BigTV English

Kitchen Cleaning Tips: కిచెన్‌లో నూనె జిడ్డు వదలడం లేదా? ఇలా చేస్తే దగదగ మెరిసిపోద్ది..

Kitchen Cleaning Tips: కిచెన్‌లో నూనె జిడ్డు వదలడం లేదా? ఇలా చేస్తే దగదగ మెరిసిపోద్ది..

Kitchen Cleaning Tips: చాలా మంది కిచెన్లో నూనె జిడ్డు వదలడం కోసం కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వంట చేసే సమయంలో గ్యాస్ వెనుకలా నూనె చిట్లడం వల్ల టైల్స్ మొత్తం జిడ్డుగా మారతాయి. దీనిని క్లీన్ చేయడం కోసం చాలా రకాల ప్రయోగాలు చేస్తూంటారు. అయిన ప్రయోజనం ఉండదు. కిచెన్​ను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. అయితే కిచెన్‌లో జిడ్డు వదలడానికి కొన్ని రకాల టిప్స్ వాడటం వల్ల మీ కిచెన్‌లో జిడ్డు ఇట్టే వదిలి పోతుంది.


నిమ్మరసం: కిచెన్ ప్లాట్​ఫామ్, టైల్స్​పై పడిన జిడ్డు మరకలను తొలగించడంలో నిమ్మరసం చాలా ఎఫెక్టివ్​గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా.. ఒక చిన్న బౌల్​లో కొద్దిగా డిష్ వాష్ ద్రవాన్ని తీసుకొని అందులో సగం పచ్చ నిమ్మరసం పిండి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమంలో స్క్రబ్బర్​ను ముంచి చేతులతో పిండి చేతులతో పిండి అప్పుడు దానితో కిచెన్ ప్లాట్​ఫ్లామ్ లేదా స్లాబ్ క్లీన్ చేసుకోవాలి.

తర్వాత నీటిలో నానబెట్టిన కాటన్ వస్త్రంతో మరోసారి నీటితో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఆ ప్రదేశంలో ఉన్న లూబ్రికేషన్ ఈజీగా తొలగిపోయి నీట్​గా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. డిష్ వాష్, నిమ్మరసం మిశ్రమం కిచెన్ సింక్, టైల్స్​నూ శుభ్రపర్చడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు.


వెనిగర్: ఇది వంటల టేస్ట్ పెంచడమే కాదు.. మంచి క్లీనింగ్ ఏజెంట్​గా కూడా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా కిచెన్‌ ప్లాట్‌ఫామ్‌, ఇంటి ఫ్లోర్‌పై ఉండే మరకలను క్లీన్‌ చేయడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని చెబుతున్నారు. ఇందుకోసం.. ఒక బౌల్​లో గోరువెచ్చని వాటర్ తీసుకుని అందులో ఒకటి లేదా రెండు టీస్పూన్ల బేకింగ్ సోడా, రెండు చెంచాల వెనిగర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆపై ఆ మిశ్రమాన్ని స్ర్పే బాటిలో పోసుకొని క్లీనింగ్ కోసం యూజ్ చేయండి. దీనితో.. ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే తొలగిపోతాయంటున్నారు నిపుణులు.

బేకింగ్ సోడా: కిచెన్ స్లాబ్​పై పడిన నూనె మరకలను పోగొట్టడంలో ఇది చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ఒక బౌల్​లో కొద్దిగా గోరువెచ్చని వాటర్, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, సగం పచ్చ నిమ్మరసం పిండుకుని బాగా కలుపుకోవాలి. ఆపై దాన్ని స్ప్రే బాటిల్​లో స్టోర్ చేసుకొని జిడ్డు మరకలు ఉన్న చోట కొద్దిగా అప్లై చేసి బ్రష్​తో రుద్ది కడుక్కుంటే సరిపోతుంది. ఎలాంటి మొండి మరకలైనా ఈజీగా మాయమవుతాయంటున్నారు.

Also Read: జుట్టు ఎక్కువగా రాలుతోందా..? నో టెన్షన్.. వీటితో మీ జుట్టు పదిలం

అలాగే.. కిచెన్ ప్లాట్​ఫామ్​పై ఆయిల్ మరకలు పడిన వెంటనే తుడుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా అవి జిడ్డుగా మారవు. లేదంటే.. అలాగే వదిలేస్తే కొన్ని రోజులకు అవి మొండి మరకలుగా మారిపోతాయి. కాబట్టి వంటగదిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు.

Related News

Coconut Benefits: రాత్రి పూట కొబ్బరి తింటే.. మతిపోయే లాభాాలు !

Hair Fall: ఈ టిప్స్ పాటిస్తే.. జుట్టు ఊడమన్నా ఊడదు !

Malaria Fever: మలేరియా లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే !

TFM – Skin: TFM అంటే ఏమిటి? దీని వల్ల స్కిన్ సమస్యలు ఎలా వస్తాయో తెలుసా?

Face Mask For Pimples: ముఖంపై మొటిమలా ? ఈ ఒక్క ఫేస్ ప్యాక్‌తో ప్రాబ్లమ్ సాల్వ్

Plastic Cups: ప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ, టీలను తాగుతున్నారా? వెంటనే మానేయండి.. లేదంటే?

Big Stories

×