E-Paper
Advertisement

కబడ్డీ నుంచి క్రైమ్ వరల్డ్‌లోకి… స్పోర్ట్స్ మూవీ కాదు పక్కా రా యాక్షన్ థ్రిల్లర్

కబడ్డీ నుంచి క్రైమ్ వరల్డ్‌లోకి… స్పోర్ట్స్ మూవీ కాదు పక్కా రా యాక్షన్ థ్రిల్లర్
Advertisement

Malayalam action thriller: కబడ్డీ మైదానంలో ఓడించిన ప్రత్యర్థులు, బయట మాత్రం మాఫియాగా మారి పగ తీర్చుకోవడం మొదలుపెడితే ? ఆట కోసం కలిసిన నలుగురు స్నేహితులు ఊహించని పరిస్థితుల్లో అండర్ వరల్డ్‌లోకి అడుగుపెట్టాల్సి వస్తే ? కబడ్డీ, స్నేహం, గ్యాంగ్ వార్స్, క్రైమ్ అన్నింటినీ కలిపి తెరకెక్కించిన రా అండ్ రస్టిక్ మలయాళ యాక్షన్ థ్రిల్లర్ ‘బాల్తి’ (Balti). షేన్ నిగమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమాను తెలుగులో ఎక్కడ చూడవచ్చు ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

కేరళ, తమిళనాడు సరిహద్దుల్లోని వేలంపాలయం అనే ప్రాంతంలో కబడ్డీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అక్కడి యువతకు కబడ్డీ కేవలం ఆట కాదు, వారి జీవితంలో ఒక భాగం. అదే ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు కలిసి ‘అంజమి రైడర్స్’ అనే టీమ్‌గా స్థానిక కబడ్డీ టోర్నమెంట్లలో పాల్గొంటుంటారు. ఆ టీమ్‌కు ఉదయన్ నాయకుడు. అతడినే అందరూ ముద్దుగా ‘బాల్తి’ అని పిలుస్తుంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఈ నలుగురు స్నేహితుల మధ్య మంచి అనుబంధం ఉంటుంది.

Advertisement

కబడ్డీలో ఉన్న ప్రతిభతో వారు వరుసగా విజయాలు సాధిస్తూ స్థానికంగా మంచి పేరు సంపాదించుకుంటారు. మైదానంలో ప్రత్యర్థులకు అవకాశం ఇవ్వకుండా దూకుడుగా ఆడే బాల్తి టీమ్‌కు మంచి క్రేజ్ ఏర్పడుతుంది. అయితే ఒక ప్రతిష్టాత్మకమైన కబడ్డీ మ్యాచ్ వారి జీవితాల్లో ఊహించని సమస్యను తీసుకొస్తుంది. ఆ మ్యాచ్‌లో బాల్తి, అతని స్నేహితులు ఒక శక్తివంతమైన ఎలైట్ టీమ్‌ను ఓడిస్తారు. బయటకు చూస్తే అది కేవలం ఒక కబడ్డీ విజయం మాత్రమే. కానీ ఆ ఓటమి వెనుక ఉన్న వ్యక్తులు సాధారణ ఆటగాళ్లు కాదు.

ఆ ఎలైట్ టీమ్‌కు వెనుక ఒక ప్రమాదకరమైన క్రైమ్ సిండికేట్ ఉంటుంది. మాఫియా, వడ్డీ వ్యాపారం, అక్రమ ఫైనాన్స్ వంటి వ్యవహారాల్లో ఉన్న ఆ గ్యాంగ్‌కు తమ పరువు పోవడం అస్సలు నచ్చదు. కబడ్డీ మైదానంలో జరిగిన ఒక్క ఓటమి కారణంగా బాల్తి, అతని స్నేహితులు వారి టార్గెట్‌గా మారతారు. మొదట్లో తమకు ఎదురవుతున్న సమస్యలను కేవలం వ్యక్తిగత గొడవలుగానే భావించిన బాల్తి గ్యాంగ్‌కు, తాము ఎంత పెద్ద క్రైమ్ నెట్‌వర్క్‌లో చిక్కుకున్నామో క్రమంగా అర్థమవుతుంది.

Advertisement

పరిస్థితులు మరింత విషమించడంతో వాళ్లు కోరుకున్నా ఆ ప్రపంచం నుంచి బయటకు రావడం సాధ్యం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు మైదానంలో తమ టీమ్ కోసం పోరాడిన ఈ యువకులు ఇప్పుడు తమ ప్రాణాల కోసం పోరాడాల్సి వస్తుంది. స్నేహితుల్లో ఎవరికైనా ప్రమాదం ఎదురైతే మిగతావాళ్లు వెనక్కి తగ్గకుండా నిలబడతారు. కానీ క్రైమ్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన కొద్దీ వారి స్నేహం, నమ్మకం, ధైర్యం అన్నీ పరీక్షకు గురవుతాయి.

కబడ్డీలో గెలిచిన ఆ ఒక్క మ్యాచ్ వాళ్ల జీవితాలను ఇంత దారుణంగా ఎలా మార్చింది ? బాల్తి, అతని స్నేహితులు క్రైమ్ సిండికేట్ నుంచి ఎలా బయటపడాలని ప్రయత్నించారు ? తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్లు చివరకు ఎంత దూరం వెళ్లాల్సి వచ్చింది ? అనేదే సినిమాను చూసి తెలుసుకోవలసిన అసలైన కథ.

తెలుగులోనూ స్ట్రీమింగ్

షేన్ నిగమ్, శంతను భాగ్యరాజ్, ప్రీతి అస్రాని, సెల్వరాఘవన్, అల్ఫోన్స్ పుత్రేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఉన్ని శివలింగం దర్శకత్వం వహించారు. కబడ్డీ నేపథ్యంతో పాటు లోకల్ గ్యాంగ్ వార్స్, అండర్ వరల్డ్, స్నేహం, ప్రతీకారం వంటి అంశాలను కలిపి తెరకెక్కించిన ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌ను యాక్షన్ Sony LIVలో చూడవచ్చు. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో కూడా అందుబాటులో ఉంది.

Read Also: బోర్డర్లో వైట్ కోట్ వారియర్స్ స్టోరీ… సైనికుల ప్రాణాల కోసం డాక్టర్ల పోరాటం

Tags

Related News

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

17 ఏళ్ల తర్వాత కిల్లర్ కి విడుదల… అమాయకులను ఇరికించే లాయర్లను వేటాడే కిల్లర్… ఇంటెన్స్ సైకో థ్రిల్లర్

మనుషుల్ని వేటాడే కోటీశ్వరులు… వేటలో చిక్కుకున్న అమ్మాయే వేటగాళ్లను వేటాడితే ? బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్

బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

Big Stories

Advertisement
×