Ear Problems: చెవులు మన శరీరంలోని చాలా కీలకమైన అవయవాలు. శబ్దాలను అర్థం చేసుకోవడంలో ఇవి సహాయం చేస్తాయి. అయితే, చెవులు శుభ్రం చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఎందుకంటే, చెవుల్లో చెత్త, గుబిలి ఇతర అనవసర పదార్థాలు చేరిపోవడం వల్ల వినికిడి సమస్యలు వచ్చి, ఇతర సమస్యలను కూడా కలిగించే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చెవుల్లో ఇయర్ వ్యాక్స్ తయారు కావడం అనేది అత్యంత సహజమైన ప్రక్రియ. ఇది చెవులను బాక్టీరియా, వైరస్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అయితే, గుబిలి ఎక్కువగా చేరినప్పుడు అది చెవులను బ్లాక్ చేసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇయర్ వ్యాక్స్ ఎక్కువగా చేరినప్పుడు చెవులు నొప్పిగా అనిపిస్తాయట. దీంతో వినికిడి స్పష్టత కోల్పోతుందని డాక్టర్లు చెబుతున్నారు. చెవిలో వ్యాక్స్ ఎక్కువగా ఉండడం వల్ల నొప్పి, వాపు వంటి సమస్యలు వచ్చి చెవిలో బాధను కలిగించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా ఇయర్ వ్యాక్స్ కారణంగా చెవుల్లో బాక్టీరియా, ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ రకమైన ఇన్‌ఫెక్షన్స్ వల్ల చెవిలో తీవ్రమైన నొప్పి వచ్చే ప్రమాదం కూడా ఉందని అంటున్నారు.
చెవులను ఎలా శుభ్రం చేసుకోవాలి?
చెవులను శుభ్రం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చెవులు శుభ్రం చేయడంలో జాగ్రత్త వహించడం చాలా అవసరం. ముఖ్యంగా, పిల్లలు, వృద్ధులు వాడే పరికరాలు దాదాపు ప్రమాదకరంగా ఉండవచ్చు.
చెవులను శుభ్రం చేయడం అనగానే చాలా మందికి ఇయర్ బడ్స్ లేదా కాటన్ బడ్స్ గుర్తొస్తాయి. వీటిని వాడడం అంత మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. చెవులను శుభ్రం చేయాలనే ఆలోచనతో ఇయర్ బడ్స్‌ని చెవిలో పెడితే గుబిలి మరింత లోపలికి వెళ్లే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అందుకే వీలైనంత వరకు ఇయర్ బడ్స్ వాడకాన్ని తగ్గించడం మంచిదని సూచిస్తున్నారు.
మీరు చెవులను శుభ్రం చేసుకోవాలంటే ENT నిపుణుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు. చెవులు శుభ్రం చేయడానికి డాక్టర్లు సరైన మార్గాలను చూపిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.