Tips For Copper Utensils: రాగి, ఇత్తడి పాత్రలు దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటాయి. అవి ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉండటమే కాకుండా.. ఇంటి అందాన్ని కూడా పెంచుతాయి. అయితే.. కాలక్రమేణా, ఈ పాత్రలపై నలుపు, మరకలు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల పాత్రలు వాటి మెరుపును కోల్పోతాయి. ఇలాంటి పరిస్థితిలో.. రాగి ఇత్తడి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అవసరం.
మార్కెట్లో అనేక రసాయనాలు.. రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ పాత్రలను హోం రెమెడీస్ సహాయంతో ఇంట్లోనే సహజంగా కూడా శుభ్రం చేసుకోవచ్చు. పాత్రలను తెల్లగా మెరిసేలా చేయడానికి ఉపయోగపడే 5 హోం రెమెడీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి, ఇత్తడి పాత్రలను కొత్త వాటిలా మెరిపించేందుకు టిప్స్:
నిమ్మరసం, ఉప్పు వాడకం:
నిమ్మకాయలోని ఆమ్లం, ఉప్పు స్క్రబ్బింగ్ లక్షణాలను కలిగి ఉంటాయి. రాగి, ఇత్తడి పాత్రలను శుభ్రం చేయడానికి సగం ముక్కలు చేసిన నిమ్మకాయను తీసుకొని.. దానిపై కొంచెం ఉప్పు చల్లి, నేరుగా పాత్రపై రుద్దండి. కొన్ని నిమిషాలు రుద్దిన తర్వాత.. గోరువెచ్చని నీటితో పాత్రలను శుభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల ఆక్సీకరణ పొరను తొలగిపోయి.. కొత్తదానిలా మెరుస్తాయి.
బేకింగ్ సోడా, వెనిగర్:
తగిన మోతాదులో బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి మందపాటి పేస్ట్ తయారు చేయండి. దానిని రంగు మారిన రాగి, ఇత్తడి పాత్రలపై అప్లై చేసి కొన్ని నిమిషాలు అలాగే ఉంచి, ఆపై మృదువైన బ్రష్‌తో శుభ్రం చేయండి. ఈ మిశ్రమం రసాయన చర్య ద్వారా నలుపు, మరకలను తొలగిస్తుంది. తరువాత దానిని సాధారణ నీటితో కడిగి ఆరబెట్టండి.
టమాటో రసం, పిండి:
టమాటో రసంలో కొద్దిగా పిండి (మైదా లేదా శనగపిండి) కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని పాత్రపై రుద్ది కొన్ని నిమిషాలు అలాగే ఉంచండి. టమాటోలోని ఆమ్లం గుణం రాగిపై పేరుకుపోయిన దుమ్ము, ధూళిని తొలగించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా ఈ హోం రెమెడీ ఇత్తడి పాత్రలకు చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా పాత్రలు తెల్లగా మెరిసేలా చేయడంలో కూడా ఉపయోగపడుతుంది.
Also Read: బీట్ రూట్ ఫేస్ ప్యాక్‌తో.. మెరిసే చర్మం మీ సొంతం
చింతపండు, ఉప్పు:
చింతపండును గోరువెచ్చని నీటిలో నానబెట్టి దాని నుంచి గుజ్జును తీయండి. దానిలో కొంచెం ఉప్పు వేసి పాత్రలపై రుద్దండి. తరువాత.. నీటితో బాగా కడిగి, క్లాత్‌తో తుడవండి. చింతపండులోని సహజ ఆమ్లం ఆక్సైడ్ పొరను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా ఇది పాత్రలకు మెరుపును తీసుకువస్తుంది. తరువాత.. నీటితో బాగా కడిగి.. క్లాత్‌తో తుడవండి.
ముల్తానీ మిట్టితో శుభ్రపరచడం:
ముల్తానీ మట్టి తేలికగా స్క్రబ్బింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిని నీటిలో కరిగించి పాత్రలపై అప్లై చేసి సున్నితంగా రుద్దండి. చివరగా శుభ్రమైన నీటితో శుభ్రం చేయండి. ఇది పాత్రలకు మెరుపును తీసుకురావడమే కాకుండా పాత్రలపై ఎలాంటి గీతలు పడకుండా చేస్తుంది.
రాగి, ఇత్తడి పాత్రల మెరుపును నిలబెట్టడానికి ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు. వంటగదిలో లభించే పదార్థాలతో వాటిని సులభంగా శుభ్రం చేసి కొత్తగా తయారు చేయవచ్చు. క్రమం తప్పకుండా వీటిని శుభ్రపరచడం వల్ల.. రాగి, ఇత్తడి పాత్రలు చాలా కాలం పాటు ఆకర్షణీయంగా ఉంటాయి.