Rose Water For Skin: వేసవి కాలం రాగానే చర్మంపై ఎండ, దుమ్ము, చెమట ప్రభావాలు కనిపించడం ప్రారంభిస్తాయి. ముఖం అలసిపోయినట్లు కనిపిస్తుంది. చర్మం జిగటగా కూడా మారుతుంది. అంతే కాకుండా సహజ మెరుపు మాయమైనట్లు అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితిలో.. చర్మాన్ని తాజాగా ఉంచడమే కాకుండా ఉపశమనాన్ని అందించేందుకు రోజ్ వాటర్ ఉపయోగించవచ్చు. వేసవిలో రోజ్ వాటర్‌ను 5 విధాలుగా వాడితే చర్మం రంగు మెరుస్తుంది. అంతే కాకుండా మృదువుగా మారుతుంది.
రోజ్ వాటర్ ఒక సాంప్రదాయ, ప్రభావవంతమైన బ్యూటీ ప్రొడక్ట్. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది కానీ లోపలి నుండి హైడ్రేట్ చేస్తుంది. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేయడంతో పాటు ఎండ వల్ల కలిగే మంటను తగ్గిస్తుంది.
రోజ్ వాటర్ ను 5 విధాలుగా ఉపయోగించవచ్చు:
సహజ టోనర్‌గా ఉపయోగించండి:
రోజ్ వాటర్‌లో ఉండే యాంటీసెప్టిక్ , యాంటీ బాక్టీరియల్ గుణాలు చర్మాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడతాయి. అంతే కాకుండా వేసవిలో మీ చర్మం జిడ్డుగా అనిపిస్తే అలాంటి సమయంలో రోజ్ వాటర్ ను కాటన్ మీద తడిపి మీ ముఖంపై సున్నితంగా అప్లై చేయండి. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. అంతే కాకుండా అవసరమైన తేమను కూడా అందిస్తుంది.
రిఫ్రెషింగ్ ఫేస్ :
వేసవిలో మీ ముఖం అలసిపోయినట్లు అనిపిస్తే.. రోజ్ వాటర్‌ను స్ప్రే బాటిల్‌లో నింపండి. రోజుకు 2-3 సార్లు స్ప్రే చేయండి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. అంతే కాకుండా తేమగా కూడా ఉంచుతుంది. దీని తాజాదనం ప్రభావం వెంటనే కనిపిస్తుంది. ఫలితంగా చర్మం మెరుస్తూ ఉంటుంది.
ఫేస్ ప్యాక్ తో వాడండి:
మీరు రోజ్ వాటర్ ను ముల్తానీ మిట్టి, శనగపిండి లేదా గంధపు చెక్క వంటి మీ ఫేస్ ప్యాక్ లలో దేనితోనైనా కలపవచ్చు. ఇది చర్మాన్ని తేమగా ఉంచి చల్లబరుస్తుంది. వేడి కారణంగా కాలిపోయిన లేదా టాన్ అయిన చర్మంపై ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అలాగే.. ఇది చర్మాన్ని శుభ్రంగా , ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది.
Also Read: మీ కిచెన్‌లో ఇవి ఉంటే.. ఫుల్ టైం సేవ్ తెలుసా ?
కంటి సంరక్షణ:
కంటి అలసట నుండి ఉపశమనం అందించడంలో కూడా రోజ్ వాటర్ సహాయపడుతుంది. రోజ్ వాటర్ లో కాటన్ నానబెట్టి.. వాటిని కళ్ళపై 10 నిమిషాలు ఉంచండి. ఇది చల్లదనాన్ని అందించడమే కాకుండా డార్క్ సర్కిల్స్ తగ్గించడంలో సహాయపడుతుంది. మీరు స్క్రీన్‌ను ఎక్కువ సమయం చూసినట్లయితే ఈ పద్ధతి చాలా ప్రభావవంతంగా ఉంటుంది.
మృదువైన మేకప్ రిమూవర్:
మీకు రసాయనాలు లేని మేకప్ రిమూవర్ కావాలంటే.. రోజ్ వాటర్‌లో కొద్దిగా అలోవెరా జెల్ లేదా జోజోబా ఆయిల్ కలిపి ప్రయత్నించండి. ఈ మిశ్రమం చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. అంతే కాకుండా రుద్దకుండానే మేకప్ తొలగించడంలో సహాయపడుతుంది. తద్వారా వేసవిలో చర్మంపై ఎటువంటి అదనపు ఒత్తిడి ఉండదు.
వేసవిలో రోజ్ వాటర్ వాడటం వల్ల చర్మానికి తగిన తేమ అందుతుంది. అంతే కాకుండా మీ చర్మం తాజాగా , ఆరోగ్యంగా ఉంటుంది.