BigTV English

Tea : కరాక్ చాయ్.. దుబాయ్‌లో ఫేమస్.. ఇంట్లో ఎలా చేయాలంటే..

Tea : కరాక్ చాయ్.. దుబాయ్‌లో ఫేమస్.. ఇంట్లో ఎలా చేయాలంటే..

Tea : ఏ చాయ్, చటుక్కునా తాగరా భాయ్.. ఈ చాయ్, చమక్కులే చూడరా భాయ్. సినిమాలోనే కాదు ప్రతీ ఒక్కరి లైఫ్‌లోనూ ‘టీ’ చేసే మేజిక్ అంతాఇంతా కాదు. ఎంత ప్రెజర్ ఉన్నా.. హుష్ కాకిలా ఎగరగొట్టేస్తుంది. ఎంతటి డల్‌నెస్‌ నైనా ఇట్టే తీసిపడేస్తుంది. ఆనందంగా ఉన్నా ఓ కప్పు టీ తాగాల్సిందే. బాధలో ఉన్నా చాయ్‌తో సేద తీరాల్సిందే. దోస్తులు కలిస్తే చాయ్ పీనా జరూరీ హై. ఇంటికి చుట్టాలొచ్చినా టీ తో స్వాగతం పలకాల్సిందే. పొద్దు్న్న లేవగానే కడుపులో టీ పోయాల్సిందే. రాత్రి పడుకునే వరకూ.. ఎన్ని టీలు తాగుతారో లెక్కే ఉండదు. అలా, చాలామంది జీవితాల్లో టీ ది మేజర్ రోల్. ఇండియాలోనే కాదు.. ఆసియా దేశాలన్నిటిలోనూ టీ.. స్పెషాలి’టీ’నే.


నార్మల్ టీ, బ్లాక్ టీ, మసాలా టీ, స్ట్రాంగ్ టీ, గ్రీన్ టీ, అల్లం టీ, యాలకుల టీ, తులసీ టీ.. ఇలా రకరకాల వేరియంట్స్‌లో టీ ని ఆస్వాదిస్తున్నాం. తాగే వారి సంగతి పక్కనపెడితే.. టీ కొట్టు పెట్టుకుని కోటీశ్వరులైన వారి సంఖ్య కోకొల్లలు. అట్లుంటది మరి చాయ్‌తోని.

దుబాయ్‌లో కరాక్ చాయ్


మన దగ్గరే కాదు.. దుబాయ్‌లోనూ చాయ్‌దే హవా. టీ లేనిదే వారికి డే గడవదు. ‘కరాక్ చాయ్’ దుబాయ్‌లో ఫుల్ ఫేమస్. మనలానే అక్కడ కూడా గల్లీ గల్లీలో చాయ్ అమ్ముతుంటారు. వేడి వాతావరణంలోనూ.. వేడి వేడి టీ గొంతు దిగుతుంటే ఆ మజానే వేరబ్బా అంటారు. కరాక్ చాయ్‌ను ఇష్టంగా తాగుతారు దుబాయ్ వాసులు.

చిక్కగా, స్ట్రాంగ్‌గా, రుచిగా ఉంటుంది కరాక్. దాదాపు మన టీ లానే ఉంటుంది. తయారీ విధానమూ దాదాపు సేమ్. అందులో వాడే టీ పొడే అంతటి టేస్ట్‌ని తీసుకొస్తుంది. పేరుకు దుబాయ్ చాయ్ అయినా.. మనమూ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు.

ఇంట్లో ఎలా చేయాలంటే..

కప్పు నీటిని వేడి చేయాలి. అందులో టీ పొడి వేసి మరగనివ్వాలి. 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో ఉంచాలి. బాగా మరిగాక, రంగు మారాక.. అందులో ఒక కప్పు చిక్కటి పాలు పోయాలి. సరిపడినంత చక్కర వేసి కలపాలి. ఆ తర్వాత మరో 5-7 నిమిషాలు స్టవ్ మీద అలానే మరగనివ్వాలి. ఎంత మరిగితే.. టీ అంత చిక్కగా, టేస్టీగా ఉంటుంది. అదనపు రుచికి కావాలంటే 2 యాలకులు దంచి వేసుకోవచ్చు. అల్లం టీ కోసం.. చిన్న ఫ్రెష్ అల్లం ముక్క వేసుకోవాలి. రిచ్‌నెస్ కోసం చిటికెడ్ కుంకుమపువ్వు చల్లాలి. అంతే. వేడి వేడి కరాక్ టీ రెడీ. అంతే వేడిగా సర్వ్ చేసుకుని తాగేయడమే తరువాయి. పేరుకు దుబాయ్ ఫేమస్ కరాక్ చాయ్ అనే కానీ.. మన ఇంట్లో చేసుకునేది కూడా ఇలానే ఉంటుంది కదా. కాకపోతే, మనం వాడే టీ పౌడర్‌ను బట్టి రుచి అటూఇటూగా ఉంటుంది. ప్రీమియం క్వాలిటీ అస్సాం టీ పొడి అన్నిటికంటే బెస్ట్.

 

Related News

Poor Kidney Function: కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని తెలిపే.. సంకేతాలు ఇవే !

Type 5 Diabetes: టైప్-5 డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. లక్షణాలు ఎలా ఉంటాయంటే ?

Heart Disease: గుండె సంబంధిత సమస్యలకు చెక్ పెట్టే.. 5 సూపర్ ఫుడ్స్ ఇవే !

Ghost In Dreams: నిద్రకు ముందు ఇలాంటి పనులు చేస్తే.. దెయ్యాలు కలలోకి వస్తాయ్, జర భద్రం!

Sleep on Side: గుండె సేఫ్ గా ఉండాలంటే ఏ సైడ్ పడుకోవాలి? డాక్టర్లు ఏం చెప్తున్నారంటే?

Diet tips: రాగి ముద్ద తినడం వల్ల కలిగే ఆరోగ్య రహస్యాలు.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు

Shocking Facts: రాత్రి 7 తర్వాత భోజనం చేస్తారా? మీ ఆరోగ్యానికి షాక్ ఇచ్చే నిజాలు!

Heart Problems: రాత్రిపూట తరచూ గురక.. నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన 5 ఆరోగ్య సమస్యలు

Big Stories

×