BigTV English

Cold Water Therapy : కోల్డ్ వాటర్ థెరపీ బెనిఫిట్స్.. గురించి మీకు తెలుసా..?

Cold Water Therapy : కోల్డ్ వాటర్ థెరపీ బెనిఫిట్స్.. గురించి మీకు తెలుసా..?

Cold Water Therapy Benefits


Cold Water Therapy Benefits : కోల్డ్ వాటర్ థెరపీ ఇటీవల చాలా ఫేమస్ అయింది. చల్లని నీటితో స్నానం చేయడం అనేది ఒక రకమైన చికిత్స. అథ్లెట్లు, సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, క్రీడాకారులు కోల్డ్ వాటర్ థెరపీకి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల కండరాలు రిలాక్స్ అవుతాయి. రోజూ చల్లని నీటితో స్నానం చేయడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.

వ్యాయామం తర్వాత చల్లని నీటితో స్నానం చేయడం వల్ల రిఫ్రెష్‌గా ఉంటారు. అంతేకాకుంగా మానసిక స్థితి మెరుగుపడుతుంది. రోగనిరోధక వ్యవస్థ , జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే కోల్డ్ వాటర్ థెరపీని కొంత సమయం మాత్రమే చేయాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ థెరపీ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..


కోల్డ్ వాటర్ థెరపీ ప్రయోజనాలు

కోల్డ్ వాటర్ థెరపీని 10 నుంచి 15 నిమిషాల పాటు మాత్రమే చేయాలి. నీటి ఉష్ణోగ్రత 15°C కంటే తక్కువగా ఉండాలి. దీనిని హైడ్రో థెరపీ అని కూడా అంటారు. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

Read More : రోజుకు ఎన్ని అడుగులు వేస్తే మంచిది.. సైన్స్ ఏం చెబుతుంది..!

వ్యాయామం తర్వాత చల్లటి నీటిలో కొంత సమయం ఉండటం ద్వారా కండరాల నొప్పులు నివారించొచ్చు. సైక్లిస్టులు ఈ పద్ధతిని ప్రయత్నించడం ద్వారా కండరాల నొప్పులు తగ్గాయి. హైడ్రోథెరపీలో పాల్గొనని క్రీడాకారులు కండరాల నొప్పులను ఎక్కువగా అనుభవిస్తున్నారని ఓ అధ్యయనంలో తేలింది.

కోల్డ్ వాటర్ థెరపీ చేయడం ద్వారా రక్త నాళాలు కుంచించుకుపోతాయి. చల్లని నీటిలో రిలాక్స్ అవడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రతలు చాలా వేగంగా తగ్గుతాయి. శరీరంలో అధిక వేడి ఉన్న వ్యక్తులు హైడ్రోథెరపీ మంచి ఫలితాలను ఇస్తుంది. దీనిలో భాగంగా మీరు మీ చర్మాన్ని వీలైనంత ఎక్కువగా నీటిలో ముంచడానికి ప్రయత్నించండి.

Read More : సమ్మర్.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విటమిన్లు తీసుకోండి!

నిపుణుల అభిప్రాయం ప్రకారం కోల్డ్ వాటర్ థెరపీ అనేది అందరికీ ఒకేలా పనిచేయదు. ఇది వారి మానసిక, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. చల్లటి నీటిలో ఒక్కసారిగా శీరీరాన్ని ముంచడం ద్వారా ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి.అంతేకాకుండా కోల్డ్ వాటర్ థెరపీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

కోల్డ్ వాటర్ థెరపీ ఎలా ప్రారంభించాలి?

  • ముందుగా గోరువెచ్చని నీటిలో మీ శరీరాన్ని ముంచండి.
  • కొన్ని నిమిషాల తరువాత ఆ నీటిని తక్కువ ఉష్ణోగ్రతకు మార్చండి.
  • వ్యాయామం తర్వాత రిలాక్స్ అవకుండా కోల్డ్ వాటర్ థెరపీ చేయొచ్చు.
  • కోల్డ్ వాటర్ థెరపీ కోసం బాత్‌లో ఐస్ కలపండి.
  • ఆ నీటిలో పూర్తిగా మునిగిపోండి.
  • ఈ నీటిలో10 నుండి 15 నిమిషాలు మాత్రమే ఉండండి.
  • మీరు చల్లటి నీటిలో స్విమ్ కూడా చేయొచ్చు.

Disclaimer : ఈ కథనాన్ని హెల్త్ జర్నల్స్, పలు అధ్యయనాల ఆధారంగా రూపొందించాం. దీనిని సమాచారంగా మాత్రమే చూడండి.

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×