E-Paper
Advertisement

మంచి భర్త అంటే డబ్బులు సంపాదించేవాడు కాదు.. ఇవి ఉన్నవాడే!

మంచి భర్త అంటే డబ్బులు సంపాదించేవాడు కాదు.. ఇవి ఉన్నవాడే!
Advertisement

Relationship Tips:పెళ్లప్పుడు ఎంత సంపాదిస్తున్నాడు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి..? అంటూ అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూస్తాం. అది మంచిదే కూడా. కానీ పెళ్లి తర్వాత మాత్రం భర్త భార్యను సరిగ్గా అర్థం చేసుకుంటున్నాడా లేదా అన్నదే ముఖ్యం.

అర్థం చేసుకోకపోతే ఆ భార్య జీవితంలో సంతోషం అనేది భూతద్దం వేసి వెతికినా దొరకదు. మరి మంచి భర్త అంటే ఎలా ఉండాలి? ఒకసారి చూసేద్దాం!

భార్య ఏం చెబుతుందో ఓపికగా వినాలి

Advertisement

ముందుగా భార్య ఏం చెబుతుందో ఓపికగా వినాలి. ఆమె ఏదైనా సమస్య చెబితే వెంటనే కోప్పడటం లేదా ‘నీదే తప్పు’ అని చెప్పడం కాకుండా.. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి.

కొన్నిసార్లు అమ్మాయిలకు సలహా కంటే.. తమ మాట వినే మనిషి కావాలి. ఆ సమయంలో ఓపికగా వినడం కూడా చాలా పెద్ద సపోర్ట్ అవుతుంది.

భార్యను గౌరవించాలి

Advertisement

అలాగే భార్యను గౌరవించాలి. ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా ఆమెతో గౌరవంగా మాట్లాడాలి. ఇతరుల ముందు ఆమెను తక్కువ చేసి మాట్లాడకూడదు.ఆమె చేసే పనిని కూడా విలువైనదిగా చూడాలి.

ఇంటి పనుల్లో కూడా తోడుగా ఉండాలి

ఇక ఇంటి పనుల విషయంలో కూడా ఇద్దరికీ బాధ్యత ఉండాలి. భార్య ఒక్కతే ఇల్లు చూసుకోవాలి అనుకోకూడదు.ఆమె బిజీగా ఉన్నప్పుడు భర్త కూడా చిన్న చిన్న పనులు చేస్తే.. ఆమెకు చాలా హెల్ప్ అవుతుంది.

ముఖ్యంగా నమ్మకం ఉండాలి

మరో ముఖ్యమైన విషయం నమ్మకం.భార్య ఎక్కడికి వెళ్లింది? ఎవరితో మాట్లాడింది? అంటూ ప్రతి విషయానికీ అనుమానం పెట్టుకోవడం మంచిది కాదు.ఇద్దరి మధ్య నమ్మకం ఉంటేనే బంధం బలంగా ఉంటుంది. లేకుంటే బీటలు వారడం పక్కా.

ఆమె కలలకు సపోర్ట్ చేయాలి

అలాగే భార్యకు తనకంటూ కొన్ని ఇష్టాలు, కలలు ఉంటాయి. పెళ్లి అయ్యిందని అవన్నీ వదిలేయాలని అనుకోకూడదు.ఆమె ఏదైనా చేయాలనుకుంటే సపోర్ట్ చేయాలి. ఆమె ఎదుగుతుంటే భర్త కూడా సంతోషించాలి.

కష్టాల్లో తోడుగా ఉండాలి

కష్టాలు వచ్చినప్పుడు భార్యకు తోడుగా ఉండటం కూడా చాలా ముఖ్యం.డబ్బులు ఉన్నప్పుడు పక్కన ఉండేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు ‘నేను ఉన్నాను’ అని ధైర్యం చెప్పే భర్తనే ఏ భార్య అయినా కోరుకునేది.

ప్రేమ అంటే గిఫ్టులు ఇవ్వడం మాత్రమే కాదు

అలాగే ప్రేమ అంటే ఖరీదైన గిఫ్టులు ఇవ్వడం మాత్రమే కాదు.ఉదయం ‘తిన్నావా?’ అని అడగడం, ఆమెకు ఏదైనా బాధ ఉంటే తెలుసుకోవడం, అనారోగ్యంగా ఉంటే చూసుకోవడం.. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా ప్రేమ కనిపిస్తుందని గుర్తుపెట్టుకోవాలి.

తనకు నచ్చినట్టు మార్చాలని చూడకూడదు

ముఖ్యంగా భార్యను తనకు నచ్చినట్టు మార్చాలని చూడకూడదు.ఇద్దరికీ అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు. అయినా ఒకరి మాటను ఒకరు గౌరవించుకుంటే జీవితం చాలా బాగుంటుంది.

also read:ఉదయం 5 గంటలకు లేస్తే నిజంగానే లైఫ్ మారుతుందా?

అందుకే మంచి భర్త అంటే ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు మాత్రమే కాదు. భార్య మాట వినేవాడు, గౌరవించేవాడు, నమ్మేవాడు, కష్టాల్లో తోడుగా ఉండేవాడు, ఆమె కలలకు సపోర్ట్ చేసేవాడే మంచి భర్త.మరింతకీ మీరే క్యాటగిరీయో మీకు తెలుసు కదా !

Tags

Related News

ప్రెషర్ కుక్కర్ vs ఇన్‌స్టంట్ పాట్.. మీ కెచెన్ కోసం ఏది బెస్ట్?

30 ఏళ్లు దాటిన తర్వాత పొట్ట ఎందుకు పెరుగుతుంది? కొవ్వు పేరుకుపోవడానికి ఈ 6 అలవాట్లే కారణం

ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు..ఈ తేదీల్లో పుట్టినవారికి కుతూహలం ఎక్కువ

పిల్లలు తమ రూపం, శరీరం బాగోలేదని బాధపడుతున్నారా? తల్లిదండ్రులు వారిలో ఆత్మవిశ్వాసం ఇలా పెంచాలి

ఫిట్‌గా కనిపించే వారిలో కూడా గుండెపోటు.. కారణాలు చెప్పిన గుండె డాక్టర్

జెన్ Z కొత్త ఫిట్‌నెస్ ట్రెండ్.. బలం, ఫిట్‌నెస్‌తోపాటు ఫన్ కూడా

బ్లడ్ షుగర్ హెచ్చుతగ్గులకు చెక్ పెట్టే CGM సాంకేతికత.. వానకాలంలో ఎంతగానో హెల్ప్!

ఈ 5 రకాల వ్యక్తులతో స్నేహం చేస్తే మీ జీవితం నాశనమే.. ప్రశాంతంగా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించండి

Big Stories

Advertisement
×