BigTV English

C Section: సిజేరియన్ చేయించుకున్న మహిళలకు జీవితాంతం వెన్నునొప్పి వస్తుందా?

C Section: సిజేరియన్ చేయించుకున్న మహిళలకు జీవితాంతం వెన్నునొప్పి వస్తుందా?

సాధారణ డెలివరీకి, సి సెక్షన్ డెలివరీకి ఎంతో తేడా ఉంది. సహజ ప్రసవంలో ఎలాంటి కోతలు లేకుండా బిడ్డ ఈ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. సి సెక్షన్ డెలివరీలో మాత్రం వీపు భాగంలో ఒక ఇంజక్షన్ ను ఇస్తారు. ఆ తరువాతే పొట్ట కింది భాగంలో కోతను పెట్టి డెలివరీ చేస్తారు.


సి సెక్షన్ డెలివరీ సమయంలో వీపు భాగంలో ఇచ్చే ఇంజక్షన్ ను స్పైనల్ అనస్తీసియా లేదా ఎపిడ్యూరల్ అని అంటారు. ఈ ఇంజక్షన్ వెన్నుపామును బలహీనపరుస్తుందని, దీర్ఘకాలికంగా జీవితాంతం వెన్ను నొప్పి రావడానికి కారణం అవుతుందని ఎంతోమంది మహిళలు భావిస్తారు. దీనికి గైనకాలజిస్టులు ఎలాంటి సమాధానం చెబుతున్నారో తెలుసుకుందాం.

ఇన్ స్టాగ్రామ్‌లో ఒక గైనకాలజిస్ట్ చెప్పిన ప్రకారం సి సెక్షన్ డెలివరీలో ఇచ్చే ఇంజక్షన్ వల్ల జీవితాంతం నడుము నొప్పి వస్తుందన్నది పూర్తిగా అపోహ. సి సెక్షన్ సమయంలో ఇచ్చే ఇంజక్షన్‌కు తర్వాత వచ్చే వెన్నునొప్పి లేదా నడుము నొప్పికి ఎటువంటి సంబంధం లేదని ఆ గైనకాలజిస్ట్ వివరిస్తున్నారు.


వైద్యులు చెబుతున్న ప్రకారం సీ సెక్షన్ డెలివరీలో ఇచ్చే ఇంజక్షన్ వెన్నుపామును బలహీన పరుస్తుందని చెప్పే శాస్త్రీయ పరిశోధన కానీ, ఆధారాలు కానీ ఇప్పటివరకు లేవు. ఇది కేవలం ఒక అపోహగా ప్రజల్లో ఉండిపోయింది. అందులో ఏమాత్రం నిజం లేదని అంటున్నారు వైద్యులు

వంగి కూర్చుంటేనే నడుము నొప్పి
మహిళల్లో సి సెక్షన్ తర్వాత నడుము నొప్పి లేదా వెన్నునొప్పి రావడానికి కారణం వారు తప్పుగా కూర్చోవడమేనని చెబుతున్నారు. ప్రసవం తర్వాత పుట్టిన శిశువును చూసుకునేటప్పుడు మహిళలు ఎక్కువ సమయం వంగి కూర్చుని ఉంటూ ఉంటారు. ఇది వెన్నుపాముపై ఒత్తిడిని పెంచుతుంది. క్రమంగా అది దీర్ఘకాలిక సమయంలో నొప్పిగా మారుతుంది. కాబట్టి ప్రసవం అయిన తర్వాత వీపుకు ఎలాంటి మద్దతు లేకుండా వంగి కూర్చోవడం మానేయాలి.

ఇలా కూర్చొంటే నొప్పి రాదు
కూర్చున్నప్పుడు వీపును వంగి ఉంచడం వల్ల వెన్ను నొప్పి త్వరగా వస్తుంది. కాబట్టి కూర్చున్నప్పుడు వీపు నిటారుగానే ఉంచాలి. వెన్నుముకపై ఒత్తిరి పడకుండా చూసుకోవాలి. అలాగే ఎక్కువసేపు నిటారుగా కూర్చోలేరు. కాబట్టి వెనుక భాగంలో ఒక దిండును సపోర్టుగా పెట్టుకోవాలి. ఇది నడుముకు తగినంత మద్దతుని ఇస్తుంది. వెన్నుముఖ అలసిపోకుండా, వెన్నుముకపై ఒత్తిడి పడకుండా కాపాడుతుంది. ఇలా చేస్తే ఎలాంటి నడుము నొప్పి లేదా వెన్నునొప్పి మహిళలకు రాదు.

సి సెక్షన్ సమయంలో ఇచ్చే అనస్తీషియనా ఇంజక్షన్ వల్ల మాత్రం నడుము నొప్పిగాని, వెన్నునొప్పి గాని జీవితాంతం వేధించే అవకాశం లేదని వైద్యులు చెబుతున్నారు.

Related News

Coconut Benefits: రాత్రి పూట కొబ్బరి తింటే.. మతిపోయే లాభాాలు !

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు !

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Big Stories

×