తలనొప్పిని ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం చేస్తారు. అలసట వల్ల, నిద్రలేమి వల్ల, ఒత్తిడి వల్ల తలనొప్పి వస్తుందని అనుకుంటారు. కానీ ఒక్కోసారి అది బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా రావచ్చు. ప్రతి యేటా బ్రెయిన్ ట్యూమర్ వల్ల మరణిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది. మీకు తరచూ తలనొప్పి వస్తూ ఉంటే దాని నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి వైద్యులను కలిసి తగిన టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రాణాంతక వ్యాధుల్లో బ్రెయిన్ ట్యూమర్ కూడా ఒకటి. ప్రతి ఏటా రెండున్నర లక్షల మంది బ్రెయిన్ ట్యూమర్ కారణంగానే మరణిస్తున్నారు. మెదడులో మొదలైన కణితి పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. చిన్న కణితిగా ఉన్నప్పుడు నుంచే కొన్ని లక్షణాలను చూపిస్తుంది. వాటిలో తలనొప్పి కూడా ఒకటి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్లకి తలనొప్పి తీవ్రంగా వస్తుంది. తరచూ తలనొప్పి దాడి చేస్తూ ఉంటుంది. కాబట్టి తలనొప్పిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి.
బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏమిటి?
మెదడు చుట్టూ ఉన్న కణాలు అనియంత్రణగా పెరుగుతూ కనితిలా ఏర్పడతాయి. ఆ కణితి క్యాన్సర్ గా మారిపోతుంది. అధ్యయనాలు చెబుతున్న ప్రకారం మెదడులో 120 కంటే ఎక్కువ రకాల కణితులు ఏర్పడే అవకాశం ఉంది. మీ కుటుంబంలో ఎవరికైనా బ్రెయిన్ ట్యూమర్ ఉంటే మీ వారసులు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే ఇది వారసత్వంగా వచ్చే వ్యాధి కూడా అలాగే ప్లాస్టిక్, కెమికల్స్ పరిశ్రమల్లో పనిచేసే వారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువే. అలాగే జీవనశైలి చెడు ఆహార అలవాట్ల వల్ల కూడా బ్రెయిన్ ట్యూమర్ రావచ్చు .
బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు
బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళలో తలలో తరచుగా విపరీతమైన నొప్పి వస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట ఈ నొప్పి పెరిగిపోతుంది. తీవ్ర ఒత్తిడిగా అనిపిస్తుంది. వికారంగా, వాంతులు వస్తున్నట్టు అనిపిస్తుంది. దృష్టి అస్పష్టంగా మారుతుంది. చేతులు, కాళ్లలో వణుకుతున్న సెన్సేషన్ కలుగుతుంది. శారీరక సమతుల్యత తప్పుతుంది. మాట్లాడడంలో ఇబ్బంది ఎదురవుతుంది. జ్ఞాపకశక్తి సమస్యలు మొదలవుతాయి. తరచూ తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
మెదడులో కణితి ఏర్పడితే ప్రతిదీ ప్రాణాంతక క్యాన్సర్ అని చెప్పలేము. కొన్ని కణితులు సాధారణంగా పెరుగుతాయి. అవి క్యాన్సర్ గా రూపాంతరం చెందకపోవచ్చు. సకాలంలో గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్ది ఊబకాయం బారిన పడిన వారిలోనూ బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తలనొప్పిని తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.