ఆధునిక జీవితంలో జీవనశైలి ఎంతగానో మారిపోయింది. చెడు ఆహారపు అలవాట్లు, అనారోగ్యకరమైన పద్ధతులు ఎక్కువగా పాటిస్తున్నారు. దీనివల్లే ఎంతో మంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొలెస్ట్రాల్ అనేది మైనం లాంటి జిగటగా ఉండే పదార్థం. దీనిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి చెడు కొలెస్ట్రాల్, రెండోది మంచి కొలెస్ట్రాల్.
చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకు పోతే శరీరానికి ఎంతో ప్రమాదకరం. సిరల్లో ఈ చెడు కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. దీని వల్ల ధమనులు కూడా మూసుకుపోతాయి. అప్పుడు గుండెపోటు వచ్చే అవకాశం పెరిగిపోతుంది. కాబట్టి గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే ఖాళీ పొట్టతో అల్లం నీటిని తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఇది సిరలో ఉన్న కొలెస్ట్రాల్ మొత్తాన్ని బయటికి పంపిస్తుంది.
శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి అల్లం ఎంతో ఉపయోగపడుతుంది. దీనిలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుంది. మీ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి సహాయపడుతుంది. అల్లాన్ని తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతిరోజు అల్లం మీ ఆహారంలో భాగంగా చేసుకోండి. అల్లం తినడం వల్ల గుండెపోటు ప్రమాదం కూడా చాలా వరకు తగ్గుతుంది.
ఇలా డ్రింక్ చేసుకోండి
పచ్చి అల్లాన్ని తినడం చాలా కష్టం. దాని రుచి చాలామంది భరించలేరు. అయితే ఆరోగ్యం కోసం అల్లం తినాల్సిన అవసరం ఉంది. మీరు అల్లాన్ని నేరుగా తినలేక పోతే అల్లం నీటిని తయారు చేసుకోండి. దీనికోసం మీరు ఒక గిన్నెలో నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టి వేడి చేయండి. అందులోనే అల్లం తురుమును కూడా వేసి బాగా మరిగించండి. అల్లంలోని పోషకాలని నీటిలో కలిసిపోతాయి. తర్వాత దాన్ని వడకట్టి తాగేయండి. ప్రతిరోజు ఉదయం ఖాళీపొట్టతో ఇలా అల్లం నీటిని తాగేందుకు ప్రయత్నించండి. కొన్ని రోజుల్లోనే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. మీకు మీరే ఆరోగ్యంగా అనిపిస్తారు.
కేవలం శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడమే కాదు… అల్లం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మన జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. కడుపునొప్పి, ఉబ్బరం, గ్యాస్టిక్ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అల్లంలో జింజెరాల్ అనే సమ్మేళనం ఉంటుందని చెప్పుకున్నాము. ఇది శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడుతుంది.
కీళ్లనొప్పులు, వాపు సంబంధిత సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఎంతో సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా కూడా రక్షిస్తుంది. ఇక మధుమేహంతో బాధపడుతున్న వారు ప్రతి రోజు అల్లం నీటిని తాగితే ఎంతో మంచిది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఇది ముందుంటుంది. జ్ఞాపకశక్తిని పెంచడానికి కూడా అల్లం అద్భుతంగా పనిచేస్తుంది. అల్జీమర్స్ వ్యాధిబారిన పడకుండా ఉండాలి. నరాల సంబంధిత వ్యాధులకు రాకుండా ఉండాలన్నా అల్లాన్ని అధికంగా తీసుకోవాలి.