Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)ఇప్పటికీ వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో సల్మాన్ నటిస్తున్న సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయని చెప్పాలి.ఈ ఏడాది ఈయన నటి రష్మిక మందన్నతో కలిసి సికిందర్(Sikandar) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇక త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ కార్యక్రమంతో కూడా సల్మాన్ ఖాన్ బిజీ కాబోతున్నారు.
సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని…
ప్రస్తుతం ఈయన “బ్యాటిల్ ఆఫ్ గాల్వన్” సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా 2020 భారత్ మరియు చైనా మధ్య జరిగిన యుద్ధం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉండడం గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ ప్రాణ భయంతో ఉన్నారు. తరచుగా ఈయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ రావడంతో ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ ఏకంగా తన ఇంటి బాల్కానికి కూడా బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్(bullet proof glass) వేయించుకోవడంతో ఈయనని ఇంకా ప్రాణభయం వెంటాడుతుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తాజాగా తన ఇంటికి ఎందుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వేయించుకున్నారు అనే విషయంపై కూడా సల్మాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు.
బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్…
సల్మాన్ ఖాన్ నివసిస్తున్న గెలాక్సీ అపార్ట్మెంట్లోని బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ తో కూడిన గ్లాస్ అమర్చారు. తాజాగా ఈ గ్లాస్ వేయించడం గురించి సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. బుల్లెట్ ప్రూఫ్ క్లాస్ వేయించడం తన వ్యక్తిగత రక్షణ కోసం కాదని తెలిపారు. కొంతమంది అభిమానులు తనని కలవడం కోసం ఏకంగా బాల్కనీ పైకి ఎక్కి వస్తున్నారని అదే విధంగా బాల్కనీలోనే నిద్రపోతున్నారని ఈయన తెలిపారు. ఇలా అభిమానులను అడ్డుకోవడం కోసమే ఈ గ్లాస్ అమర్చినట్టు తెలిపారు.
అభిమానుల కోసం…
ఇలా అభిమానుల తాకిడిని అడ్డుకోవడం కోసం ఇలాంటి చర్యలు తీసుకున్నానని సల్మాన్ ఖాన్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అయితే గత కొంతకాలంగా సల్మాన్ ఖాన్ కు ఈ విధమైనటువంటి బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈయన కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా బెదిరింపులతో పాటు కారులో బాంబులు పెట్టినట్లు కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. అలాగే కొందరు దుండగులు సల్మాన్ ఇంట్లోకి కూడా చొరబడే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. సల్మాన్ ఖాన్ కు ప్రాణహాని ఉన్న నేపథ్యంలోనే ముంబై పోలీసులు కూడా ఈయనకు పెద్ద ఎత్తున భద్రత కల్పించారు. ఇలాంటి బెదిరింపులు వచ్చిన తరువాత సల్మాన్ ఖాన్ తన ఇంటి బాల్కనీకి బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అమర్చిన నేపథ్యంలో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇక ఈ బాల్కనీ నుంచి ప్రతి ఏడాది రాంచరణ్ పండుగను పురస్కరించుకొని సల్మాన్ ఖాన్ అభిమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటారు.
Also Read: Mrunal Thakur: పెళ్లి… పిల్లలు గురించి ఓపెన్ అయిన మృణాల్…అదే నా కలంటూ!