Meenakshi Chaudhary: ప్రముఖ బ్యూటీ మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఈ మధ్యకాలంలో వరుస చిత్రాలలో నటించడమే కాదు ఆ చిత్రాలతో భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ‘ఇచ్చట వాహనములు నిలపరాదు’ అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈమె, ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజ(Raviteja) నటించిన ‘ఖిలాడీ’ సినిమాతో మాస్ పాటకు స్టెప్పులేసి ఆకట్టుకుంది. తన అందాలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెట్టిన ఈమె, అడివి శేష్ (Adivi Shesh) సరసన ‘హిట్ -2’ సినిమాలో నటించి, మరో విజయాన్ని అందుకుంది. వాస్తవానికి కెరియర్ బిగినింగ్ లో కాస్త స్లోగా సినిమాలు చేసినా.. ఇప్పుడు వరుస సినిమాలతో భారీ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ దూసుకుపోతోంది.
వరుస సినిమాలతో బిజీగా మారిన మీనాక్షి చౌదరి..
ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) సినిమాలో నటించే అవకాశాన్ని అందుకుంది. అలా మహేష్ బాబు చివరిగా నటించిన ‘గుంటూరు కారం’ సినిమాలో నటించి ఆకట్టుకుంది. తర్వాత విశ్వక్ సేన్(Vishwak Sen), వరుణ్ తేజ్(Varun Tej), దుల్కర్ సల్మాన్ (Dulquer Salman) హీరోలుగా నటించిన సినిమాలలో కూడా నటించి ఆకట్టుకుంది. సంక్రాంతికి విడుదలైన వెంకటేష్ (Venkatesh)మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు ఇప్పుడు కొన్ని తెలుగు సినిమాలకు ఓకే చేసిన ఈమె, మరొకవైపు తమిళ సినిమాల షూటింగ్లో కూడా బిజీగా ఉంది.
నాకు భర్తగా వచ్చే వాడికి అలాంటి లక్షణాలు ఉండాలి..
ఇదిలా ఉండగా ఒకవైపు పలు సినిమా షూటింగ్లలో నటిస్తూనే.. మరొకవైపు జువెలరీ షాప్ ఓపెనింగ్లకు కూడా గెస్ట్ గా వెళ్తూ భారీగానే సంపాదిస్తోంది. అలాగే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే అన్నట్టు.. తన కాబోయే వాడు ఎలా ఉండాలో ఆ విషయాలు చెప్పి పెళ్లిపై బోలెడు ఆశలు పెంచుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ..”నాకు భర్తగా వచ్చేవాడు నాలాంటి వాడై ఉండాలి. అచ్చం నేను ఎలా ఆలోచిస్తానో అలాగే ఆలోచించాలి. టోటల్ గా నాలాంటి స్వభావం కలిగిన వ్యక్తి దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను” అంటూ మీనాక్షి చౌదరి పెళ్లిపై క్లారిటీ ఇచ్చింది. ఇక మొత్తానికి అయితే తనకు కాబోయే వాడు తన మేల్ వర్షన్ లా ఉండాలి అంటూ హింట్ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. మరి అలాంటివాడు ఎప్పుడు దొరుకుతాడో చూడాలి. కట్టు బొట్టుతో సాంప్రదాయంగా కనిపించడమే కాకుండా గ్లామర్ గా కూడా కనిపించి ఆకట్టుకోవడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. అలా అందచందాలతో యువతను ఆకర్షిస్తున్న మీనాక్షి చౌదరి తనలాంటి వాడే భర్తగా రావాలని కోరుకుంటోంది.మరి మీనాక్షి కాబోయే భర్త ఎక్కడున్నాడో..?ఏం చేస్తున్నాడో..? అని నెటిజెన్స్ కూడా సరదాగా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక మీనాక్షి చౌదరి విషయానికి వస్తే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈమె అభిమానులకు చేరువ అవ్వడానికి నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాదు ఫ్యామిలీతో కలిసి వెకేషన్స్ కి వెళ్తూ ఆ ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ ఉండటం గమనార్హం.