BigTV English

Saudi Airlines Incident: మరో విమానంలో మంటలు.. ఫ్లైయిట్‌లో 250 మంది..?

Saudi Airlines Incident: మరో విమానంలో మంటలు.. ఫ్లైయిట్‌లో 250 మంది..?

Saudi Airlines Incident: వరుస విమాన ప్రమాదాలు.. ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. విమాన ప్రయాణాలంటే గుండె జల్లుమంటోంది. గాల్లో దీపంలా మారిపోతున్నాయి ప్రాణాలు. ఎక్కి దిగే వరకూ ఏదీ గ్యారంటీ లేదు. ప్రాణం భయం గుప్పెట్లో పెట్టుకుని.. విమాన ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇటీవల అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాద ఘటన మరవక ముందే.. వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఆదివారం నాడు ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ ప్రయాణిస్తున్న చాపర్ కుప్పకూలింది. ఈ ప్రమాద ఘటనలో పైలట్‌తో సహా ఏడుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే..


ఇదిలా ఉంటే తాజాగా హజ్ యాత్రికులతో.. లఖ్‌నవూ విమానాశ్రయానికి చేరుకున్న సౌదీ అరేబియా ఎయిర్ లైన్స్‌కు చెందిన.. విమానానికి పెను ప్రమాదమే తప్పింది. ఈ విమానంలో సుమారు 250 మంది యాత్రికులు ఉన్నట్లు తెలుస్తోంది.

జెడ్డా నుంచి బయల్దేరిన సౌదీ ఎయిర్ లైన్స్ యాత్రికుల ఫ్లైట్.. ఆదివారం ఉదయం లఖ్‌నవూలోని అమౌసీ విమానాశ్రయంలో.. కొన్ని గంటలు నిలిపివేశారు. ఆ తర్వాత టాక్సీ మార్గంలో విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో.. ఎడమ టైర్ నుంచి దట్టమైన పొగలతో, మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌కు తెలియజేశారు.


సమాచారం తెలుసుకున్న అధికారులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి.. ఎట్టకేలకు మంటలు అదుపు చేశారు. వెంటనే ప్రయాణికులను సురక్షితంగా.. విమానం నుంచి కిందకు దింపారు. దీంతో ప్రయాణికులు అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుకునేందుకు.. మరో విమానాన్ని ఏర్పాటు చేస్తున్నారు అధికారులు. అయితే వారిని ఎంత సమయానికి చేరుస్తారని ఇంకా స్పష్టత ఇవ్వలేదు. హైడ్రాలీక్ కారణంగా.. విమానంలో మంటలు చెలరేగినట్లు సమాచారం. సౌదీ ఎయిర్ లైన్స్‌కు చెందిన SV 3112 ఫ్లైట్ శనివారం రాత్రి 10.45 గంటల సమయంలో.. జెడ్డా నుంచి 250 మంది హజ్ యాత్రికులతో లక్నోకు పయనమైంది. అయితే ఆదివారం మార్నింగ్ లక్నో విమానాశ్రయానికి చేరుకోగానే.. సాంకేతిక లోపం తలెత్తినట్లు పైలెట్ సిబ్బంది గుర్తించింది. దీంతో విమానాన్ని టాక్సీవేకు తరలిస్తున్న నేపథ్యంలో చక్రం నుంచి మంటలు చెలరేగాయి.

Also Read: దేవుడి ఆట? ట్రిప్‌కు వెళ్తే టెర్రర్.. కప్పు కొడితే హర్రర్.. విమానమెక్కితే గాల్లోకే ప్రాణాలు!

అప్రమత్తమైన అధికారులు కొన్ని గంటలపాటు శ్రమించి.. మంటలను అదుపు చేశారు. టేకాఫ్ సమయంలో ఈ సమస్య జరిగుంటే.. పెను ప్రమాదమే సంభవించేది.

Related News

Turkey Earthquake: టర్కీని కుదిపేసిన భూకంపం.. ఎటు చూసినా శిథిలాల దిబ్బలు

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

Big Stories

×