Toxic:కన్నడ సూపర్ స్టార్ యశ్ (Yash) హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని వెంకట్ కే నారాయణతో కలసి యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వరుసగా హీరోయిన్ పాత్రలను పరిచయం చేస్తూ.. పోస్టర్స్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతే కాదు హీరో హీరోయిన్స్ మధ్య రొమాంటిక్ పాటలను కూడా రివీల్ చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది ఈ చిత్రం. ఇకపోతే ఈ సినిమాలో ఏకంగా 5 మంది హీరోయిన్లు నటిస్తుండగా.. అందులో ఎవరు అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారు అనే విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
2026లో అతిపెద్ద బ్లాక్ బస్టర్ గా ఇప్పటికే ప్రచారం చేయబడుతోంది. ఏకంగా ఐదు మంది హీరోయిన్లు నటిస్తున్నారు . ప్రముఖ హీరోయిన్ కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్గా నటిస్తుండగా.. తారా సుతారియా (Tara sutharia), నయనతార(Nayanthara), హుమా ఖురేషి(Huma Qureshi), రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్లుగా నటిస్తున్నారు. వీరందరికీ సంబంధించిన రొమాంటిక్ పాటలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా రూ 300 కోట్లకు పైగా బడ్జెట్ తో రాబోతుండగా.. ఇందులో ఎవరికి ఎంత రెమ్యూనరేషన్ ఇవ్వబోతున్నారు అనే విషయం కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
also read:నాని – నితిన్ కొత్త మూవీ.. టైటిల్ గ్లింప్స్ రిలీజ్..
ఈ సినిమాలో మొత్తం ఐదు మంది హీరోయిన్స్ నటిస్తుండగా అందులో కియారా అద్వానీ నదియా పాత్రలో నటిస్తోంది.తన పాత్ర కోసం ఏకంగా రూ.15 కోట్లు పారితోషకం తీసుకున్నారట. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార గంగా పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆమె ఏకంగా రూ.12 నుండి రూ 18 కోట్ల వరకు తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ మెలిస్సా పాత్రలో నటిస్తుండగా.. ఈ పాత్ర కోసం రూ.3 నుండి రూ 5 కోట్ల వరకు పారితోషకం తీసుకున్నారట. అంతేకాదు ఎలిజిబెత్ పాత్ర పోషిస్తున్న హుమా ఖురేషి రూ.2 నుండి రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అలాగే తారా సుతారియా రెబెక్కా పాత్ర కోసం రూ.2 నుండి రూ.3 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అక్షయ్ ఒబేరాయ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఆగస్టు 26న కన్నడ , ఇంగ్లీష్ తో పాటు తెలుగు, తమిళ్ ,మలయాళం, హిందీ భాషలలో డబ్బింగ్ వర్షన్ లో విడుదల కాబోతోంది.