BigTV English

Non Stick Pan: నాన్ స్టిక్ పాత్రల్లో వండిన ఆహారం తింటే.. క్యాన్సర్ వస్తుందా ?

Non Stick Pan: నాన్ స్టిక్ పాత్రల్లో వండిన ఆహారం తింటే.. క్యాన్సర్ వస్తుందా ?

Non Stick Pan: ఈ రోజుల్లో చాలా మంది ఇళ్లలో నాన్ స్టిక్ పాత్రలను ఉపయోగిస్తున్నారు. కానీ వీటి ఉపయోగం వల్ల క్యాన్సర్ వస్తుందా అనే డౌట్ అనేక మందిలో ఉంటుంది.
నాన్ స్టిక్ పాత్రల్లో వంటకాలు తయారు చేసినప్పుడు తక్కువ నూనె అవసరం అవుతుంది. అంతే కాకుండా వీటిని క్లీన్ చేయడం కూడా సులభం. అందుకే ఇది వంటని సులభతరం చేస్తుంది. వీటి వాడకం చాలా పెరుగుతోంది.


మీరు వాడుతున్న నాన్ స్టిక్ పాత్రలే మిమ్మల్ని తీవ్రమైన వ్యాధుల బారిన పడేస్తాయని మీకు తెలుసా. నాన్ స్టిక్ పాన్ లో ఆహారాన్ని వండటం వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందని మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఈ రోజు మనం నాన్ స్టిక్ పాన్ ఎలా తయారు చేస్తారో తెలుసుకుందాం. అంతే కాకుండా నాన్ స్టిక్ పాత్రల వల్ల నిజంగా ఆరోగ్యానికి హాని కలుగుతుందా లేదా అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం.

నాన్ స్టిక్ పాత్రలు టెఫ్లాన్ అనే ఒక రకమైన పూతను కలిగి ఉంటాయి. టెఫ్లాన్‌ను పాలీటెట్రాఫ్లోరోఎథిలిన్ నుంచి తయారు చేస్తారు. టెఫ్లాన్ తో తయారు చేసిన నాన్ స్టిక్ ప్యాన్‌ను మొదటిసారిగా 1950లో ఉపయోగించారు. ఆహారం అంటుకోకుండాఈ పూత పాన్‌ను నునుపుగా చేస్తుంది. టెఫ్లాన్ విషపూరితం కాదు కానీ ఎక్కువగా వేడి చేస్తే.. సమస్య ఏర్పడుతుంది. మీరు నాన్-స్టిక్ పాన్‌ను 260°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతతో వేడి చేస్తే, అది పెర్ఫ్లూరోక్టానోయిక్ యాసిడ్ (PFOA) వంటి హానికరమైన రసాయనాలను విడుదల చేస్తుంది. PFOA అనేది క్యాన్సర్ మరియు ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. నిజానికి నాన్ స్టిక్ ప్యాన్లను వాడాలా వద్దా అనే విషయంపై చాలా మందికి సందేహాలు ఉన్నాయి.


ఈ రోజుల్లో, చాలా కంపెనీలు తమ నాన్-స్టిక్ కుక్‌వేర్‌లలో PFOA (పర్‌ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్)ని ఉపయోగించడం లేదు. నాన్-స్టిక్ పాత్రలను కొనేటప్పుడు మీరు కొనే నాన్ స్టిక్ PFOA తో తయారు చేసిందో లేదో అనే విషయాలను ముందుగా తెలుసుకోండి.

నాన్-స్టిక్ పాన్‌ను ఎలా ఉపయోగించాలి ?

తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఆహారాన్ని ఉడికించాలి- నాన్-స్టిక్ పాన్‌ను ఎక్కువ మంటపై ఉంచవద్దు.టెఫ్లాన్ పూత ఉన్న పాత్రలను మీడియం మంట మీద ఉడికించాలి .
గీతలు పడకుండా పాన్‌ను రక్షించండి – నాన్-స్టిక్ ప్యాన్‌లలో మెటల్ పాత్రలను అస్సలు ఉపయోగించకండి. ఇది పాన్ యొక్క పూతను దెబ్బతీస్తుంది. అంతే కాకుండా ఇది హానికరం కూడా.

పాత ప్యాన్ లను ఉపయోగించకూడదు – పాన్ యొక్క పూత పోవడం ప్రారంభం అయితే.. లేదా మీ ప్యాన్‌పై గీతలు కలిగి ఉంటే.. దానిని పక్కన పడేయండి. అలాంటి ప్యాన్ లలో ఆహారాన్ని వండినట్లయితే, అది మీ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.

నాన్ స్టిక్ ప్యాన్ల వల్ల క్యాన్సర్ వస్తుందా ?

నాన్ స్టిక్ పాన్ లో తయారుచేసిన ఆహారాన్ని తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల పరిశోధనలో తేలింది. అధిక ఉష్ణోగ్రతతో వేడి చేసిన ఆహారం తిన్నా లేదా పూత పోయిన ప్యాన్ లో వంట చేసి తిన్నా కూడా అప్పుడు నష్టం ఖచ్చితంగా ఉంటుంది. కానీ సరిగ్గా ఉపయోగించినట్లయితే.. ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. నాన్-స్టిక్ పాన్ ఉపయోగించడం ఖచ్చితంగా సురక్షితమే. కానీ మీరు దానిని సరిగ్గా ఉపయోగించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది.

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×