Flax Seeds: అవిసె గింజలు పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది. ఇవి చూడటానికి చిన్నగా ఉన్నా.. లక్షణాల పరంగా అద్భుతమైనవి. వీటిని తినడం వల్ల శరీరానికి ఎన్నో గొప్ప ప్రయోజనాలు చేకూరుతాయి. అవిసె గింజలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో అవిసె గింజలు కూడా ఉపయోగపడతాయి. వీటిలో క్యాల్షియం పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.
అవిసె గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో మేలు చేస్తుంది: అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గుతుంది. ఇవి రక్తపోటును నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది: అవిసె గింజల్లో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది.ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మలబద్ధకం, అజీర్ణం , IBS వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. ఫైబర్ బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునే వారు వీటిని తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
చర్మానికి మేలు చేస్తుంది: అవిసె గింజల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు చర్మాన్ని హైడ్రేట్‌గా మార్చుతాయి. అంతే కాకుండా మెరిసేలా చేస్తాయి. ఇవి చర్మం మంటను తగ్గించడంలో సహాయపడతాయి. చర్మం వచ్చే తామర, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి.
క్యాన్సర్ నివారణ: అవిసె గింజల్లో ఉండే లిన్సీడ్, సెలీనియం వంటి మూలకాలు రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయని పలు అధ్యయనాల ద్వారా రుజువైంది.
ఎముకలకు మేలు చేస్తుంది: అవిసె గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేస్తాయి. అంతే కాకుండా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. తరుచుగా అవిసె గింజలు తినడం వల్ల ఎముకలు కూడా బలంగా మారతాయి. చిన్న పిల్లలకు కూడా అవిసె గింజలను తరుచుగా తినిపిస్తూ ఉండాలి.
Also Read: ఉదయాన్నే గోరువెచ్చని నీరు త్రాగుతున్నారా ?
అవిసె గింజలు తినడానికి మార్గాలు:
పెరుగులో కలపడం ద్వారా: మీరు అవిసె గింజలను పెరుగులో కలిపి తినవచ్చు.
స్మూతీలో: అవిసె గింజలను స్మూతీలు తయారు చేయడంలో కూడా ఉపయోగించవచ్చు.
సలాడ్‌లో: అవిసె గింజలను సలాడ్‌లో కూడా చల్లుకోవచ్చు.
ఉప్మా, గంజిలో: మీరు అవిసె గింజలను ఉప్మా లేదా గంజితో కలిపి తినవచ్చు.
రోటీలో: పిండిలో అవిసె గింజలను కలిపి రోటీని తయారు చేసుకోవచ్చు.
గమనిక: ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. పలు పరిశోధనలు.. అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. డాక్టర్‌ను సంప్రదించిన తర్వాతే వీటిని పాటించాలి. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.