E-Paper
Advertisement

తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !

తాళి బొట్టు మహిళలే ఎందుకు వేసుకోవాలి ..నమిత కామెంట్స్ వైరల్ !
Advertisement

Namitha Comments:నమిత..ఇప్పుడంటే కాస్త జోరు తగ్గించింది కానీ ఒకప్పుడు ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ,కోలీవుడ్ అన్న తేడా లేకుండా ఎలా రచ్చ చేసిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.

వెంకీ జెమిని సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ సొంతం సినిమాతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది.ముఖ్యంగా ఈ సినిమాలో ఉన్న తెలుసునా తెలుసునా అనే పాటకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది కూడా.

Advertisement

ఇక డార్లింగ్ ప్రభాస్ హీరోగా వచ్చిన బిల్లా సినిమాలో సేడ్ రోల్ చేసినప్పటికీ హీరోయిన్ గా నటించిన అనుష్కకి దీటుగా క్రేజ్ సొంతం చేసుకోవడం విశేషం, చాలా గ్యాప్ తరువాతా నందమూరి బాలయ్యతో సింహ సినిమాలో చేసిన సింగమంటే చిన్నోడు సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపింది.

పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్

ఇక కోలీవుడ్ లోనూ అజిత్, విజయ్, శరత్ కుమార్ వంటి టాప్ స్టార్స్ సరసన నటించి మాస్ ఆడియెన్స్‌లో విశేషమైన క్రేజ్ సొంతం చేసుకుంది.అలా వరుస పెట్టి సినిమాలు చేసి పెళ్లి తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెల్సిందే.

Advertisement

ఇదిలా అండగా సినిమాలు తగ్గించినప్పటికీ సోషల్ మీడియాలో ఈ బొద్దుగుమ్మ చేసిన తనదైన కామెంట్స్ తో సందడి చేస్తూ మీడియాలో హైలెట్ అవుతూనే ఉంది.ఈ క్రమంలోనే సొసైటీ లో ఆడవారి పెళ్లి గురించి ,వారు వేసుకునే తాళి బొట్టు గురించి ,ఆడవారికుండే రిస్ట్రిక్షన్స్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టి వార్తల్లో నిలిచింది.

మహిళల చుట్టూనే ఎందుకు

పెళ్లి అనేది ఇద్దరు ఏరికోరి,ఇష్టపడి చేసుకునే ఒక అందమైన అనుభూతి అని, ఈ పెళ్లి అనే బంధంలో ఇద్దరికీ బాధ్యతలతో పాటుగా,ప్రేమ ,నమ్మకం, ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలని చెప్పుకొచ్చారు.ముఖ్యంగా..ఈ బంధంలో పెళ్లయ్యాక పాటించాల్సిన పద్ధతులు, కట్టుబాట్లు, సంప్రదాయాలు కేవలం మహిళల చుట్టూనే ఎందుకు తిరుగుతున్నాయని ఆమె ప్రశ్నించింది.

ఎక్కడలేని కండీషన్స్

సమాజంలో ఒక అమ్మాయికి పెళ్లి కుదిరిన దగ్గరి నుంచే ఎక్కడలేని కండీషన్స్ పుట్టుకొస్తాయని ,ఆ అమ్మాయి ఏ డ్రెస్ వేసుకోవాలి,ఎలా ప్రవర్తించాలి,ఎలాంటి పద్ధతులు ఫాలో అవ్వాలి వంటివన్నీ ఇతరుల అనుమతులతోనే జరుగుతాయని వాపోయింది.
పెళ్లి అయిన తర్వాత ఆడది మెడలో తాళి బొట్టు వేసుకోవాలి ,నుదుటిన సింధూరం ధరించాలి అని ఎక్కడలేని షరతులని ఈ సమాజం విధిస్తుందని ,కానీ మగవాడికి మాత్రం పెళ్లి అయిందన్న దానికి గుర్తుగా ఎలాంటి ఆనవాళ్లు అతడికి విధించలేకపోయిందని మండిపడింది.ఇక నమిత చేసిన కామెంట్స్ ఇలా బయటికి వచ్చాయో లేదో రెండు వర్గాలుగా విడిపోయారు నెటిజన్లు.

ఆడ,మగా ఇద్దరూ సమానమేనని,కానీ మగవారు కాస్త ఎక్కువ సమానం అని ఇలాంటి గుర్తులే రుజువు చేస్తుంటాయని,అసలు అన్ని రకాలుగా ఆడవారు మగవారికి దీటుగా ఉన్నప్పుడు ఈ ఆంక్షలు ఏంటని ,ఎవైనా షరతులు ,గుర్తులు ఉంటె అవి వారికి కూడా ఉండాలని నమితని కొందరు సపోర్ట్ చేస్తున్నారు.

ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో !

ఇక మరికొందరు మాట్లాడుతూ అది భారతదేశ సాంప్రదాయమని, భారతీయ సంస్కృతిలో తాళిబొట్టు అనేది ఒక శిక్ష కాదని, అదొక పవిత్రమైన బంధానికి, దంపతుల రక్షణకు గుర్తు అని ,ప్రతి సంప్రదాయం వెనుక ఒక ఆచారం, ఒక చరిత్ర ఉంటాయని అది తెలీకనే నమిత ఇష్టమొచ్చినట్టుగా కామెంట్స్ చేస్తుందని సెటైర్స్ వేస్తున్నారు.

Also read :ఎపిక్‌కి మిక్స్‌డ్ టాక్.. ఫ్లాప్ దిశగా వెళ్తుందా?

చూడాలి మరి తనపై వస్తున్న ట్రోల్స్ కి నమిత ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో !

Tags

Related News

అభిమాని కుటుంబానికి అండగా రామ్ పోతినేని.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్!

హీరోయిన్ అమీషా పటేల్ ఇంట్లో చోరీ.. మొత్తం విలువ ఎంతంటే?

దమ్ముంటే ‘స్పిరిట్’ సినిమాని పడగొట్టండి.. సవాల్ విసిరిన ప్రొడ్యూసర్!

కాకా వర్సెస్ విశ్వంభర సంక్రాంతి రేసులో వచ్చేదెవరు?

ఎపిక్‌కి మిక్స్‌డ్ టాక్.. ఫ్లాప్ దిశగా వెళ్తుందా?

ముదురుతున్న డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదం.. కీలక సమావేశంపై కోర్టు స్టే!

‘శివాజీ’ మూవీ నటుడు ‘సోలమన్ పప్పయ్య’ మృతి!

Big Stories

Advertisement
×