండ్రుల వివరాలు చెప్పకూడదని పిల్లలకు స్పష్టంగా చెప్పాలి. ఎవరైనా ఇలాంటి ప్రశ్నలు అడిగితే సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. అవసరమైతే అక్కడి నుంచి వెంటనే దూరంగా వెళ్లిపోవాలని సూచించాలి.

రహస్యాలు దాచకుండా ఇంట్లో చెప్పాలి

ఒకవేళ ఎవరైనా “ఈ విషయం అమ్మానాన్నకు చెప్పొద్దు” అని చెప్పితే పిల్లలు దాన్ని రహస్యంగా ఉంచకూడదు. ఇంటికి వెళ్లిన వెంటనే తల్లిదండ్రులకు లేదా నమ్మకమైన పెద్దలకు జరిగిన విషయం మొత్తం చెప్పాలి. పిల్లలు ఏ విషయమైనా భయపడకుండా ఇంట్లో చెప్పేలా తల్లిదండ్రులు నమ్మకం కల్పించాలి.

భద్రతే లక్ష్యం, అబద్ధం కాదు

ఈ విషయాలు పిల్లలకు అబద్ధాలు చెప్పడం నేర్పడానికి కావు. ప్రమాదకర పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవడం నేర్పించడమే అసలు ఉద్దేశం. ఈ అలవాట్లు అత్యవసర పరిస్థితుల్లో పిల్లలకు ఎంతో ఉపయోగపడతాయి.

Also Read: బాయ్ ఫ్రెండ్ అద్దెకు లభించును.. కొత్త ట్రెండ్ బాస్.. గంటకు రెంట్ ఎంతంటే?

ఇంట్లో ముందుగానే ప్రాక్టీస్ చేయాలి

తల్లిదండ్రులు ఇలాంటి పరిస్థితుల గురించి పిల్లలతో తరచుగా మాట్లాడాలి. చిన్నచిన్న యాక్టింగ్ ద్వారా సరైన సమాధానాలు చెప్పే విధానాన్ని వారికి నేర్పాలి. ఇలా చేయడం వల్ల పిల్లలు ప్రమాదకర పరిస్థితుల్లో భయపడకుండా సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. పిల్లల భద్రతకు సంబంధించిన విషయాల్లో అవసరమైతే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Related News

హైబ్రిడ్ ఫిట్‌నెస్ అంటే ఏంటి? స్టామినా, బలం రెండూ పెంచే కొత్త వర్కౌట్స్

ప్రేమలో మూడో వ్యక్తి జోక్యాన్ని సహించరు.. ఈ తేదీల్లో పుట్టినవారు చాలా పొసిసివ్

కిచెన్‌లో మీరు చేసే ఈ 9 తప్పుల వల్లే వర్షాకాలంలో ఆరోగ్య సమస్యలు..

పిల్లలు బొటనవేలు ఎందుకు చీకు తుంటారు? ఈ అలవాటు మాన్పించేందుకు ఈజీ టిప్స్ hi

రాత్రి సరిగా నిద్ర పట్టలేదా? మరుసటి రోజు శరీరం చురుకుగా ఉండేందుకు ఈ టిప్స్ పాటించండి

మోసం చేసిన భర్త లేదా భార్యను క్షమించడం కరెక్టేనా?

వర్షాకాలంలో వరదల ప్రమాదం.. ప్రకృతి విపత్తు సమయంలో మీ ఫ్యామిలీని ఇలా కాపాడుకోండి

స్వస్తిక్‌కు ఇరువైపులా రెండేసి గీతలు.. అంత అర్థం ఉందా? అసలు విషయాలు తెలిస్తే షాక్

Big Stories

Advertisement
×