Railway Journey Stories Travelogue Award| భారతీయ రైల్వే బోర్డు ప్రయాణికుల కోసం ఓ వినూత్న పోటీలు ప్రారంభిస్తోంది. ‘భారతీయ్ రైల్ యాత్రా వృత్తాంత్ పురస్కార్ యోజన – 2025’ (Rail Travelogue Award Scheme 2025 పేరిట ప్రయాణికులకు నగదు బహుమతులు అందించబోతున్నట్లు ప్రకటించింది. ఈ స్కీం ప్రకారం.. ప్రయాణికులు చాలా సింపుల్ గా తమ రైలు ప్రయాణ అనుభవాలను రాత రూపంలో సమర్పించాలి. అయితే, ఈ అనుభవాల వ్యాసాలను రాసిన వారిలో టాప్ 8 కే బహుమతులు లభిస్తాయని అని రైల్వే బోర్డు స్పష్టం చేసింది.
వ్యాసం రాయాల్సిన విధానం..
ఈ పోటీలో భాగంగా పాల్గొనదలచిన వారు హిందీ భాషలో 3,000 నుండి 3,500 పదాల మధ్య తమ ప్రయాణ అనుభవాన్ని, అలాగే రైల్వే సేవలపై తమ అభిప్రాయాలను వివరంగా చర్చిస్తూ వ్యాసాన్ని రాయాలి. ఈ వ్యాసాల్లో మొదటి 8 ఉత్తమమైన వ్యాసాలను ఎంపిక చేసి వాటి రచయితలకు నగదు బహుమతులు అందిస్తారు. ఈ విషయాన్ని రైల్వే బోర్డు వెల్లడించింది. వ్యాసం పంపే వారు తమ పేరు, హోదా, వృత్తి, వయసు, చిరునామా, మాతృభాష, మొబైల్ నంబరు, ఈమెయిల్ వంటి సమాచారాన్ని ప్రత్యేక పేజీలో పేర్కొనాలి. అంతేకాక, తామిప్పటికే ఎలాంటి పోలీసు కేసులలో ఇరుక్కొని లేరో అనే విషయాన్ని స్వీయ ధ్రువీకరణ రూపంలో ఇవ్వాలి. రచయిత ప్రభుత్వ ఉద్యోగి అయితే, తాపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు పెండింగ్‌లో లేవని కూడా ధృవీకరించాలి. అన్ని వివరాలతో కూడిన వ్యాసాన్ని 2025 జూలై 31వ తేదీ లోపు ఈ చిరునామాకు పంపాలి: అసిస్టెంట్ డైరెక్టర్, హిందీ (ట్రైనింగ్), రూమ్ నంబర్ 316 – COFMOW రైల్వే ఆఫీస్ కాంప్లెక్స్, తిలక్ బ్రిడ్జ్, ఐటీఓ, న్యూ ఢిల్లీ – 110002.
అనుభవాలు పాజిటివ్ అయినా కాకపోయినా
ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రజలను హిందీ భాష వైపు ఆకర్షించడానికి రూపొందించబడింది. రైల్వే బోర్డు ప్రజల్లో హిందీ రచనా సామర్థ్యాన్ని పెంపొందించాలని భావిస్తోంది. ప్రయాణికుల నుంచి పాజిటివ్, నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌ను పొందడం ద్వారా రైల్వే సేవలను మెరుగుపర్చాలన్నదే ఈ కార్యక్రమం వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.
ఈ అంశంపై ప్రముఖ రచయిత డాక్టర్ శ్రీకాంత్ శర్మ మీడియా తో మాట్లాడుతూ.. “భారత రైల్వే ఇలాంటి ఆలోచనాత్మక కార్యక్రమాన్ని అమలు చేయడం చాలా ప్రశంసనీయం. ఇటువంటి మంచి కార్యక్రమాలకు అవసరమైన ప్రమోషన్ లభిస్తే, మరింత మంది ప్రజలకు అవగాహన కలుగుతుంది. హిందీలో రాయగలిగే అనేక మంది ప్రయాణికులు ఈ స్కీం గురించి ఇంకా తెలియకపోవచ్చు,” అని అన్నారు.
Also Read: మహాప్రళయం ముంచుకుస్తోంది.. పవర్ ఫుల్ జపానీస్ బాబా వంగా జోస్యం.. భారత్ పైనా ప్రభావం
ట్రైన్‌లో టికెట్ లేకుండా ప్రయాణం చేయొచ్చు
ఎవరైనా హుటాహుటిన ప్రయాణించాల్సిన పరిస్థితి వస్తే, రైల్వే స్టేషన్‌కు చేరుకున్నప్పుడు రైలు ఇక బయలుదేరే సమయం అయినప్పుడు.. వెంటనే ప్లాట్‌ఫాంపై నిలిచి ఉన్న ట్రైన్ లో టికెట్ లేకున్నా ఎక్కవచ్చు. అయినా కొన్ని షరతులు వర్తిస్తాయి. ఫ్లాట్‌ఫా మ్ టికెట్ మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది మీరు ఎక్కడి నుంచి రైలు ఎక్కారో తెలుపడానికి ఉపయోగపడుతుంది. రైలెక్కిన వెంటనే మీరు టీటీఈని కలవాలి. టికెట్ లేకుండా ఎక్కిన విషయాన్ని చెప్పాలి. టీటీఈ మీకు కొన్ని ఛార్జీలు, ఫైన్ వసూలు చేసి టికెట్ జారీ చేస్తాడు. అయితే, బెర్తు ఖాళీగా ఉంటేనే సీటు కేటాయిస్తాడు. లేకపోతే, మీరు నిల్చునే ప్రయాణం సాగించాల్సి వస్తుంది.
ఎంత జరిమానా చెల్లించాలి?
భారతీయ రైల్వే చట్టాల ప్రకారం.. టికెట్ లేకుండా ప్రయాణించడం నేరంగా పరిగణించబడుతుంది. అలా పట్టుబడితే, రూ. 250 వరకు ఫైన్ చెల్లించాలి. దీనితో పాటు, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించారో అనుసరించి టికెట్ ఛార్జీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. టీటీఈ మీ వివరాలపై నమ్మకం పొందకపోతే, మరింతగా రూ. 1000 వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. అట్టి పరిస్థితుల్లో, అవసరమైనప్పుడే ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిది. అదనంగా జరిమానా తప్పదు, అలాగే సీటు లభించే అవకాశం కూడా నిర్ధారించబడదు.