BigTV English

Cholesterol Symptoms: మీ పాదాలలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే రక్తంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోయినట్టే

Cholesterol Symptoms: మీ పాదాలలో ఈ ఐదు లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే రక్తంలో అధిక కొలెస్ట్రాల్ పెరిగిపోయినట్టే

అధిక కొలెస్ట్రాల్ సమస్య ఇప్పుడు ఎక్కువ మందిని భాదిస్తోంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగుపోతే అది ఆయుష్షుని తగ్గించేస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రాణాంతక పరిస్థితులకు దగ్గర చేస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.


శరీరంలో సాధారణంగా కొలెస్ట్రాల్ ఉంటుంది. అయితే అది అవసరానికి మించి ప్రమాదకరమైన స్థాయికి చేరుకున్నప్పుడే కొన్ని లక్షణాల ద్వారా శరీరం ఆ విషయాన్ని బయటకి చెబుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతే ధవనులు ఇరుకుగా మారిపోతాయి. దానివల్ల ధమనుల్లో రక్తప్రసరణ సరఫరా సరిగా జరగదు. దీంతో గుండెపోటు వంటి సమస్యలు వస్తాయి.

ధమనుల్లో ఎప్పుడైతే కొలెస్ట్రాల్ పేరుకుపోయి సగానికి పైగా మూసుకుపోతాయో… కాళ్లకు తగినంత రక్తం, ఆక్సిజన్ సరఫరా అందదు. ముఖ్యంగా పాదాలలో రక్త సరఫరా చాలా వరకు తగ్గిపోతుంది. అలాంటప్పుడు కాలు లేదా పాదాల్లో మీకు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే మీకు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలో అధికంగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి.


కాళ్లు, పాదాల్లో కనిపించే అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు
ధమనుల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోతే సాధారణంగా కనిపించే లక్షణం కాళ్లు లేదా పాదాలలో విపరీతంగా తిమ్మిరి పట్టడం, కండరాలు నొప్పి పెట్టడం. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు కూడా కండరాలు నొప్పిగా అనిపిస్తాయి. ఇలా జరుగుతూ తరచూ జరుగుతూ ఉంటే కొలెస్ట్రాల్ స్థాయిలు ఎంత ఉన్నాయో చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది.

చల్లని పాదాలు
పాదాలు తరచూ చల్లగా మారుతూ ఉంటే వాటికి రక్తప్రసరణ సరిగా జరగడం లేదని అర్థం చేసుకోవాలి. ధమనులు కొలెస్ట్రాల్ తో నిండిపోయి ఇరుకుగా మారినప్పుడు ఇలా రక్తం సరఫరా సరిగ్గా జరగదు. దీనివల్ల పాదాల ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. పాదాలు చల్లగా మారిపోతాయి.

విపరీతంగా తిమ్మిరి పెట్టడం
రక్తం తగ్గిపోవడం వల్ల శరీరంలోని నరాలు ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా పాదాలు, కాలి వేళ్ళ వరకు వెళ్లే నరాలలో ఈ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. దీనివల్ల పాదాలు లేదా కాలివేలు దగ్గర తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తుంది. జలదరింపుగా కూడా ఉంటుంది. ముఖ్యంగా నిద్రపోతున్నప్పుడు కాళ్లలో నరాలు సాగదీయాలనిపిస్తుంది. ఇది కూడా అధిక కొలెస్ట్రాల్ ఫలితంగానే జరుగుతుంది.

రంగు మారడం
ధనుల్లో కొవ్వు పేరుకుపోతే రక్తప్రసరణ సవ్యంగా జరగదు. దీనివల్ల పాదాల చర్మం రంగు కూడా మారిపోతుంది. ఆ చర్మం రంగు పసుపు రంగులోకి లేదా పాలిపోయిన రంగులోకి మారుతుంది. రక్తప్రసరణ సవ్యంగా జరిగితే లేత గులాబీ రంగులో ఉంటాయి కాళ్ల పాదాలు.

గోళ్ళల్లో కనిపించే మార్పులు
రక్త సరఫరా కాళ్ళకు సరిగ్గా జరగకపోతే కాలి గోర్లు నెమ్మదిగా పెరగడం ప్రారంభమవుతాయి. అవి మందంగా, వంకరగా పెరుగుతాయి. వాటి రంగు కూడా మారిపోతుంది. మీ గోళ్ళల్లో ఇలాంటి మార్పులు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు. దీనికి అధిక కొలెస్ట్రాల్ కారణం కావచ్చు.

అధిక కొలెస్ట్రాల్ ఎలా తగ్గించుకోవాలి?
అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి ఏం చేయాలని ఎంతోమంది ఆలోచిస్తూ ఉంటారు. అధిక కొలెస్ట్రాల్ నియంత్రించడానికి మీ జీవనశైలిని మార్చుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. కొవ్వు ఉండే ఆహారాన్ని తగ్గించాలి. ముఖ్యంగా నూనె, ఉప్పు, చక్కెర వాడకాన్ని పరిమితం చేయాలి. ప్రతిరోజు కనీసం అరగంట పాటు వాకింగ్ చేయాలి. తేలికపాటి వ్యాయామాలను చేసి బరువును అదుపులో ఉంచుకోవాలి. అలాగే ధూమపానం, మద్యపానం బట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అప్పుడే శరీరంలో అధిక కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంటుంది.

Related News

Onion juice: జుట్టుకు ఉల్లిపాయ రసం రాస్తున్నారా? వీటిని కలిపితే..

Home remedies: కఫం, జలుబు వేధిస్తున్నాయా? ఈ సింపుల్ హోమ్ రెమిడీతో ఇట్టే మాయమైపోతాయి

Independence day Recipes: ఇండిపెండెన్స్ డేకు మూడు రంగుల్లో పులావ్, దోశ చేసి దేశభక్తిని చాటుకోండి

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.. స్పెషల్ కోట్స్, విషెస్ చెప్పండిలా..

Independence Day 2025: స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్ట్ 15న జరుపుకోవడానికి వెనక ఇంత కథ ఉందా ?

Acidity: క్షణాల్లోనే.. అసిడిటీని తగ్గించే బెస్ట్ టిప్స్ ఇవే !

Big Stories

×