Early White Hair: ఈ రోజుల్లో.. అన్ని వయస్సుల వారు తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం వారి ఆహారపు అలవాట్లు కావచ్చు. చాలా మంది తెల్ల జుట్టు కారణంగా ఎక్కువగా ఖర్చు చేసి హెయిర్ కలర్స్ వాడుత డబ్బు వృధా చేస్తూ ఉంటారు. మీరు కూడా పార్లర్, లేదా సెలూన్‌కు వెళ్లి మీ తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవడానికి పయత్నిస్తుంటే మాత్రం.. జాగ్రత్తగా ఉండండి.
ఎందుకంటే ఇవి మీ జుట్టును తాత్కాలికంగా నల్లగా చేస్తాయి. కానీ మీ శరీరంలో అనేక తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. అందుకే వీటికి దూరంగా ఉండటం మంచిది. మీరు ఇంట్లోనే మీ జుట్టును నల్లగా, మందంగా మార్చుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. మరి ఎలాంటి టిప్స్ తెల్ల జుట్టును నల్లగా మారుస్తాయనే విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకు:
కొబ్బరి నూనె జుట్టుకు చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మనం కొబ్బరి నూనెలో కాస్త కరివేపాకులు వేసి అప్లై చేస్తే.. మంచి ఫలితం ఉంటుంది. ఇది జుట్టు పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొబ్బరి నూనెలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీం తో పాటు కరివేపాకులో భాస్వరం, ఇనుము, మెగ్నీషియం , కాల్షియం తగినంత పరిమాణంలో ఉంటాయి. అందుకే కొబ్బరి నూనెలో కరివేపాకులను వేసి మరిగించి.. మీ జుట్టుకు అప్లై చేయండి. ఈ నూనెను తరచుగా వాడటం వల్ల కొద్ది రోజుల్లోనే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గుతుంది. తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు ఈ ఆయిల్ వాడటం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
ఉసిరి నూనె:
మీరు మీ జుట్టుకు ఉసిరి నూనె, ఉసిరి పౌడర్ లేదా ఉసిరి హెయిర్ మాస్క్ ఉపయోగిస్తే.. ఇది మీరు తెల్ల జుట్టు సమస్య నుండి బయటపడేలా చేస్తుంది . మీరు వారానికి 3 సార్లు మీ జుట్టు మీద ఉసిరి సంబంధిత ఉత్పత్తులను ఉపయోగిస్తే, మీ జుట్టు మందంగా, బలంగా, సిల్కీగా మారుతుంది. ఎందుకంటే ఆమ్లాలో విటమిన్ ఎ, సి, బి కాంప్లెక్స్, ఫైబర్ , కార్బోహైడ్రేట్లు వంటి అనేక రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మీ జుట్టును తెల్లగా మార్చడంలో కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.
Also Read: వారానికి ఎన్ని సార్లు.. తలస్నానం చేయాలో తెలుసా ?
హెన్నా, మెంతుల వాడకం:
కొబ్బరి నూనె లేదా ఆవ నూనెలో హెన్నా లేదా మెంతి గింజలతో కలిపి అప్లై చేస్తే.. ఇది మీ జుట్టు పొడిబారకుండా , నిర్జీవంగా మారకుండా ఉంటుంది. కొబ్బరి, ఆవ నూనెలో ప్రోటీన్, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ వంటి అనేక లక్షణాలు ఉంటాయి. ఇవి మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. అంతే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో కూడా ఉపయోగపడతాయి. తెల్ల జుట్టు నల్లగా మారాలని అనుకునే వారు మెంతులను వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతే కాకుండా తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి మెంతులను నూనెలో వేసి మరిగించి వాడటం కూడా మంచిదే.