Smartphone Addiction: ఈ రోజుల్లో చాలా మంది పిల్లలు ఫోన్ చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
ఇంట్లో ఆన్‌లైన్ గేమ్స్ ఆడటానికి ఇష్టపడుతున్నారు. తమకున్న పూర్తి ఖాళీ సమయాన్ని మొబైల్ రీల్స్ , షార్ట్స్ చూస్తూ గడిపేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లలో పిల్లల కోసం వివిధ రకాల రీల్స్ లేదా షాట్స్ అందుబాటులో ఉన్నాయి.
ఈ రీల్స్ కొన్ని సెకన్ల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే పిల్లలు గంటల తరబడి ఫోన్‌లో మునిగిపోతారు. పిల్లలు వీడియోలను ఎక్కువగా చూస్తే.. అది వారి మానసిక, శారీరక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాన్ని చూపడం ప్రారంభిస్తుంది. పిల్లలు మొబైల్ రీల్స్, షార్ట్స్ కు బానిస అవడం వల్ల తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయి. అందుకే తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తలు చూసుకోవాలి.
జాగ్రత్తలు తప్పనిసరి:
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు పిల్లలకు అంత సురక్షితం కాదు. మీరు మీ పిల్లలకు ఎలాంటి పర్యవేక్షణ లేకుండా వివిధ రకాల వీడియోలను చూడటానికి అనుమతిస్తే.. ఆ వీడియోలో చూసిన కంటెంట్‌ను పిల్లవాడు సరిగ్గా అర్థం చేసుకోలేకపోవచ్చు. అంతే కాకుండా వారు ఫోన్ వచ్చే అనవసర కంటెంట్ ద్వారా ప్రభావితం అవుతారు. చాలా సార్లు, పిల్లల వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో కూడా షేర్ చేసే ప్రమాదం కూడా ఉంటుంది. ఇది వారి భద్రతకు ముప్పు కలిగిస్తుంది.
శారీరక ఆరోగ్యం:
పిల్లలు వీడియోలు చూసే సమయంలో.. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా గంటల తరబడి కూర్చుంటారు. ఇలాంటి జీవనశైలి కారణంగా.. పిల్లలలో ఊబకాయం, సోమరితనం, వెన్నునొప్పి, శరీర నొప్పి, మెడ నొప్పి మొదలైన సమస్యలు పెరగడం ప్రారంభం అవుతుంది. అంతే కాకుండా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల పిల్లలు ఎక్కువ సేపు విశ్రాంతి తీసుకోవడానికి అలవాటు పడతారు.
భావోద్వేగంపై ప్రభావం:
రీల్స్ చూడటం వల్ల పిల్లల మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. రీల్స్ లో చూసిన సమాచారం వల్ల పిల్లలు ప్రభావితమవుతారు. అంతే కాకుండా వారి మనస్సు చంచలంగా మారుతుంది. అంతే కాకుండా పిల్లలు నిరాశ, ఒంటరితనం వంటి సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో.. పిల్లలు వాస్తవ ప్రపంచానికి , డిజిటల్ ప్రపంచానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోలేరు. కాబట్టి ఇది వారి మానసిక అభివృద్ధిలో సమస్యలను కలిగిస్తుంది.
సామాజిక నైపుణ్యాలు:
మొబైల్ రీల్స్ , షార్ట్స్ పిల్లలు డిజిటల్ ప్రపంచంలో మునిగిపోయే అవకాశాన్ని కల్పిస్తాయి. ఇది వారి సామాజిక నైపుణ్యాలను బాగా ప్రభావితం చేస్తుంది. పిల్లలు ఇంట్లో, స్కూల్లో లేదా ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ఎవరితోనూ సరిగ్గా మాట్లాడటానికి ఇష్టపడరు. అంతే కాకుండా ఇతరులతో సరిగ్గా కలిసిపోలేరు.
అధ్యయనాలపై ప్రభావం:
ఈ వ్యసనం పిల్లల చదువులపై కూడా చాలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఫోన్ లో కొన్ని రకాల షాట్ వీడియోలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీటిని చూడటం వల్ల కూడా పిల్లలు తమ చదువుపై దృష్టి పెట్టలేకపోతుంటారు. మొబైల్‌లో గంటల తరబడి సమయం వృధా చేయడం వల్ల పిల్లలు చదువుకు సమయం కేటాయించలేకపోతుంటారు.
Also Read: బీట్‌రూట్ రైతా తింటే.. ఇన్ని ప్రయోజనాలా ?
పిల్లలతో కనెక్ట్ అయి ఉండండి:
పిల్లలు బైల్ రీల్స్, షార్ట్స్ కు బానిస కాకుండా నిరోధించడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యం. పిల్లలను స్క్రీన్ సమయం తక్కువగా ఉండేలా చూసుకోండి. అంతే కాకుండా మీరు పక్కన ఉన్నప్పుడు మాత్రమే వారికి ఫోన్ ఇవ్వండి . సమయ దాటి ఎక్కువ సేపు ఫోన్ చూస్తే.. నెమ్మదిగా వారికి వివరించండి. తల్లిదండ్రులు తమ పిల్లలను బహిరంగ ఆటలు, సంగీతం లేదా కళ వంటి వివిధ కార్యకలాపాలలో పాల్గొనేలా నిరంతరం ప్రోత్సహించాలి. పిల్లలతో కూర్చుని మీ చిన్ననాటి కథలను పంచుకోండి. ప్రతిరోజూ మీ పిల్లల కోసం కనీసం 20 నిమిషాలు కేటాయించండి.