Fridge Usage Tips: చల్లటి నీరు తాగాలన్నా, పండ్లు తాజాగా ఉంచాలన్నా, ఆహారాన్ని ఫ్రెష్‌గా నిల్వ చేయాలన్నా కూడా ఫ్రిడ్జ్ మిత్రుడే అండగా నిలుస్తాడు. కానీ, ఈ వేసవిలో ఫ్రిడ్జ్ బాగా పని చేయాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇవి పాటించడం ద్వారా విద్యుత్ వినియోగం తగ్గడంతోపాటు, దీర్ఘకాలం పనికొచ్చే అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం ఏం చేయాలి, ఎలాంటి చిట్కాలు పాటించాలనే 10 ముఖ్యమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
1. ఉష్ణోగ్రతను సరైన స్థాయిలో ఉంచండం
మీ ఫ్రిడ్జ్ టెంపరేచర్ సెట్ చేయడంలోనే మొత్తం వ్యవహారం మొదలవుతుంది. ఫ్రిడ్జ్‌లో 3°C నుంచి 5°C, ఫ్రీజర్‌లో -18°C ఉష్ణోగ్రత ఉంటే ఆహారం సురక్షితంగా నిల్వ ఉంటుంది. ఎక్కువ చల్లదనం అవసరం లేదు, తక్కువ ఉష్ణోగ్రత వల్ల విద్యుత్ వృథా అవుతుంది.
2. తలుపు ఎక్కువసార్లు, ఎక్కువసేపు తీస్తే?
ఫ్రిడ్జ్ డోర్లు ఎక్కువ సార్లు బయటకు తీస్తే, వేడి గాలి లోపలికి చొరబడి ఫ్రిడ్జ్ మోటార్‌కు ఎక్కువ పని చెప్పుతుంది. ప్రతిసారి తలుపు తెరిచే అలవాటు ఉంటే, ఇప్పుడు అది మానేయండి. ఏం కావాలో ముందుగానే నిర్ణయించుకుని తలుపు తెరిచి వెంటనే మూసివేయడం ఉత్తమం.
3. వేడిగా ఉన్న ఆహారాన్ని నేరుగా పెట్టకండి
వండిన ఆహారం వేడి ఉంటే, అది ఫ్రిడ్జ్ లోపల ఉష్ణోగ్రతను పెంచుతుంది. ఇది ఇతర ఆహారాలు పాడయిపోవడానికి దారి తీస్తుంది. అందుకే, ఆహారాన్ని పూర్తిగా చల్లార్చిన తర్వాతే పెట్టడం మంచిది.
4. ఫ్రిడ్జ్‌ను చల్లని ప్రదేశంలో ఉంచండి
స్టవ్ పక్కన లేదా ఎండ తాకే చోట ఫ్రిడ్జ్ ఉంచితే అది వేడి శరీరం లాంటి సమస్య అవుతుంది. ఫ్రిడ్జ్‌ను గదిలో ఓ చల్లటి మూలన ఉంచండి. ఫ్రిడ్జ్ వెనుక భాగం గోడకు అతికినట్టు ఉంచితే వెంటిలేషన్ ఆగిపోతుంది. కనీసం 5-6 అంగుళాల గ్యాప్ ఇవ్వండి. ఇది విద్యుత్ ఖర్చును తగ్గిస్తుంది.
Read Also: WhatsApp Update: వాట్సాప్ వాడుతున్నారా? కేంద్రం కీలక …
5. ఫ్రిడ్జ్‌ను నెలకోసారి శుభ్రం చేయండి
బాక్టీరియా, వాసనలు, ఫుడ్ లీకేజ్ ఇవన్నీ తరచూ ఫ్రిడ్జ్ శుభ్రం చేయకపోతే ఏర్పడతాయి. నెలకోసారి అన్ని విభాగాలు బయటకు తీసి, బేకింగ్ సోడా లేదా లెమన్‌తో తుడిచి క్లీన్ చేయండి.
6. పవర్ సేవింగ్ మోడ్ యాక్టివేట్
కొన్ని ఫ్రిడ్జ్‌ల్లో ఎకనమి మోడ్ లేదా హాలిడే మోడ్ ఉంటుంది. వేసవి కాలంలో ఇవి ఉపయోగించండి. అవి విద్యుత్‌ను 15-20% వరకు ఆదా చేస్తాయి.
7. కండెన్సర్ కాయిల్స్ శుభ్రం చేయండి
ఫ్రిడ్జ్ వెనుక భాగంలోని కాయిల్స్ మీద ధూళి పేరుకుంటే శక్తి వినియోగం పెరుగుతుంది. మూడునెలలకు ఒకసారి వాటిని తుడిచేయండి. ఇది ఫ్రిడ్జ్ లైఫ్‌ని పెంచుతుంది.
8. ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతే వెంటనే తొలగించండి
ఒక ఫ్రీజర్ లోపల ఐస్ పేరుకోవడం సహజం. కానీ ఎక్కువైతే ఫ్రీజర్ కూలింగ్ తగ్గుతుంది. ఆ సమయంలో డీఫ్రాస్ట్ మోడ్ ఆన్ చేయండి లేదా మాన్యువల్‌గా కరిగించండి.
9. అల్లం, వెల్లుల్లి
ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి వంటి పదార్థాలు ఫ్రిడ్జ్‌లో ఉంచితే వాటి వాసనలు ఇతర ఆహారాల్లో కలుస్తాయి. వీటిని వేరే పెట్టెలో పెట్టడం ఉత్తమం.
10. రాత్రిపూట తక్కువగా వాడండి
రాత్రివేళ గాలి చల్లగా ఉంటుంది కాబట్టి, ఫ్రిడ్జ్ ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఎక్కువగా తలుపు తీసే అవసరం లేకుండా చూసుకోండి. ఫ్రిజ్ ఫంక్షనింగ్ మరింత సమర్థవంతంగా ఉంటుంది.