Big Stories

Summer Diet : సమ్మర్.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ విటమిన్లు తీసుకోండి!

summer diet

- Advertisement -

 

- Advertisement -

Healthy Diet For Summer : రోజు రోజుకు ఎండలు పెరుగుతున్నాయ్. సమ్మర్‌లో ఆరోగ్యపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. చిన్న పిల్లలు, కాస్త వయసు పైబడినవారు ఆరోగ్యంపై ప్రత్యేక ద‌ృష్టి ఉంచాలి. లేదంటే ఎండ తీవ్రతను శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. శరీరానికి ఎక్కువ చెమట పట్టడం వల్ల ఎలక్ట్రోలైట్స్ స్థాయిలో మార్పులు వస్తాయి.

అంతేకాకుండా సమ్మర్‌లో వడ దెబ్బ, చర్మ సమస్యలు అధికంగా వస్తాయి. అధిక వేడి కారణంగా శరీర సాధారణ స్థాయిలో మార్పులు సంభవిస్తాయి. దీనివల్ల చర్మం జిడ్డుగా మారుతోంది. అలానే చర్మం డ్రైగా మారి పగిలిపోతుంది. సమ్మర్‌లో ఆరోగ్యంగా ఉండటానికి మంచి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి.

Read More : స్లీప్ ఆప్నియా.. ఈ ఆహారాలతో గుడ్ బై చెప్పండి!

సమ్మర్‌లో శరీరం బలమైన రోగనిరోధక శక్తి కిలిగి ఉండటం అవసరం. దీనివల్ల ఎండ తీవ్రత నుంచి శరీరాన్ని రక్షించుకోవచ్చు. కాబట్టి మీ ఇమ్యునీటిని బూస్ట్ చేసుకోవడానికి ఆహారంపై ఫోకస్ చేయండి. సమ్మర్‌లో శరీరానికి విటమిన్లు ఉన్న ఆహారం అందించాలి. అటువంటి ఆహరం ఏంటో ఇప్పుడు చూద్దాం..

విటమిన్ ఎ

సమ్మర్‌లో విటమిన్ ఎ ఉన్న ఆహారం తీసుకోవాలి. విటమిన్ ఎ చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సూర్యుడి నుంచి వెలువడే యూవీ కిరణాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పాలు, గుడ్లు, టమాటా, కూరగాయలు, క్యారెట్, చిలకడదుంప, చేపనూనె వంటివి మీ ఆహారంలో ఉండేలా చూడండి. విటమిన్ ఎ మీరు తీసుకునే ఆహారంలో 750 మి.గ్రా ఉండాలి.

విటమిన్ సి

విటమిన్ సి మీ ఇమ్యునీటిని బూస్ట్ చేస్తుంది. అంతేకాకుండా శక్తి వంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. చర్మాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ను నూట్రల్ చేయడానికి సహాయపడుతుంది. నారింజలు, కివి, టమోటాలు, ద్రాక్ష, స్ట్రాబెరీ, బొప్పాయిలో విమటిన్ సి పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ ఇ

విటమిన్ ఇ శరీరానికి చాలా ముఖ్యం. ఇది శరీరంలో శక్తి వంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించడానికి విటమిస్ సి సహాయపడుతుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. బాదం, వేరుశెనగ, గుమ్మడికాయ గింజలు, బీట్‌రూట్, ఆకుకూరల్లో  విటమిన్ ఇ ఉంటుంది.

విటమిన్ డి

విటమిన్ డి అనేది సూర్యరశ్మి ద్వారా లభిస్తుంది. వేసవిలో వచ్చే అనేక అనారోగ్య సమస్యలను పరిష్కరించడానికి విటమిన్ డి అవసరం. ఉదయాన్నే 6 నుంచి 8 వరకు ఎండలో కొంత సమయం గడపండి. దీని ద్వారా విటమిన్ డి పొందవచ్చు. పెరుగు, పాలు, చేపనూనె, పుట్టగొడుకు, గుడ్డు పచ్చసొన తీసుకోవడం వల్ల విటమిన్ డి శరీరానికి అందుతుంది.

ఈ విటమిన్లు తీసుకోవడం ద్వారా సమ్మర్ నుంచి మీ శరీరాన్ని రక్షించుకోవచ్చు. అలానే శరీరానికి తగినంత నీరును తీసుకోండి. ఇంటి నుంచి బయటకు వెళ్లేప్పుడు జాగ్రత్తలు పాటించండి. కాటన్ దుస్తులు, లేత రంగు దుస్తులు ధరించండి. అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించండి.

Disclaimer : ఈ సమాచారాన్ని మీ అవగాహన కోసం పలు అధ్యాయనాల ఆధారంగా అందిస్తున్నాం.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News