Firecracker Explodes Kerala: కేరళలోని ఓ ఫెస్టివల్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆ ఘటనలో 154 మంది గాయపడ్డారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. అసలేం జరిగింది అన్న లోతుల్లోకి వెళ్తే…
కేరళ కసరగడ్ జిల్లా నీలేశ్వర్‌లోని అంజూతంబళం వీరెర్కవు ఆలయంలో వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకల కోసం ఆ జిల్లాకు చెందినవారే కాకుండా పొరుగు జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు అక్కడికి వచ్చారు. సంప్రదాయ తెయ్యం పండుగంటే ఆ సరదా అంతా ఇంతా కాదు.
పండగ సందర్భంగా అర్థరాత్రి బాణాసంచా పేల్చారు. పేలిన టపాసుల రవ్వలు బాణసంచా నిల్వచేసిన గదిలో పడ్డాయి. దీంతో భారీ ఎత్తున శబ్దాలు, మంటలు ఎగిసిపడ్డాయి. భయంతో భక్తులు బయట వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది.
ఈ ఘటనలో 154 మంది గాయపడినట్టు తెలుస్తోంది. మరో 18 మందికి తీవ్ర గాయాలు కాగా, 8 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఘటన విషయం తెలియగానే అధికారులు అలర్ట్ అయ్యారు. వెంటనే ఆ ప్రాంతానికి పోలీసులు, అధికారులు చేరుకుని సహాయ చర్యలు ముమ్మరంగా చేశారు.
ALSO READ: తిరువనంతపురం.. సీఎం విజయన్‌కు తప్పిన ముప్పు
గాయపడిన బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు మొదలుపెట్టారు. జరిగిన ఘటనపై ఆరా తీస్తున్నారు. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పేలిన బాణాసంచా.. 150 మందికిపైగా గాయాలు..
కేరళ కాసరగోడ్ లోని నీలేశ్వర ఆలయంలో ఘటన
కాళీయపట్టు ఉత్సవాల్లో భాగంగా కాల్చిన టపాసులు
పక్కనే బాణాసంచా నిల్వ ఉంచిన ప్రదేశంలో పడిన నిప్పు రవ్వలు
ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో 150 మందికిపైగా గాయాలు
8 మంది పరిస్థితి విషమం#Kerala #Crackers… pic.twitter.com/xAetY7NUXl
— BIG TV Breaking News (@bigtvtelugu) October 29, 2024