Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో ఛాన్స్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు హీరోయిన్లు. కానీ ప్రభాస్‌తో నటించే ఛాన్స్ కొందరికే వస్తుంది. ఇక ప్రభాస్‌తో నటించే సమయంలో ఆయనతో సదరు హీరోయిన్లకు డేటింగ్ రూమర్స్ కామన్. గతంలో బాహుబలి (Bahubali) సమయంలో అనుష్కతో డార్లింగ్ లవ్‌లో ఉన్నాడనే వార్తలు వచ్చాయి. ఈ ఇద్దరు ఏకంగా పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే గాసిప్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత సాహో హీరోయిన్ శ్రద్ధా కపూర్‌తో పుకార్లు అల్లేశారు. ఆపైన ఆదిపురుష్ హీరోయిన్ కృతి సనన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడని అన్నారు. కానీ అదంతా బాలీవుడ్ పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. అయితే.. ఇప్పుడు ప్రభాస్ పై ఓ హీరోయిన్ కాస్త గట్టిగానే మనసు పారేసుకున్నట్టుంది. సమయం సందర్భం వస్తే చాలు.. ప్రభాస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తోంది అమ్మడు. ఇంతకీ ఎవరా హాట్ బ్యూటీ? ప్రభాస్ గురించి ఏం చెబుతోంది?
Also Read: షాకింగ్.. నీల్ మావా ఫుల్ బాటిల్ లేపేయ్, కానీ ఎన్టీఆర్‌తో మాత్రం..?
రాజాసాబ్‌లో లక్కీ ఛాన్స్
ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో రాజాసాబ్ (The Raja Saab) కూడా ఒకటి. మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. మాళవిక మోహనన్ (Malavika Mohanan), నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), రిద్ది కుమార్ (Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ ముద్దుగుమ్మలు ప్రభాస్‌తో నటించే ఛాన్స్ రావడంతో.. ఎగిరిగంతేస్తున్నారు. ముఖ్యంగా మాళవిక మోహనన్ ప్రభాస్‌తో ఛాన్స్ రావడం తన అదృష్టమని అంటోంది. మాస్టర్ వంటి సినిమాతో తెలుగు ప్రేక్షకులగు చేరువైన ఈ హాట్ బ్యూటీ.. రాజాసాబ్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా తన కెరీర్‌కు చాలా హెల్ప్ అవుతుందనే నమ్మకంతో ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ గురించి చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో ప్రభాస్ మంచితనానికి ఫిదా అయ్యానని, ఆయన ఇంటి నుంచి తీసుకొచ్చే ఫుడ్ మామూలుగా ఉండదని చెప్పుకొచ్చింది. ఇక లేటెస్ట్‌గా.. మరోసారి ప్రభాస్ గురించి మాట్లాడుతూ వైరల్ కామెంట్స్ చేసింది. ప్రభాస్‌తో నటించడం తన అదృష్టమని, తన కెరీర్‌లోనే ఓ మైలురాయిలా నిలిచేలా రాజాసాబ్ నిలుస్తుందని ఆనందం వ్యక్తం చేసింది. ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా లక్కీ, అతకుమించిన మించిన ఆనందం ఇంకేముంటుంది? ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటా.. అని చెప్పుకొచ్చింది.
Also Read: అనుష్క ‘ఘాటి’ వాయిదా!
కొంపదీసి..?
ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ, పదే పదే ప్రభాస్ గురించి ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తూ.. ప్రశంసల వర్షం కురిపిస్తోంది అమ్మడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కొంపదీసి అమ్మడు ప్రభాస్ పై మనసు పారేసుకుందా? అని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే.. ప్రభాస్ లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ అంటే.. ఆ మాత్రం ఉంటదిలే అని అంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. మొత్తంగా మాళవిక మోహనన్ మాత్రం రాజాసాబ్ పై భారీ ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమా అమ్మడికి టాలీవుడ్‌లో ఎలాంటి గుర్తింపు తెచ్చిపెడుతుందో చూడాలి. అన్నట్టు.. సోషల్ మీడియాలో మాళవిక షేర్ చేసే ఫోటోలు మాత్రం కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తుంటాయి.