BigTV English

Fenugreek For Dandruff: ఈ గింజలు కొన్ని చాలు.. మీ చుండ్రును పూర్తిగా తగ్గించడానికి !

Fenugreek For Dandruff: ఈ గింజలు కొన్ని చాలు.. మీ చుండ్రును పూర్తిగా తగ్గించడానికి !

Fenugreek For Dandruff: మెంతులలో ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. మెంతి గింజలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడతాయి. చుండ్రు, జుట్టు బలహీనపడటం వంటి సమస్యలతో మెంతి గింజలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. మెంతి గింజలను తీసుకోవడం శరీరానికి ఎంత ప్రయోజనకరమో, జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా అంతే మేలు జరుగుతుంది.


జుట్టు ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండటానికి మెంతి గింజలను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. మెంతి గింజల్లో ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మెంతి గింజలు జుట్టుకు ఎలా ఉపయోగపడతాయో.. జట్టుకు మెంతి గింజల పేస్ట్‌ను ఎలా ఉపయోగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

జుట్టుకు మెంతి గింజల ప్రయోజనాలు:


జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది: మెంతులు తలలో రక్త ప్రసరణను పెంచుతాయి. అంతే కాకుండా జుట్టు మూలాలను బలపరుస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో మెంతులు ప్రభావవంతంగా పనిచేస్తాయి.

జుట్టు పెరుగుదలను పెంచుతుంది: లెక్టిన్ అనే మూలకం మెంతి గింజలలో ఉంటుంది. ఇది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.

జుట్టును మృదువుగా , మెరిసేలా చేస్తుంది: మెంతులు జుట్టుకు తేమను అందిస్తాయి. ఇవి జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. అంతే కాకుండా జుట్టును సిల్కీగా చేస్తుంది.

చుండ్రును తగ్గిస్తుంది: మెంతి గింజల్లో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి చుండ్రును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా జుట్టు రాలకుండా చేస్తాయి.

జుట్టుకు సహజ రంగును ఇస్తుంది: మెంతులు జుట్టుకు సహజ రంగును ఇవ్వడంలో సహాయపడతాయి . అంతే కాకుండా చిన్న వయస్సులోనే వచ్చే తెల్ల జుట్టు సమస్యను నివారిస్తాయి.

మెంతి గింజలను తలకు ఎలా ఉపయోగించాలి  ?

మెంతి గింజల పేస్ట్: మెంతి గింజలను రాత్రంతా నీటిలో నానబెట్టండి. ఉదయాన్నే గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను వెంట్రుకలకు పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా తరుచుగా చేయడం వల్ల జుట్టు నల్లగా మారుతుంది. అంతే కాకుండా వెంట్రుకలు నల్లగా మారతాయి.

Also Read: వీటితో.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై చెప్పేయండి

మెంతి గింజల నీరు: మెంతి గింజలను నీటిలో ఉడకబెట్టి, ఈ నీటితో జుట్టును పట్టించి 30 నిమిషాల తర్వాత కడిగేయండి.

మెంతి గింజలు, పెరుగు: మెంతి గింజల పేస్ట్‌లో పెరుగు కలిపి జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. ఈ నీటిని తరుచుగా వాడటం వల్ల చుండ్రు తగ్గుతుంది

మెంతి గింజలు, గుడ్డు: మెంతి గింజల పేస్ట్‌లో ఒక గుడ్డు మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. ఇది జుట్టును బలంగా చేస్తుంది. అంతే కాకుండా చుండ్రును ఈజీగా తగ్గిస్తుంది. జుట్టు సంబంధిత సమస్యలకు మెంతి గింజలు, ఎగ్ హెయిర్ మాస్క్ చాలా బాగా ఉపయెగపడుతుంది.

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Malida Laddu: బతుకమ్మ స్పెషల్ మలీద లడ్డూలు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Emergency Numbers:108 మాత్రమే కాదు! ప్రాణాలను కాపాడే అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

Health Tips: థైరాయిడ్ సమస్యలా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Protein Rich Foods: వీటిలో.. పన్నీర్ కంటే ఎక్కువ ప్రోటీన్ !

Coconut Oil For Skin Glow: ఫేస్ క్రీములు అవసరమే లేదు..కొబ్బరి నూనె ఇలా వాడితే చాలు !

Cholesterol: శరీరంలోని కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గాలంటే ?

Cycling Vs Running: సైక్లింగ్ Vs రన్నింగ్.. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఏది బెస్ట్ ?

Brain Health: మెదడును.. నిశ్శబ్దంగా దెబ్బతీసే అలవాట్లు ఇవే !

Big Stories

×