BigTV English

Banana On Empty Stomach: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినొచ్చా.. తింటే ఏమౌతుంది!

Banana On Empty Stomach: ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటిపండు తినొచ్చా.. తింటే ఏమౌతుంది!
Eating Banana On Empty Stomach

Eating Banana On Empty Stomach: అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. సాంప్రదాయ భారత ఆహార పదార్థాల్లో ఇది ఒకటి. మన ఇంట్లో జరిగే ప్రతి వేడుకలోనూ అరటిపండు ఉండాల్సిందే. అరటి పండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరానికి శక్తిని ఇస్తాయి.


మనకు ఆకలిగా ఉన్నప్పుడు అరటిపండు తింటే తక్షణమే ఎనర్జీని ఇస్తాయి. అరటిపండు శరీరంలోని కొవ్వును కూడా కరిగిస్తుంది. ఇవన్నీ జరగాలంటే అరటిపండు తినడానికి ఒక సమయం ఉంటుంది. ఆ సరైన సమయంలో తినడం వలనే ఈ ఫలితాలను పొందవచ్చు. ఉదయాన్నే జిమ్‌కి వెళ్లి వర్కౌట్లు చేసే వారు, ఉదయాన్నే బాగా ఆకలిగా అనిపించినవారు.. అరటిపండు ఎక్కువగా ఖాళీ కడుపుతో తింటుంటారు.

ఎందుకంటే ఇవి తిన్న వెంటనే శరీరంలో ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఇదంతా నిజమే అయినప్పటికీ.. ఖాళీ కడుపుతో అరటిపండ్లు తీసుకుంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఆఫీస్‌కు వెళ్లాలనే తొందరలో అరటిపండ్లను తిని పరుగెడుతుంటారు. ఎందుకంటే శక్తితో కూడిన పండు.. రోజంతా దీని వల్ల యాక్టివ్‌గా పనిచేస్తారు.


Read More: ఈ డ్రింక్స్‌తో సూపర్ బెనిఫిట్స్..!

కానీ ఇలా తినడం మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని అంటున్నారు. దానికి గల కారణాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండులో ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి. అరటిపండులో ఆమ్లం కూడా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఆమ్లంతో కూడిన ఆహార పదార్థాలు తీసుకోకూడదు.

ఖాళీ కడుపుతో ఆమ్ల ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణక్రియలో సమస్యలు తలెత్తుతాయి.అలానే అరటిపండులోని మెగ్నీషియం, పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఖాళీ కడుపుతో అరటిపండును తీసుకోవడం వల్ల రక్తంలోకి ఈ పోషకాలు చేరుతాయి. దీని వల్ల గుండెకు హాని కలిగే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Read More: జిమ్ తర్వాత.. వీటిని టచ్ చేయకండి..!

అరటిపండు ఖాళీ కడుపుతో తింటే అది కేవలం తక్షణ శక్తిని మాత్రమే ఇస్తుంది. ఆ శక్తి తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి మీరు త్వరగా అలసిపోతారు. శరీరం శక్తిని కోల్పోతుంది. నీరసంగా మారుతారు. మళ్లీ ఆకలి వేస్తుంది. అందుకే ఖాళీ కడుపుతో అరటి పండును తీసుకోకండి. ఏదైనా తిన్న తర్వాత అరటిపండును తినడమే ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు.

Disclaimer: ఈ కథనం వైద్యుల సలహాలు, సూచనల మేరకు రూపొందించబడింది.

Related News

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Dengue Fever: వర్షాకాలంలో జ్వరమా ? డెంగ్యూ కావొచ్చు !

Big Stories

×