Grapes Benefits: పండ్లను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు దొరకుతాయి. అయితే కొన్ని రకాల పండ్లను తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నీటి శాతం అధికంగా ఉండే ద్రాక్ష పండును తీసుకోవడం వల్ల శరీరానికి అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా అనేక యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. రోగాలు రాకుండా చూస్తాయి. వ్యాధుల నుంచి రక్షణ అందిస్తాయి. కనుక ద్రాక్ష పండ్లను రోజూ తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ద్రాక్షను చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏవరైన తినవచ్చు.
గుండె ఆరోగ్యం:
ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది, రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుందని అంటున్నారు. అంతేకాకుండా రక్తపోటును నియంత్రిస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరియు మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అలాగే ఒబేసిటీ సమస్యలను తగ్గించడంలో ఈ ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తాయని ఓ పరిశోధనలో తేలింది. అంతేకాదు ఊబకాయం, డయాబెటిస్, హైపర్ టెన్షన్ వల్ల కలిగే సమస్యలను తగ్గించడంలోనూ ద్రాక్ష పండ్లు దివ్యౌషధంగా పని చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్ష పండ్లలో విటమిన్ కె కూడా అధికంగానే ఉంటుంది. ఇది గాయాలు అయినప్పుడు రక్తం త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. దీంతో తీవ్ర రక్త స్రావం జరగకుండా చూసుకోవచ్చు. దీని వల్ల గుండె సైతం ఆరోగ్యంగా ఉంటుంది. ద్రాక్ష పండ్లలో విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. ద్రాక్ష పండ్లలో మెలటోనిన్ అధికంగా ఉంటుంది. ఇది ఒక హార్మోన్. నిద్రను నియంత్రిస్తుంది. కనుక నిద్రలేమి సమస్య ఉన్నవారు రోజూ ద్రాక్ష పండ్లను తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. పడుకున్న వెంటనే గాఢ నిద్ర పడుతుంది.
క్యాన్సర్‌కు చెక్:
ద్రాక్షలో కొన్ని సమ్మేళనాలు కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అధ్యయనాలు సూచిస్తున్నాయి. శరీరంలో కొవ్వును కరిగించడంలో ద్రాక్ష కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే జీవక్రియలు సాఫీగా సాగేందుకు ఇవి దోహదం చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ద్రాక్ష పండ్లను తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వీటిని తీసుకోవడం ద్రాక్ష మెుదడు కణాలను రక్షిస్తుంది, జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.
ద్రాక్ష పండ్లలో పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. అలాగే కాటెకిన్స్, యాంథో సయనిన్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్ల జాబితాకు చెందుతాయి. కనుక ద్రాక్ష పండ్లనును తింటే ఇవి మనకు లభిస్తాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. కణాలను డ్యామేజ్ అవకుండా రక్షిస్తాయి. దీంతో గుండె పోటు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా సురక్షితంగా ఉండవచ్చు. ఈ పండ్లను తింటే పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగుపరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలోకి వస్తుంది. హై బీపీ ఉన్నవారికి ద్రాక్ష పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. ఇవి కండరాల పనితీరును సరిచేస్తాయి. దీంతో శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గిపోతాయి.
Also Read:
ఎముకల ఆరోగ్యం:
ద్రాక్షలో కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వటి ముఖ్యమైన ఖనిజాల ఉన్నాయి, ఇవి ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి చాలా ముఖ్యమైనవి, బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడంలో దోహాదం చేస్తాయి. ద్రాక్షలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, కాంతివంతగా చేస్తుంది. దీనిలో లుటీన్, జియాజాంతిన్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కెరోటినాయిడ్స్ జాబితాకు చెందుతాయి. ఇవి కళ్లను సూర్యుని నుంచి వచ్చే అతి నీలలోహిత కిరణాల బారి నుంచి రక్షిస్తాయి. దీంతో కళ్లు సురక్షితంగా ఉంటాయి. ఇలా ద్రాక్ష పండ్లను తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు కనుక వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలని చెబుతున్నారు.