BigTV English

Heat Reducing Tips in Body: ఒంట్లో వేడితో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ ట్రై చేయండి!

Heat Reducing Tips in Body: ఒంట్లో వేడితో బాధపడుతున్నారా..? ఈ టిప్స్ ట్రై చేయండి!

Body Heat Reducing Tips: సాధారణంగానే చాలా మందికి శరీరంలోని వేడితో బాధపడుతుంటారు. అందులోని ఎండాకాలం వచ్చిందంటే చాలు ఇక విపరీతమైన వేడితో ఇబ్బంది పడుతుంటారు. ఇక ఈ వేడి కారణంగా జ్వరం, తలనొప్పి వంటి సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల వేడి తగ్గించే వస్తువులను ఆహారంలో భాగంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండాకాలంలో వేడి కారణంగా బాడీ డీహైడ్రేట్ అవుతుంది. అందువల్ల నీరు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది.


ఎండాకాలంలో వేడిని తగ్గించేందుకు నీటి రూపంలో ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. నీరు, కొబ్బరి నీళ్లు, జ్యూస్ లు వంటివి ఎక్కువగా తాగడం వల్ల బాడీ హైడ్రేటెడ్ గా ఉంటుంది. ఎండలో వెళుతున్న సమయంలో శరీరంలోని టెంపరేచర్‌ను తగ్గించేందుకు కూడా ఇవి తోడ్పడతాయి. ఇక వేడిని తగ్గించే పండ్లు, కూరగాయలను కూడా ఎక్కువగా తీసుకోవాలి.

Also Read: రాత్రి వేళ ఇవి అస్సలు తినకూడదు..


ముఖ్యంగా వేడిని తగ్గించేందుకు మెంతులు కూడా బాగా పనిచేస్తాయి. ప్రతీ రోజూ మెంతులను తినడం వల్ల శరీరంలోని వేడిని తగ్గించి హైడ్రేటెడ్ గా ఉంచుకోవచ్చు. ఒక స్పూన్ మెంతుల్ని పొడి చేసి నీళ్లలో కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలోని అధిక వేడిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. వేడి చేసిన సమయాల్లో ఛాతీ, మణికట్టు, వంటి భాగాల్లో ఐస్ ను రాయడం వల్ల శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేడి సమస్యతో బాధపడేవారు స్విమ్మింగ్ చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ముఖ్యంగా రోజుకు రెండు సార్లు మజ్జిగ లేదా లస్సీని తాగడం వల్ల వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

Disclaimer: ఈ కథనాన్ని ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా రూపొందిందాం. ఏదైనా సందేహం ఉంటే నిపుణులను సంప్రదించండి.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×