BigTV English

Nails Health : బొటనవేలి గోరులో పగుళ్లు.. ఆ ఇన్ఫెక్షన్ కావచ్చు..!

Nails Health : బొటనవేలి గోరులో పగుళ్లు.. ఆ ఇన్ఫెక్షన్ కావచ్చు..!
Nails Health
Nails Health

Nails Health : మీరు ఆరోగ్యంపై ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో మీ కాలి గోళ్లను చూస్తే తెలిసిపోతుంది. మగువలు వీటిని అవందంగా పెంచడానికి నానా అవస్థలు పడుతుంటారు. రకరకాల నెయిల్ పాలిష్‌లు వేసి గోళ్లకు అందమైన లుక్ ఇస్తారు. అంతేకాకుండా పెడిక్యూర్‌తో వాటికి మరింత అందాన్ని ఇస్తారు. ఇలా గోళ్లపట్ల శ్రద్ధ చూపడం మంచిదే. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవినశైలి కారణంగా కాలి గోళ్లు దెబ్బతింటున్నాయి. అయితే చాలా మంది దీన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీనివల్ల గోళ్లలో ఇన్ఫెక్షన్ చేరి పాడవుతాయి. ఇది ఎలాంటి నొప్పిని లేదా అసౌకర్యాన్ని కలిగించదు. కానీ మీరు సమయానికి శ్రద్ధ చూపకపోతే అది తీవ్రంగా మారుతుంది.


బొటనవేలులో ప్రారంభమయ్యే ఈ ఇన్ఫెక్షన్ ఇతర వేళ్లకు కూడా వ్యాపిస్తుంది. మీరు ఎక్కువసేపు షూస్‌లో ఉంటే ఇలా జరిగే అవకాశం ఉంది. ఈ ఇన్ఫెక్షన్ల కారణంగా.. బొటనవేలు గోర్లు విరిగిపోతాయి. వాటి ఆకారం, రంగు మారడం ప్రారంభమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ నుండి బయటపడటానికి మీరు ఈ ఇంటి చిట్కాలు పాటించండి.

Also Read : అవకాడో అద్భుతాలు.. తెలిస్తే వావ్ అనాల్సిందే!


కొబ్బరి నూనే

కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్ క్యాప్రిలిక్ యాసిడ్ ఫంగల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో చాలా వరకు ప్రభావవంతంగా ఉంటుంది. ఇన్ఫెక్షన్ వస్తే ఇయర్ బడ్స్ సహాయంతో గోళ్లపై అప్లై చేయండి. రాత్రంతా అలాగే ఉంచండి. నూనె రాసుకున్న తర్వాత సాక్స్ వేసుకోవాలి. మీరు కొన్ని వారాల్లో తేడాను చూడటం ప్రారంభిస్తారు.

మౌత్‌వాష్‌

మీరు మౌత్‌వాష్‌తో గోళ్ల ఇన్ఫెక్షన్లను కూడా వదిలించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో ఆల్కహాల్ ఉంటుంది. ఇది హానికరమైన ఫంగస్‌ను దూరంగా ఉంచే అద్భుతమైన మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఒక చిన్న బకెట్‌లో 3-4 కప్పుల చల్లటి నీటిని పోసి దానికి 1/4 కప్పు లిస్టరిన్ జోడించండి. ఈ ద్రావణంలో మీ పాదాలను ముంచి సుమారు 30 నిమిషాల పాటు ఉంచండి. తర్వాత తుడిచి ఆరబెట్టాలి.

Also Read : మందులు వాడకుండా డయాబెటిస్ కంట్రోల్ చేయడం ఎలా?

విక్స్ వాపోరుబ్

Vicks Vaporub కూడా గోరు ఇన్ఫెక్షన్లతో వ్యవహరించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో కర్పూరం, మెంథాల్, యూకలిప్టస్ ఆయిల్ వంటి అనేక పదార్థాలు ఉన్నాయి. ఇది దాని చికిత్సలో సహాయపడుతుంది. ఇందులో కర్పూరం, యూకలిప్టస్ ఆయిల్ ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియాను చంపడానికి పని చేస్తాయి. అయితే మెంథాల్ ఇన్ఫెక్షన్ పెరగకుండా నిరోధిస్తుంది. విక్స్ వాపోరబ్‌ను ఇయర్‌బడ్స్‌లో ఉంచండి.  రోజుకు కనీసం రెండుసార్లు మీ కాలి వేళ్లకు అప్లై చేయండి.

Disclaimer : ఈ కథనాన్ని పలు మెడికల్ జర్నల్స్‌లోని సమాచారం ఆధారంగా అందిస్తున్నాం. దీనిని అవగాహనగా మాత్రమే భావించండి.

Related News

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Oral Health: వర్షాకాలంలో తరచూ వచ్చే గొంతు నొప్పికి.. ఈ టిప్స్‌తో చెక్ !

Diabetic Patients: షుగర్ పేషెంట్లు ఎలాంటి ఫుడ్ తినాలో తెలుసా ?

Big Stories

×