BigTV English

Couple Divorce: పెళ్ళి అయ్యాక.. చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారా?

Couple Divorce: పెళ్ళి అయ్యాక.. చిన్న చిన్న గొడవలకే విడిపోతున్నారా?

Couple Divorce: సంసార నావను దరికి చేర్చాలన్నా కుటుంబమనే బండి సజావుగా ముందుకు నడవాలన్నా భార్యాభర్తల మధ్య సఖ్యత ముఖ్యం. పిల్లల భవిష్యత్తుకు కూడా ఇది కీలకమే. అయితే ఇటీవల విడాకుల కేసులు పెరిగిపోతున్నాయి. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు ఈ విషయంలో కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. మారుతున్న సామాజిక, ఆర్థిక పరిస్థితులు, చిన్న కుటుంబాలు పెరిగిపోవటం, సామాజిక మాధ్యమాలు వీటిలో ప్రముఖపాత్ర పోషిస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహాలే కాదు. ప్రేమ పెళ్లిళ్లు కూడా పెటాకులు అవుతుండటం భార్యభర్తల సంబంధానికి తీవ్ర విఘాతంగా మారింది.


రోజురోజుకీ పెరుగుతున్న విడాకులు:
భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరుంది. అలాంటి దేశంలోనే కొంతకాలంగా విడాకులు తీసుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం విడాకుల ట్రెండ్ నడుస్తోంది. కొన్ని కారణాలు చాలా చిన్నగా, వింతగా అనిపించినా కోర్టు మెట్లు ఎక్కుతున్న వారి సంఖ్య పెరుగుతూనే వస్తోంది. వీరిలో చదువుకున్న వారు కూడా ఎక్కువ ఉంటున్నారు.

ఆర్థిక స్వాతంత్య్రం, మారుతున్న సామాజిక పరిస్థితులు, తానే గొప్ప అనే ధోరణులు ఇలా విడిపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలకు కారణం అవుతున్నాయి. పెరిగి పెరిగి విభేదాలుగా మారి తర్వాతి కాలంలో గొడవలకు దారి తీస్తున్నాయి. సర్దుబాటు చేసుకోలేని క్రమంలో గొడవలు పెరిగి పోలీసు కేసులు, కోర్టులు చివరకు విడాకులతో పరిసమాప్తి అవుతోంది. భార్యభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుంటే కుటుంబ బాధ్యతలు పంపకం, ఇంటి పనులు, పిల్లల పెంపకం వంటి విషయాల్లో గొడవలు వస్తున్నాయి.


బాధ్యతల విషయంలో తేడాలు:
గతంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉండేది. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు జరిగేవి. కాలానుగుణంగా ఈ పరిస్థితిలో మార్పులు వచ్చాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు వచ్చాయి. అప్పట్లో భార్యాభర్తల మధ్య ఏవైనా విభేదాలు వస్తే ఇంటిపెద్ద పరిష్కరించే వారు. ఇద్దరి తరపు పెద్దవారు కూర్చుని 4 గోడల మధ్యే వారి మధ్య అంతరాన్ని తొలగించేవారు. దంపతులు ఇద్దరూ ఉద్యోగస్థులైతే బాధ్యతల పంపకాల విషయంలో తేడాలు వస్తున్నాయి. మరికొందరు కంప్యూటర్లు, సెల్‌ఫోన్లతో పని చేస్తూ సంసార జీవితానికి దూరమవుతున్నారు.

బంధానికి బీటలు:
గణాంకాలు, కేసుల బట్టి చూస్తే నేటి సమాజంలో పెళ్లి ఎంత సహజమో, విడాకులు కూడా అంతే అనే పరిస్థితి కనిపిస్తోంది. విడాకులకు దారి తీసే పరిస్థితులు, కారణాలపై జరిపిన సర్వేలో చాలారకాల కారణాలు వెల్లడయ్యాయి. వాటిలో 7రకాల కారణాలు అందరిలో కామన్‌గా కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు, వివాహేతర సంబంధాలతో మోసం, ప్రేమ లేకపోవడం, అత్యాశ, ఇష్టం లేని పెళ్లి, శారీరక సాన్నిహిత్యం లేకపోవడం, సాన్నిహిత్య లోపం. మానసికంగా ఒంటరిగా ఉన్నప్పుడు జంటగా ఒకే ఇంట్లో నివసించినా అందులో జీవం ఉండదు. ఫలితంగా కాలం గడిచే కొద్దీ ఆ బంధం బీటలు వారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు:
ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి? అసలు పెళ్లి చేసుకోవాలా, వద్దా? అనేవి వ్యక్తిగత అంశాలు. మన దేశంలో పెళ్లికి ఇప్పటికీ చాలా ప్రాధాన్యం ఉంది. సహ జీవనానికి చట్టాలు అనుమతిస్తున్నా అందులో విడాకులకు అవకాశాలు లేవు. దేశంలో అన్ని మతాల్లోనూ పెళ్లి ప్రాధాన్యత తగ్గలేదు. కాకపోతే వివాహాలు కాలానికి అనుగుణంగా మారుతున్నాయి. కులాంతర, మతాంతర వివాహాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో విడాకులు పెరుగుతున్నాయి. ఓ జంట విడాకులు కోరటానికి చాలా కారణాలు ఉండొచ్చు.

అమ్మాయి, అబ్బాయి మధ్య అవగాహన ముఖ్యం:
విడాకుల శాతం తగ్గాలంటే వివాహ వ్యవస్థలోనూ మార్పులు రావాలి. కట్నాలు, లాంఛనాలు భారీగా తీసుకుంటే తర్వాత వచ్చే సమస్యలు కూడా అలాగే ఉంటున్నాయి. పెళ్లికి ముందే రెండు కుటుంబాల పెద్దలు కూర్చుని మాట్లాడుకోవాలి. కట్నకానుకలు, ఉద్యోగం జీతభత్యాలే కాక అబ్బాయి, అమ్మాయి మధ్య అవగాహన ముఖ్యం. అలాగే వారిద్దరి ఆరోగ్యాలు ముఖ్యం. ఇటీవల చాలామంది పెళ్లికి ముందే వైద్య పరిక్షలు చేయించుకుంటున్నారు. సంబంధిత ధృవపత్రాలు కూడా రెండు కుటుంబాల వారు ఇచ్చిపుచ్చుకుంటున్నారు. అలాగే కుటుంబ బాధ్యతల విషయంలో కూడా చూచాయగా మాట్లాడుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Also Read: సమ్మర్‌లో రోజ్ వాటర్ ఇలా వాడితే.. మచ్చలేని చర్మం

ఏది ఏమైనా దంపతులు ప్రేమ, ఆప్యాయతలు, అవగాహనతో జీవనం సాగిస్తేనే విడాకులు తగ్గుతాయి. గొడవలకు దిగకుండా కలిసి మాట్లాడుకుంటే సంసార బంధం కలకాలం నిలిచి ఉంటుంది. పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకుంటే కాపురం పచ్చగా సాగిపోతుంది.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×