Lovely Movie review : మన టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శక ధీరడు ఎస్ ఎస్ రాజమౌళి (S.S Rajamouli) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ సినిమాలలో “ఈగ” (Eega)సినిమా ఒకటి. ఈ చిత్రం 2012వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. నాని,సుదీప్, సమంత ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. హీరో నాని చనిపోవడం ఈగ రూపంలో తనని చంపిన వారి పట్ల ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇలా పగ ప్రతికారాలతో రాజమౌళి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఇలా ఒక చిన్న జీవితో అద్భుతమైన సినిమాని తీసుకువచ్చిన ఘనత అప్పట్లో రాజమౌళికే దక్కింది అని చెప్పాలి.
పగ కాదు… స్నేహం…
ప్రస్తుతం ఈగ సినిమా తరహాలోనే లవ్లీ (Lovely)అనే సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లవ్లీ సినిమాను మనసును హత్తుకుని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని చెప్పాలి. మలయాళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా, కథ రచయితగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దిలీష్ కరుణాకరన్ (Dileesh Karunakaran)ఈగ ద్వారా మరొక అద్భుతమైన కాన్సెప్ట్ తో లవ్లీ సినిమాని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈ సినిమాలో ఈగ బోనీ (మాథ్యూ థామస్) అని యువకుడ్ని వెంటాడుతూ ఉంటుంది. బోనీ కెఎస్ఈబి స్టేషన్ లో క్లర్క్ గా పని చేస్తూ ఉంటారు. ఇక ఈయన ఉద్యోగంలోకి చేరిన కొద్ది రోజులకి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది.
మనసును హత్తుకునే చిత్రం…
ఇలా జైలుకు వెళ్లిన తర్వాత బోనీ అక్కడ ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఇక హౌస్ ఫ్లై తనను ఏ విధంగా కాపాడుతుందనేది ఆసక్తికరంగా మారింది. కథ ప్రారంభంలో సజావుగా సాగుతుంది, బోనీ మరియు అతని సహోద్యోగి షైన్ (ప్రశాంత్ మురళి) మరియు అశ్వతి మనోహరన పోషించిన పాత్రలు అద్భుతంగా ఆకట్టుకుంటాయి.బోనీ మరియు హౌస్‌ఫ్లై మధ్య కెమిస్ట్రీ కూడా చాలా చోట్ల మంచిగా వర్కౌట్ అయింది. ఈ సినిమాలో వచ్చే కామెడీ సన్నివేశాలు కూడా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి. ఇకపోతే ఈ విధమైనటువంటి ఫాంటసీ సినిమాలు మన తెలుగులో ఎక్కువగా వస్తున్నప్పటికీ మలయాళ చిత్ర పరిశ్రమలో చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి.
ఈ సమయంలో, దిలీష్ కరుణాకరన్ వంటి చిత్రనిర్మాతలు 3D ఫార్మాట్‌లో ఒక మనిషి ఈగ మధ్య జరిగే ఈ సంభాషణతో అద్భుతమైన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించారు. ఇక ఈ సినిమాకు CGI, గ్రాఫిక్స్ ప్రాణం పోసాయని చెప్పాలి.చిత్రానికి సినిమాటోగ్రఫీని ప్రముఖ దర్శకుడు ఆషిక్ అబు పనిచేయగా, సంగీతం విష్ణు విజయ్ అందించారు. మొత్తానికి ఈగ కాన్సెప్ట్ తో లవ్లీ అనే చిత్రాన్ని ఎంతో అద్భుతంగా ప్రేక్షకుల మనసును హత్తుకునే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారని చెప్పాలి.