Health tips: కరివేపాకు (Curry leaves) ఆయుర్వేదంలో ఔషధ గుణాలు కలిగిన మొక్కగా పరిగణించబడుతుంది. ఇవి కేవలం వంటల్లో రుచి కోసం మాత్రమే కాకుండా, ఆరోగ్య ప్రయోజనాల కోసం కూడా విరివిగా ఉపయోగించబడతాయి. కరివేపాకులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు, ఫ్లేవనాయిడ్స్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి, ఇవి కంటి ఆరోగ్యానికి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో, బరువు తగ్గడంలో ఎంతగానో ఉపయోగపడతుంది.
1. కంటి చూపును మెరుగుపరుస్తుంది
కరివేపాకులో విటమిన్ A అధికంగా ఉంటుంది, ఇది రెటీనా ఆరోగ్యానికి అవసరమైన బీటా-కెరోటిన్‌ను అందిస్తుంది. అలాగే దీనిలో విటమిన్ A లోపం వల్ల కలిగే రాత్రి అంధత్వం (Night Blindness), కంటి పొడిబారడం వంటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. రోజూ కరివేపాకు ఆకులను ఆహారంలో చేర్చుకోవడం లేదా రసం తాగడం ద్వారా కంటి చూపు స్పష్టతను మెరుగుపరుస్తుందని పలు వైద్యులు చెబుతున్నారు.
2. యాంటీఆక్సిడెంట్ గుణాలు
ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా క్వెర్సెటిన్ మరియు క్యాంఫెరాల్, ఫ్రీ రాడికల్స్ వల్ల కంటికి కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి.ఈ యాంటీఆక్సిడెంట్లు కంటిలోని కణాలను ఆక్సీకరణ ఒత్తిడి (Oxidative Stress) నుండి రక్షిస్తాయి, ఇది కంటిశుక్లం , వయస్సు సంబంధిత మాక్యులర్ డీజనరేషన్ వంటి సమస్యలను నివారిస్తుంది. అలాగే కరివేపాకు తినడం వల్ల జీవక్రియను పెంచుతుంది. దీంతో తేలికగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
3. కంటి ఇన్ఫెక్షన్ల నివారణ
కరివేపాకులో యాంటీ-బాక్టీరియల్, యాంటీ-ఫంగల్ గుణాలు ఉంటాయి, ఇవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా ఈ రసాన్ని బాహ్యంగా ఉపయోగించడం లేదా ఆకులను నమిలి తినడం ద్వారా కంటి ఎరుపు, మంట, మరియు ఇతర సమస్యలను తగ్గించవచ్చు. ఈ ఆకులను నీటిలో మరిగించి, ఆ నీటితో కళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల కంటి ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని వైద్య నిపుణులు తెలిపారు.
5. కంటి చుట్టూ నల్లటి వలయాలను తగ్గిస్తుంది
కరివేపాకులో ఉండే ఇనుము, విటమిన్లు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి, ఇది కంటి చుట్టూ ఏర్పడే నల్లటి వలయాలను (Dark Circles) తగ్గించడంలో సహాయపడుతుంది. కరివేపాకు ఆకుల పేస్ట్‌ను కంటి చుట్టూ అప్లై చేయడం ద్వారా చర్మం ఆరోగ్యంగా మారి, నల్లటి వలయాలు తగ్గుతాయి. అంతేకాకుండా కరివేపాకును రోజూ వారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది, జుట్టుకు సహజమైన రంగును అందిస్తుంది.
6. డయాబెటిక్ రెటినోపతి నివారణ
డయాబెటిస్ ఉన్నవారిలో కంటి రెటీనా దెబ్బతినే సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది. కరివేపాకులోని యాంటీఆక్సిడెంట్లు మరియు బ్లడ్ షుగర్ నియంత్రణ గుణాలు ఈ సమస్యను నివారించడంలో సహాయపడతుంది, ఇది కాలేయం దెబ్బతినకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి శరీరంలో మంటను తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
Also Read: మెహెందీని చేతినుండి త్వరగా తొలగించాలనుకుంటున్నారా? ఈ ఐదు చిట్కాలు పాటించండి
కరివేపాకును ఉపయోగించే విధానాలు:
తినడం: ఉదయం ఖాళీ కడుపుతో 5-6 తాజా కరివేపాకు ఆకులను నమిలి తినవచ్చు.
రసం: 10-12 కరివేపాకు ఆకులను మెత్తగా రుబ్బి, నీటితో కలిపి రసం తాగవచ్చు. రుచి కోసం తేనె లేదా నిమ్మరసం కలపవచ్చు.
వంటలలో: కరివేపాకును కూరలు, సూప్‌లు, లేదా టీలో చేర్చి తీసుకోవచ్చు.
కంటి శుద్ధి: కరివేపాకు ఆకులను నీటిలో మరిగించి, చల్లారిన నీటితో కళ్లను కడగడం ద్వారా ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
జాగ్రత్తలు:
కరివేపాకును ఎక్కువగా తీసుకోవడం వల్ల కొన్ని సందర్భాలలో జీర్ణ సమస్యలు రావచ్చు, కాబట్టి మితంగా ఉపయోగించాలి. గర్భిణీ స్తీలు లేదా ఔషధాలు వాడుతున్నవారు వైద్య సలహా తీసుకోవాలని చెబుతున్నారు.