BigTV English

About Jelly: జెల్లీని జంతువుల కొవ్వుతో తయారు చేస్తారా? తినే ముందు ఇది తెలుసుకోండి

About Jelly: జెల్లీని జంతువుల కొవ్వుతో తయారు చేస్తారా? తినే ముందు ఇది తెలుసుకోండి

About Jelly: జెల్లీని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. ఎంతో టేస్టీగా అనిపించే జెల్లీలను కొనుక్కునేందుకు.. పిల్లలు షాపులలో ఎగబడుతుంటారు. వీటిని సాధారణంగా టోస్ట్‌పై స్ప్రెడ్‌గా, డెసర్ట్‌లలో, స్వీట్‌లలో ఉపయోగిస్తారు. అసలు జెల్లీలను ఎలా తయారు చేస్తారు..? వీటిలో జంతువులు కొవ్వు, ఇతర భాగాలు ఉంటాయా? అయితే జెల్లీలను తయారు చేస్తున్న వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


జెల్లీ అంటే ఏమిటి?
జెల్లీ సాధారణంగా పండ్ల రసం, చక్కెర, పెక్టిన్ అనే పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. పెక్టిన్ పండ్లలో సహజంగా లభించే ఒక గట్టిపడే ఏజెంట్. ఇది జెల్లీకి మృదువైన, స్ప్రెడబుల్ ఆకృతిని ఇస్తుంది. ఇవి సాధారణంగా జంతు ఉత్పత్తులను కలిగి ఉండవు.

జెల్లీలో జంతు ఉత్పత్తులు ఉంటాయా?
అయితే కొన్ని రకాల జెల్లీలలో జెలటిన్ అనే పదార్థం ఉపయోగిస్తారు. జెలటిన్ అనేది జంతువుల ఎముకల నుండి, అలాగే చర్మం, కొవ్వు లాంటి భాగాల నుండి కొల్లాజన్ తయారవుతుంది. ఈ జెలటిన్  పదార్ధాన్ని సాధారణంగా జెల్లీ క్యాండిల్స్, గమ్మీలు(జెల్లో) వంటి డెసర్ట్‌లలో ఉపయోగిస్తారు.


జెల్లీలో జంతువుల కొవ్వు ఉంటుందా?
జెల్లీ తయారీలో జంతువుల కొవ్వు (ఫ్యాట్) ఉపయోగించడం చాలా అరుదు. సాంప్రదాయ జెల్లీలు, జెలటిన్ ఆధారిత పదార్ధాలలో  కొవ్వు అవసరం ఉండదు. ఎందుకంటే ఇవి కొవ్వు రహితంగా ఉంటాయి. జెలటిన్ తయారీలో జంతువుల ఎముకలు, చర్మం, కొల్లాజన్ ఉపయోగించబడతాయి. కానీ కొవ్వు మాత్రం తొలగిస్తారు. ఎందుకంటే ఇది జెలటిన్ స్వచ్ఛతను, ఆకృతిని పాడు చేస్తుంది.

అయితే కొన్ని సందర్భాల్లో.. పెద్ద పెద్ద ఫంక్షన్స్ లలో.. జంతువుల కొవ్వును ఉపయోగించే ఆహార పదార్థాలు.. జెల్లీ లాంటి ఆకృతిని కలిగి ఉంటాయి. ఉదాహరణకు కొన్ని ప్రదేశాల్లో మాంసం, కొవ్వు నుండి తయారైన జెల్లీ లాంటి వంటకాలు కూడా ఉన్నాయి. ఇవి ఫ్రూట్ జెల్లీలకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి మనం తినే జెల్లీల్లో మాత్రం కొవ్వు ఉపయోగించడం దాదాపు జరగదు.

శాఖాహార (వేగన్) జెల్లీలు
మాంసాహారం తినని వాళ్ల కోసం వేగన్ జెల్లీలు అందుబాటులో ఉన్నాయి. ఇవి జెలటిన్ బదులుగా అగర్-అగర్ , పెక్టిన్ వంటి ప్లాంట్ ఏజెంట్లను ఉపయోగిస్తాయి. ఎందుకంటే అవి గట్టిగా, పారదర్శకంగా ఉంటాయి కాబట్టి.

జెల్లీ vs జెల్లో ఈ రెండింటిలో తేడా ఏమిటి?
జెల్లీ, జెల్లోను రెండూ ఒకటిగానే భావిస్తారు. కానీ వీటి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి..

జెల్లీ: సాధారణంగా పండ్ల రసం, చక్కెర, పెక్టిన్‌ వంటి పదార్ధాలతో తయారవుతుంది. ఇది స్ప్రెడబుల్‌గా ఉంటుంది. వీటిలో జంతు ఉత్పత్తులు ఏమి ఉండవు.

జెల్లో: జెలటిన్ ఆధారిత డెసర్ట్, ఇది జంతువుల కొల్లాజన్ నుండి తయారు చేస్తారు. ఇది కొంచెం జిగురుగా, గట్టిగా ఉంటుంది.

Also Read: ఐశ్వర్య రాజేష్ తాగిన ‘గోల్డెన్ క్యాపచినో’ ధర ఎంతో తెలుసా? దాన్ని ఎలా తయారు చేస్తారంటే?

జెల్లీ కొనేముందు ఏమి చూడాలి?
జెల్లీ లేదా జెల్లో లాంటి ఉత్పత్తులు కొనేముందు.. ముఖ్యంగా వాటి లేబుల్‌ను తనిఖీ చేయాలి. లేబుల్‌పై “జెలటిన్” లేదా “అగర్-అగర్” వంటి పదార్థాలు అందులో ప్రచురింపబడతాయి. మాంసాహారం తినని వారు..”వేగన్” లేదా “పెక్టిన్ ఆధారిత” అని లేబుల్‌పై ఉన్న వాటిని ఎంచుకోవచ్చు.

కాబట్టి జెల్లీలు జంతువుల కొవ్వు, ఎముకల నుండి తయారు చేయరు. పండ్ల రసం,పెక్టిన్‌‌ను ఉపయోగిస్తారు.

గమనిక: జెల్లీలలో జంతు పదార్ధాలు లేకపోయినప్పటికి.. మితి మీరి తీసుకోకూడదు.. ఎందుకంటే వాటీలో ఎక్కువగా గమ్ ఉంటుంది. అది కడుపులోకి పోతే చాలా డేంజర్.. ఇవి ముఖ్యంగా చిన్న పిల్లలకు.. అనేక అనారోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. బీ కేర్ ఫుల్

 

Related News

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Big Stories

×