BigTV English
Advertisement

Onion Juice Benefits: పరగడుపున అరగ్లాసు ఉల్లి రసం తాగితే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు..

Onion Juice Benefits: పరగడుపున అరగ్లాసు ఉల్లి రసం తాగితే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు..

Onion Juice Benefits: ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ముఖ్యంగా సమతుల ఆహారం తీసుకోవడం, పోషకాలతో నిండిన వాటిని తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చూస్తుంటారు. అయితే ఎటువంటి ఆహారం తీసుకున్నా కూడా అందులో ముఖ్యంగా పరగడుపున తీసుకునే ఆహారం చాలా ముఖ్యమైనది. పరగడుపున తరచూ కొన్ని రసాలు తాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.


ఉదయాన్నే పరగడుపున ఉల్లి రసం తాగడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఉల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ అలర్జీ, కార్సినోజెనిక్ వంటి గుణాలు పుష్కలంగా ఉండడం వ్లల శరీరంలోని అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది. ముఖ్యంగా రక్తపోటు వంటి ఎన్నో రకాల సమస్యల నుంచి కాపాడుతుంది. అంతేకాదు బరువును తగ్గించడంలోను సహాయపడుతుంది.

రక్తపోటు..


రక్తపోటుతో బాధపడే వారికి ఉల్లిరసం చాలా సహాయపడుతుంది. ఉల్లిలో ఉండే మెగ్నీషియం వల్ల అధిక రక్తపోటు వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

దంతాలు,చిగుళ్ళు:

ఉల్లిరసం రోజు పరగడపున తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. దీని వల్ల దంతాలు, చిగుళ్ళ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
దీని కోసం తరచూ ఓ టీస్పూన్ ఉల్లి రసం తాగడం మంచిది.

రోగనిరోధక శక్తి:

రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉల్లి అద్భుతంగా పనిచేస్తుంది. మారుతున్న సీజన్ల కారణంగా ఉల్లిని తరచూ తీసుకుంటే ఎటువంటి రోగాలనైనా తగ్గించుకోవచ్చు.

బరువు తగ్గడం:

ఉల్లిరసం తాగడం వల్ల అధిక బరువు వంటి సమస్యల భారీ నుంచి తప్పించుకోవచ్చు.

వాపు:

శరీరంలోని వాపును కూడా తగ్గించుకోవడానికి ఉల్లి అద్భుతంగా పనిచేస్తుంది. శక్తిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి యాంటీ ఇన్ల్ఫామేటరీ గుణాలను కూడా అందిస్తుంది.

చెడు కొలెస్ట్రాల్‌:

ఉదయాన్నే ఉల్లి రసం తీసుకుంటే రక్తాన్ని శుభ్రపరుస్తుంది. టాక్సిన్స్ ను తొలగించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా చెడు కొలస్ట్రాల్ వంటి వాటిని తొలగించి శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తుంది.

ఉల్లి రసం తయారీ విధానం:

ఉల్లి రసం తయారు చేసుకోవడానికి ముందుగా కొన్ని ఉల్లిపాయలను తీసుకుని కట్ చేసి గ్రైండ్ చేసి రసం తీసుకోవాలి. పీచును పక్కకు తీసుకుని తయారుచేసుకున్న రసంలో ఒక స్పూన్ తేనె కలిపి పరగడుపున తీసుకోవాలి.

Related News

Soaked Almonds: డైలీ 5 నానబెట్టిన బాదంలను 30 రోజులు తింటే.. ఈ సమస్యలన్నీ దూరం !

Money Plant: ఇంటి అందానికి మాత్రమే కాదండోయ్.. ఈ ప్లాంట్ వెనుకున్న అసలు కారణాలు ఇవే!

Squats Benefits: రోజూ 30 గుంజీలు తీయాల్సిందే.. ఎందుకో తెలిస్తే ఆపకుండా చేసేస్తారు!

Moringa Oil Benefits: సౌందర్య పోషణలో మునగ నూనె.. అందాన్ని రెట్టింపు చేయడంలో తోడ్పాటు!

Winter Skincare: చలికాలంలో చర్మాన్ని.. కాపాడుకోండిలా !

Diabetes And Stroke: రక్తంలో చక్కెర పెరుగుదల.. మెదడును ఎలా ప్రభావితం చేస్తుంది?

Banana: రోజూ 2 అరటిపండ్లు తింటే.. ఎన్ని ప్రయోజనాలుంటాయో తెలుసా ?

Kitchen tips: వంట చేస్తున్నప్పుడు కళాయి మూతపై నీరు ఎందుకు పోయాలి?

Big Stories

×