Holi 2025: భారత్ లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. దేశ వ్యాప్తంగా ప్రజలు అంగరంగం వైభవంగా జరుపుకుంటారు. ఈ నెల 14న హోలీ వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రజలంతా రెడీ అవుతున్నారు. రంగుల పండుగ రోజు అన్ని వయసుల వాళ్లు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. భారత్ తో పాటు ఇతర దేశాల్లోనూ హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. ఇంతకీ అవేంటంటే..
హోలీ వేడులకు జరుపుకునే ఇతర దేశాలు
⦿ పాకిస్తాన్
హోలీ సంబురాలు భారత్ లో ఎలా జరుగుతాయో పాకిస్తాన్ లోనూ అలాగే జరుగుతాయి. పాకిస్తాన్ లో ఎంతో మంది హిందువులు నివసిస్తున్నారు. సింధ్ ప్రావిన్స్, కరాచీ, లాహోర్ సహా పలు ప్రధాన నగరాల్లో హిందువులు జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్లంతా హోలీ సంబురాలను వైభవంగా జరుపుకుంటారు. హిందూ దేవాలయాలు, కమ్యూనిటీ హాళ్లలో ఈ వేడుకలను జరుపుకుంటారు. హిందూ ప్రజలంతా ఒకరిపై మరొకరు రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకుంటారు.
⦿ బంగ్లాదేశ్
మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లోనూ హోలీ వేడుకలు ఘనంగా జరుగుతాయి. బంగ్లాదేశ్ లోనూ హిందువులు పెద్ద సంఖ్యలో ఉంటారు. ఢాకా, చిట్టాగాంగ్, సిల్హెట్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో హిందువులు నివసిస్తారు. ఆయా ప్రాంతాల్లో హోలీ వేడుకలు ఘనంగా వైభవంగా జరుపుకుంటారు. బంగ్లాదేశ్ లో హోలీని డోల్ పూర్ణిమా లేదంటే బసంత ఉత్సవం అని కూడా పిలుస్తారు. అక్కడి హిందూ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత, అందరూ కలిసి రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు.
⦿ నేపాల్
నేపాల్ లోనూ హోలీ సంబురాలు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ హిందూ పండుగలు ఘనంగా జరుపుకుంటారు. నేపాల్ లో హోలీ పండుగను ఫాగు పౌర్ణమి పేరుతో పిలుస్తారు. ఖాట్మండు, పోఖారా సహా పలు ప్రధాన నగరాల్లో ప్రజలు రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తారు. అచ్చం భారత్ లో మాదిరిగానే ఇక్కడ హోలీ సంబురాలు జరుగుతాయి.
⦿ మారిషస్
మారిషస్ లోనూ పెద్ద సంఖ్యలో భారతీయులు నివసిస్తున్నారు. అక్కడ ఉన్న ఇక్కడి ప్రజలు హోలీ సంబురాలను ఘనంగా జరుపుకుంటారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ లో మాదిరిగా ఇక్కడ హోలీ వేడుకలు చేసుకుంటారు. హోలీ రోజున మారిషస్ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సెలవు దినాన్ని ప్రకటించింది.
⦿ ఫిజీ
ఫిజీలోనూ భారతీయులు ఎక్కువగానే నివసిస్తారు. యూపీ, బీహార్ నుంచి వలస వచ్చిన ప్రజలు ఇక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడ్డారు. వాళ్లు ఉత్తరాది సంప్రదాయాల ప్రకారం ఇక్కడ హోలీ వేడులకు జరుపుకుంటారు. సంప్రదాయా సంగీతం, నృత్యాలతో ఈ వేడుకలు జరుపుకుంటారు.
Read Also: రంగు రాసి ముద్దు పెట్టబోయిన ప్రియుడు.. రెప్పపాటులో దవడ పగుల్స్!
⦿ అమెరికా, లండన్, ఆస్ట్రేలియా
భారతీయులు ఈ దేశాల్లో పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. వారంతా హోలీ రోజున పెద్ద ఎత్తున హోలీ సంబురాలు జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ఎక్కువగా నివసించే పలు దేశాల్లో హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
Read Also: ఈ ఏడాది హోలీ పండుగ ఎప్పుడు జరుపుకుంటారు? ఈ పండుగ వెనుకున్న అసలు కథ ఏంటి?