BigTV English

Hair Loss Prevention: బట్టతల రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

Hair Loss Prevention: బట్టతల రాకుండా ఉండాలంటే.. ఈ టిప్స్ ట్రై చేయండి

Hair Loss Prevention Tips: నేడు చాలామంది ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల్లో జుట్టు రాలడం కూడా ఒకటి. చిన్నాపెద్దా తేడా లేకుండా జుట్టు రాలడం సమస్యను ఎదుర్కొంటున్నారు. జుట్టు రాలే సమస్యతో మానసికంగా కూడా చాలా కుంగిపోతున్నారు.అందుకే బట్టతల వచ్చాక బాధపడటం కంటే ముందే జుట్టు రాలడాన్ని తగ్గించుకోవడం మంచిది. జుట్టు రాలడం బట్టతల వంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మన జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


ఒత్తిడి:
ఆరోగ్యంపై ఒత్తిడి ప్రభావం చూపడమే కాకుండా జుట్టు ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో ప్రభావితం చేస్తుంది అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల, తాత్కాలిక ఒత్తిడి టెలోజెన్ ఎఫ్లూవియంను ప్రేరేపిస్తుంది. దీంతో జుట్టు అధికంగా రాలుతుంది. కాబట్టి జుట్టు రాలకుండా ఉండాలంటే ఒత్తిడిని కంట్రోల్ చేసుకోవాలి. అందుకోసం యోగా ధ్యానం చేయడం వంటివి అలవాటు చేసుకోవడం ఉత్తమం.

2009 Archives of dermatology జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం ఎక్కువ ఒత్తిడికి గురైన పురుషుల్లో.. తక్కువ ఒత్తిడికి గురైన పురుషుల కంటే బట్టతల రావడం 2.6 రెట్లు ఎక్కువగా ఉంటుందని కనుగొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ లు ఈ పరిశోధనలో పాల్గొన్నారు. ఎక్కువ ఒత్తిడికి గురయ్యేవారిలో జుట్టురాలే సమస్య అధికంగా ఉంటోందని పరిశోధనల్లో రుజువైంది.


జీవనశైలిలో మార్పులు:
బట్టతల రావడానికి జీవనశైలిలో వచ్చిన మార్పులు కూడా ప్రధాన కారణం. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కోకుండా ఉండాలంటే సరైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ఎంతో అవసరం. స్మోకింగ్ కు కూడా దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా బట్టతల రావటాన్ని తగ్గించుకోవచ్చు.
హార్మోన్ సమస్యలు:
బట్టతలకు సంబంధించి పురుషుల్లో కొన్ని వైద్య పరిస్థితులు, చికిత్సలు దోహదం చేస్తాయి. ముఖ్యంగా అలోపేసియా, థైరాయిడ్ వంటి సమస్యలు జుట్టు రాలడానికి కారణమవుతాయి. అంతేకాకుండా కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సలు తాత్కాలికంగా లేదా శాశ్వతంగా బట్టతలకు దారితీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ సమస్య బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వంశ పారంపర్యం:
వంశ పారంపర్యంగా కొందరిలో బట్టతల వస్తుంది. మీ వంశంలో కూడా ఎవరికైనా బట్టతల ఉంటే దాన్ని ఆపడం దాదాపుగా ఎవరి వల్లా కాదు. అందుకే అలాంటి వారు పైన చెప్పిన వాటితో పాటు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా బట్టతలను కొంతమేర అడ్డుకోవచ్చు.
హెయిర్ మసాజ్:
జుట్టుపై ఎక్కువ ఒత్తిడి కలిగించే హెయిర్ స్టైల్స్ ఫాలో అవ్వడం తగ్గించుకోవాలి. తలకు రెగ్యులర్ మసాజ్ చేసుకోవడం మంచిది. హెయిర్ మసాజ్ ద్వారా రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అంతేకాకుండా బట్టతల ఆలస్యం అవుతుంది.

Also Read: ధనియాలతో ఫుల్ బెనిఫిట్స్.. 15 రోజుల్లోనే బరువు తగ్గడం ఖాయం

ప్రొటీన్ ఫుడ్:
మీ డైట్‌లో ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. నట్స్, చేపలు, గుడ్లు, చికెన్, మాంసం వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం మంచిది. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా జుట్టు రాలడం తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించండి.

Tags

Related News

Raksha Bandhan Wishes 2025: రాఖీ పండగ సందర్భంగా.. మీ తోబుట్టువులకు శుభాకాంక్షలు చెప్పండిలా !

Tan Removal Tips: ముఖం నల్లగా మారిందా ? ఇలా చేస్తే.. క్షణాల్లోనే గ్లోయింగ్ స్కిన్

Cinnamon water: ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీరు తాగితే.. మతిపోయే లాభాలు !

Junk Food: పిజ్జా, బర్గర్‌లు తెగ తినేస్తున్నారా ? జాగ్రత్త !

Health Tips: ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో చర్మం, జుట్టుకు బోలెడు లాభాలు !

Broccoli Benefits: బ్రోకలీ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Big Stories

×