BigTV English

Foods For Brain Health : ఇవి తింటే.. మెదడు పాదరసమే

Foods For Brain Health : ఇవి తింటే.. మెదడు పాదరసమే
today's healthcare news

Foods For Brain Health(Today’s healthcare news) :

అసలే ఒత్తిళ్ల జీవితం. మెదడుపై ఎనలేని భారం. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే బుర్రను చురుగ్గా ఉంచుకోవాలి. ఇందుకు మంచి ఫుడ్ తీసుకోవాలి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, తృణధాన్యాలు, లీన్ ప్రొటీన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే పాదరసంలా పనిచేస్తుందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. న్యూరోట్రాన్స్‌మిటర్లు చక్కగా పనిచేసేలా ఇవి తోడ్పడాయి. మెదడును నిత్య చైతన్యంగా ఉంచే ఆ సూపర్ ఫుడ్స్ ఇవీ..


బ్లూ బెర్రీస్ : యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. ప్రత్యేకించి ఫ్లవనాయిడ్స్‌ను ఇవి ఎక్కువగా అందిస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా కాగ్నిటివ్ సామర్థ్యం పెరుగుతుంది.

ఫ్యాటీ ఫిష్ : మెదడు ఆరోగ్యానికి ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం. సామెన్ చేపల్లో ఇవి ఎక్కువగా లభిస్తాయి. ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌తో మెదడు పనితీరు మెరుగు పడుతుంది.


బ్రకొలి : దీనిని తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. మెదడును చురుగ్గా ఉంచుతుంది.

పసుపు : యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కలిగే ప్రయోజనాలు పసుపులోని కర్‌క్యుమిన్ ద్వారా పొందగలం. ప్రధానంగా న్యూరోడీజనరేటివ్ వ్యాధులను అడ్డుకోవడంలో కర్‌క్యుమిన్‌దే కీలక పాత్ర.

నట్స్-సీడ్స్ : వాల్‌నట్స్, బాదం, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ వంటివి శరీరానికి అవసరం. మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఈ వీటిలో పుష్కలంగా ఉంటాయి. వృద్ధాప్యం వల్ల వచ్చే మతిమరుపును నిరోధించడంలో నట్స్-సీడ్స్ దోహదపడతాయి.

Tags

Related News

Malida Laddu: బతుకమ్మ స్పెషల్ మలీద లడ్డూలు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్ట్ !

Emergency Numbers:108 మాత్రమే కాదు! ప్రాణాలను కాపాడే అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే

Health Tips: థైరాయిడ్ సమస్యలా ? ఇలా చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్

Protein Rich Foods: వీటిలో.. పన్నీర్ కంటే ఎక్కువ ప్రోటీన్ !

Coconut Oil For Skin Glow: ఫేస్ క్రీములు అవసరమే లేదు..కొబ్బరి నూనె ఇలా వాడితే చాలు !

Cholesterol: శరీరంలోని కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గాలంటే ?

Cycling Vs Running: సైక్లింగ్ Vs రన్నింగ్.. బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి ఏది బెస్ట్ ?

Brain Health: మెదడును.. నిశ్శబ్దంగా దెబ్బతీసే అలవాట్లు ఇవే !

Big Stories

×