E-Paper
Advertisement

ఫాదర్ డే 2026.. రోజంతా నాన్నతో సంతోషంగా గడిపేందుకు ఈ పనులు చేయండి

ఫాదర్ డే 2026.. రోజంతా నాన్నతో సంతోషంగా గడిపేందుకు ఈ పనులు చేయండి
Advertisement

తండ్రుల దినోత్సవం (ఫాదర్స్ డే) సందర్భంగా చాలామంది నాన్నకు ఇవ్వడానికి ఖరీదైన బహుమతులు కొనుగోలు చేస్తారు. కానీ చాలా మంది తండ్రులు బహుమతుల కంటే పిల్లల ప్రేమ, ఆప్యాయత కలిసి గడిపే సమయాన్నే ఎక్కువగా ఇష్టపడతారు. చిన్న చిన్న క్షణాలు కూడా వారి మనసును ఎంతో ఆనందపరుస్తాయి. అందుకే ఈ ఫాదర్స్ డే రోజున ఖరీదైన వస్తువుల కంటే అర్థవంతమైన అనుభవాలను బహుమతిగా ఇవ్వడం మంచిది.

నాన్నకు ఇష్టమైన పనులతో ఉదయాన్ని ప్రారంభించండి

ఉదయం ఆనందంగా ప్రారంభమైతే రోజంతా సంతోషంగా గడుస్తుంది. నాన్నతో కలిసి వాకింగ్ చేయడానికి వెళ్లండి. ఆయనకు ఇష్టమైన టీ లేదా కాఫీ స్పెషల్‌గా తయారు చేసి ఇవ్వండి. ఆయనకు నచ్చే పాటలను వినిపించండి. అవకాశం ఉంటే ఆయనకు ఇష్టమైన ఐటెమ్స్ టిఫిన్‌లో రెడీ చేయండి. మీరు చేసే ఈ చిన్న ప్రయత్నాలు ఆయన ముఖంపై చిరునవ్వు తీసుకువస్తాయి. ప్రేమతో ప్రారంభమైన ఉదయం ఆయనకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంది.

నాన్నతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోండి

Advertisement

మధ్యాహ్న సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి పాత ఫోటో ఆల్బమ్‌లు చూడండి. చిన్నప్పటి ఫోటోలు చూసి పాత రోజుల గురించి మాట్లాడండి. నాన్న చిన్నప్పుడు ఆయన తల్లిదండ్రులు, స్నేహితులతో గడిపిన అనుభవాలు, కుటుంబ సంఘటనలు, ఆసక్తికరమైన కథలు చెప్పమని అడగండి. ఇలాంటి సంభాషణలు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాన్ని మరింత బలపరుస్తాయి. నవ్వులు, సరదా జ్ఞాపకాలు ఇంట్లో ఆనంద వాతావరణాన్ని తీసుకొస్తాయి.

సాయంత్రం నాన్నతో కలిసి కుటుంబమంతా సినిమా చూడండి

సాయంత్రం సమయంలో కుటుంబ సభ్యులందరూ కలిసి సినిమా చూడటం మంచి ఆలోచన. నాన్నకు ఇష్టమైన పాత క్లాసిక్ సినిమా లేదా కొత్తగా విడుదలైన మంచి సినిమా ఎంచుకోవచ్చు. సినిమా చూస్తూ తేలికపాటి స్నాక్స్, పానీయాలు ఏర్పాటు చేయండి. మధ్యలో సినిమా గురించి మాట్లాడుకుంటూ ఆనందంగా గడపండి. ఇలాంటి సమయాలు కుటుంబ సభ్యుల మధ్య మరింత అనుబంధాన్ని పెంచుతాయి.

రాత్రి నాన్నతో కలిసి స్పెషల్ డిన్నర్ ప్లాన్

Advertisement

కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. నాన్నకు ఇష్టమైన వంటకాలను తెలుసుకుని వాటిని తయారు చేయండి. వంట చేసే పనిలో అందరూ పాల్గొనవచ్చు. కలిసి వంట చేయడం కూడా ఒక మంచి అనుభవంగా మారుతుంది. ప్రశాంతంగా కూర్చొని భోజనం చేస్తూ కుటుంబ విషయాలు మాట్లాడుకోవడం మరింత సంతోషాన్నిస్తాయి. ఇలాంటి క్షణాలు జీవితాంతం గుర్తుండిపోతాయి.

మనసులోని మాటలను ఒక లేఖలో రాయండి

కొన్నిసార్లు మాటల్లో చెప్పలేని భావాలను ఒక చిన్న లేఖ ద్వారా వ్యక్తం చేయవచ్చు. నాన్నపై మీ ప్రేమ, గౌరవం, కృతజ్ఞతలను రాయండి. ఆయన మీ కోసం చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని ధన్యవాదాలు చెప్పండి. మీకు గుర్తుండిపోయిన మధుర జ్ఞాపకాలను పంచుకోండి. ఈ హృదయపూర్వక మాటలు ఆయన హృదయాన్ని తాకుతాయి.

Also Read: ఫాదర్స్ డే 2026.. పిల్లల కోసం ప్రతి తండ్రి నిశ్శబ్దంగా చేసే 7 త్యాగాలు..

ప్రేమతో కూడిన జ్ఞాపకాలే నిజమైన బహుమతి

తండ్రులు సాధారణంగా ఖరీదైన బహుమతులు ఆశించరు. వారికి కుటుంబ ప్రేమ, గౌరవం.. కలిసి గడిపే సమయమే ఎంతో విలువైనది. చిన్న చిన్న ఆప్యాయతలు కూడా వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఈసారి ఫాదర్స్ డేని ప్రేమ, కృతజ్ఞత, ఆనందంతో జరుపుకోండి. మీరు ఇచ్చే సమయం, ప్రేమ ఆయనకు జీవితాంతం గుర్తుండే గొప్ప బహుమతిగా మారుతుంది.

Related News

జిమ్‌లో బట్టలు మార్చుకుంటున్నారా? మహిళలు తప్పనిసరిగా ఈ 5 జాగ్రత్తలు పాటించాలి

చికెన్, గుడ్లు అక్కర్లేదు.. ఈ 5 హోమ్‌మేడ్ కాంబోలతో ఒక పూటకి 50g ప్రోటీన్ పొందొచ్చు!

సామాన్యుడికి అంతుచిక్కని..శివుడి 5 అద్భుతమైన రహస్య శక్తులు ఇవే!

చలికాలంలో ఫౌండేషన్ వేసినా ప్యాచీగా కనిపిస్తోందా? మేకప్‌కు ముందు ఈ టిప్స్ పాటించండి

జీతం రూ.85 వేలు, SIP పెట్టుబడి రూ.35 వేలు.. బ్యాలెన్స్ రూ.3200 మాత్రమే.. యువ ఇన్వెస్టర్‌లు చేసే తప్పులివే

వాస్తు శాస్త్రం.. ధనత్రయోదశి రోజున ఈ 5 వస్తువులు కొనడం శుభప్రదం..

దీపావళికి మీ లవర్‌ని ఇంటికి ఆహ్వానిస్తున్నారా? పేరెంట్స్‌కు పరిచయం చేసే ముందు ఈ విషయాలు తెలుసుకోండి

మీ జీవితాన్ని నడిపించేది ఎవరు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానం ఇదే

Big Stories

Advertisement
×