OTT Movie : ఓటీటీలో రొమాంటిక్ సినిమాలకి కొదవలేదు. అందులోనూ హాలీవుడ్ సినిమాలంటే చెప్పాల్సిన పని లేదు. రొమాంటిక్ సన్నివేశాలను ఈ సినిమాలను ఒక రేంజ్ లో చూపిస్తారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక అమ్మాయికి విచిత్రమైనటువంటి పవర్ ఉంటుంది. ఆ పవర్ ఏంటో మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ఆ పవర్ తో అబ్బాయిల ప్రైవేట్ పార్ట్ లు కట్ అయిపోతాయి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో
ఈ అమెరికన్ హారర్ కామెడీ మూవీ పేరు ‘టీత్’ (Teeth). దీనికి మిచెల్ లిచ్టెన్‌స్టీన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక డాన్ అనే యువతి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆమె తన శరీరంలో ఒక అసాధారణమైన మార్పును గమణిస్తుంది. ఆమెకి ఒక రహస్య ప్రదేశంలో పళ్ళు ఉన్నాయని తెలుసుకుంటుంది. ఈ మూవీ స్త్రీలు తమను తాము రక్షించుకోవడానికి ఉపయోగించే అసాధారణమైన శక్తిని, ఊహాత్మకంగా చూపిస్తుంది. ఇది ‘వాజైనా డెంటాటా’ (vagina dentata) అనే పురాణ కథనం నుండి ప్రేరణ పొందింది. ఈ మూవీ పురుషాధిక్య సమాజంలోని భయాలను, వ్యంగ్యాత్మకంగా, భయానకంగా చూపిస్తుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
డాన్ ఓకీఫ్ అనే టీనేజ్ అమ్మాయి తన సవతి సోదరుడు బ్రాడ్‌తో కలిసి ఒక చిన్న పట్టణంలో నివసిస్తుంది. ఆమె ఒక సాంప్రదాయికమైన జీవనశైలిని అనుసరిస్తూ, లైంగిక సంబంధాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటుంది. అయితే ఆమె తన స్నేహితుడు టోబీ అనే అబ్బాయితో సన్నిహితంగా మెలిగినప్పుడు, ఈ విషయాలు తప్పుదారి పడతాయి. ఒక రోజు టోబీ ఆమెపై లైంగిక దాడి చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు డాన్‌కి తన శరీరంలోని అసాధారణ శక్తి ఉందని తెలుస్తుంది. ఆమెకు ఉన్న శక్తితో టోబీని తీవ్రంగా గాయపరుస్తుంది. అతని పరిస్తితి చెప్పుకోలేని విధంగా తయ్యారావుతుంది. ఈ ఘటన తర్వాత, డాన్ తన శరీరం గురించి మరింత తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. అయితే ఈ అస్త్రం ఆమెకు ఒక రక్షణగా ఉందని గ్రహిస్తుంది.
కథ ముందుకు సాగుతున్న కొద్దీ, ఆమె తనపై దురుసుగా ప్రవర్తించే ఇతర పురుషులను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా ఆమె సవతి సోదరుడు బ్రాడ్ అనే వ్యక్తి, ఆమె మీద కన్ను వేస్తాడు. అతడు ఒక వైద్య వృత్తిని నిర్వహిస్తుంటాడు. అతను కూడా ఆమె బాధితులలో ఒకడు అవుతాడు. చివరికి డాన్ తన శరీరాన్ని ఒక శక్తిగా ఉపయోగించడం నేర్చుకుంటుంది. ఆమెను వక్ర బుద్ధితో చూసేవారిపై ప్రతీకారం తీర్చుకుంటుంది. ఈ సినిమా ఒక విచిత్రమైన కథనం వల్ల కల్ట్ క్లాసిక్‌గా పేరు పొందింది. ఇది ఒకేసారి భయానకంగా, హాస్యాస్పదంగా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. మీరు కూడా ఈ మూవీని చూడాలి అనుకుంటే, అమెజాన్ ప్రైమ్ వీడియొ (Amazon Prime Video) లో అందుబాటులో ఉంది.