Karonda Fruit Benefits: చాలా మందికి వాక్కాయ అంటే తేలియదు. కానీ దీనితో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వాక్కాయలు లేత గులాబీ రంగులో పుల్లగా ఉంటాయి. వాక్కాయలు విటమిన్ బి, సి, ఐరన్ రోగనిరోధకశక్తిని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. ఇది వాక్కాయలుగా సుపరిచితమైన ఈ పండ్లు మూత్ర నాళాన్ని శుభ్రపరచడంతో పాటు కిడ్నీలో రాళ్లు కరిగిపోయేలా సహకరిస్తాయంటున్నారు పోషకాహార నిపుణులు.
వాక్కాయ ప్రయోజనాలు:
. వాక్కాయలలో విటమిన్ బి, సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే సీజన్ వల్ల ఇన్ఫెక్షన్లు వ్యాధులకు దూరంగా ఉంచుతుంది.
. వగరు, పులుపు కలిపిన ఈ వాక్కాయలో అధికంగా ఫైబర్ ఉంటుంది. ఉదర సమస్యలు నివారించడానికి ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం తొలగించడానికి సహాయపడుతుంది.
. వాక్కాయలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
. సీజన్‌లో దొరికే ఈ వాక్కాయను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా… తక్షణ శక్తిని ఇస్తుంది.
. దీనిలో విటమిన్లు మరియు ట్రిప్టోఫాన్లతో పాటు మెగ్నీషియం ఉండటం వల్ల సిరోటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
. వాక్కాయ శరీరంలోని పిత్తాశయం, చిగుళ్లలో రక్తస్రావం మరియు అంతర్గత రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా దంతాలు పుచ్చిపోకుండా ఉండడమే కాకుండా, నోటి దుర్వాసన నుంచి కాపాడుతుంది.
. వాక్కాయలలో విటమిన్ ఎ, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని ఎదుర్కుంటాయి. అలాగే చర్మానికి యవ్వనపు ఆరోగ్యకరమైన మెరుపును ఇస్తాయి. చర్మ ఆరోగ్యం పాడవుకుండా మేలు చేస్తాయి.
. వాక్కాయను యాపిల్, నారింజ, లేదా నీటితో అయినా సరే కలిపి జ్యూస్ తయారుచేసుకుని తాగితే మంచిది. ఇది శరీరానికి పోషకాలనే కాదు.. మంచి రిఫ్రెష్‌మెంట్ కూడా ఇస్తుంది.
. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా వాక్కాయలు మెరుగ్గా పనిచేస్తాయి. మధుమేహం ఉన్నవారు వాక్కాయలతో చేసిన ఆహార పదార్థాలు తింటూ ఉంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు.
. వాక్కాయల రసం ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, శరీరంలో అంతర్గత రక్తస్రావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది.
. ఇది శరీరంలోని వాపులను తగ్గించడంతో పాటు, బరువు కూడా తగ్గిస్తుంది. అధిక బరువు ఉన్నవారు వీటిని తినడం వల్ల మంచి ఫలితం లభిస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
. దీనిలో ఉండే విటమిన్లు మరయు అమైనో యాసిడ్ మెదడును చురుగ్గా ఉంచుతాయి. అలాగే ఒత్తిడిని తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.. వాక్కాయలు కాలేయాన్ని మరియు రక్తాన్ని శుద్ది చేయడంలో సహాయపడతాయి. శరీరంలో కొవ్వు నిల్వలు చేరుకోకుండా చూస్తాయి.
. వాక్కాయలు ఎల్లప్పుడూ అందుబాటులో లేని వారు వాక్కాయలను ఎండించి పొడి చేసుకుని వాటిని కూరల్లోనూ, పులుసు తయారీలోనూ జోడించవచ్చు. ఇది కూరకు అదనపు రుచిని ఇవ్వడమే కాకుండా వాక్కాయ నుండి లభించే ఫలితాలు లభిస్తాయి.