Healthy Habits:చ.. చ.. బద్ధకం ఎక్కువైపోయింది. “రేపటి నుంచి పొద్దునే 5 గంటలకే లేవాలి.. ఏదైనా కొత్తగా మొదలుపెట్టాలి” అని మనలో చాలామంది అనుకుంటారు. రాత్రి పడుకునే ముందు అలారం 5 గంటలకు పెట్టుకుంటాం కూడా. కానీ పొద్దున్నే అలారం మోగగానే.. “ఇంకో పది నిమిషాలు పడుకుందాం..” అంటూ మోగినదాన్ని నోరు కట్టేస్తాం.
ఇక ఆ పది నిమిషాలు కాస్తా అరగంట అవుతుంది.. ఆ తర్వాత గంట అవుతుంది. చివరికి లేచేసరికి మనం అనుకున్న టైమ్ అంతా అయిపోయి ఉంటుంది.ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా 5 AM క్లబ్ అంటూ చాలా చూస్తున్నాం. కొంతమంది ఉదయం 5 గంటలకే లేచి వర్కౌట్ చేస్తారు.. పుస్తకాలు చదువుతారు.. మెడిటేషన్ చేస్తారు.. ఆ రోజు ఏం చేయాలో ముందే ప్లాన్ చేసుకుంటారు.
అవి చూసి మనకి కూడా.. “మనమూ 5 గంటలకే లేస్తే లైఫ్ మారిపోతుందేమో!” అనిపిస్తుంది.మరి నిజంగానే ఉదయం 5 గంటలకు లేవడం వల్ల లైఫ్ మారిపోతుందా? లేక అదంతా సోషల్ మీడియాలో కనిపించే హడావుడేనా? చూసేద్దాం.
ఉదయం అందరూ నిద్రలో ఉన్నప్పుడు లేస్తే ఇంట్లో పెద్దగా గోల ఉండదు. ఫోన్ కూడా పెద్దగా మోగదు. ఎవరి మెసేజ్‌లు.. ఎవరి కాల్స్ ఉండవు. ఆ టైమ్‌ని మన కోసం ఉపయోగించుకోవచ్చు.
కాసేపు వాకింగ్ చేయొచ్చు. ఎక్సర్‌సైజ్ చేయొచ్చు. పుస్తకం చదవొచ్చు. చదువుకోవచ్చు. లేదా ఆ రోజు చేయాల్సిన పనులన్నీ ఒకసారి చూసుకోవచ్చు.మామూలుగా రోజంతా పనుల్లో బిజీగా ఉండేవాళ్లకి ఈ ఉదయం టైమ్ చాలా ఉపయోగపడుతుంది.
చాలామందికి నిద్ర లేవగానే చేసే మొదటి పని ఫోన్ చూడటం. వాట్సాప్‌లో ఏం వచ్చింది? ఇన్‌స్టాగ్రామ్‌లో ఏమైనా కొత్త రీల్స్ వచ్చాయా? యూట్యూబ్‌లో ఏ వీడియోలు ఉన్నాయి? అంటూ ఫోన్‌లో మునిగిపోతారు.
అలా చేస్తే.. మార్నింగ్ లేచింది కూడా వృథానే.అందుకే లేచిన వెంటనే ఫోన్ చూడకుండా.. ముందు మన పనులు చేసుకోవడం మంచిది.
ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 5 గంటలకు లేస్తేనే సక్సెస్ వస్తుంది.. 7 గంటలకు లేస్తే ఏమీ సాధించలేం అని ఏమీ లేదు.అది మన శరీరం, మన రొటీన్ మీద ఆధారపడి ఉంటుంది.
ఉదాహరణకు రాత్రి 12, ఒంటి గంట వరకు మేల్కొని ఉండి ఉదయం 5 గంటలకు లేస్తే.. మనకి సరైన నిద్ర ఉండదు. దాంతో రోజంతా బద్ధకంగా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఇబ్బందిగా ఉంటుంది.అందుకే ముందుగా సరైన నిద్ర ఉండాలి.
ఒక్కరోజు 5 గంటలకు లేచి.. తర్వాత మూడు రోజులు 9 గంటలకు లేస్తే పెద్దగా ఉపయోగం ఉండదు.అదే రోజూ 6 గంటలకు లేచి.. ఆ టైమ్‌ని మంచిగా ఉపయోగించుకుంటే అది ఇంకా బెటర్.
కాబట్టి మీకు ఏ టైమ్ సరిపోతుందో ఆ టైమ్‌కి లేవండి. ముఖ్యంగా రోజూ ఒకే టైమ్‌కి లేవడానికి ప్రయత్నించండి.అలా నెమ్మదిగా అలవాటు చేసుకుంటే మన రోజువారీ జీవితం కూడా క్రమంగా మారుతుంది.
5 గంటలకు లేచి మళ్లీ బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటే ఏం ఉపయోగం?ఉదయం లేచిన తర్వాత ఒక గంట మన కోసం పెట్టుకుంటే చాలు. మొదట కాసేపు వాకింగ్.. తర్వాత ఎక్సర్‌సైజ్.. ఆ తర్వాత చదువు లేదా పని.. ఇలా మనకు ఉపయోగపడే పనులు చేసుకోవచ్చు.
ముఖ్యంగా ఉదయం మనం చేసిన మంచి పని.. ఆ రోజు మొత్తం మన మూడ్‌పై కూడా ప్రభావం చూపుతుంది.ఉదయాన్నే లేవడం వల్ల ఇంకో మంచి విషయం ఏంటంటే.. రోజు మొదలయ్యే ముందే మనం కొన్ని పనులు పూర్తి చేసుకుంటాం.
అందుకే మిగతా రోజంతా మనపై పనుల ఒత్తిడి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది.ఉదాహరణకు ఉదయాన్నే వాకింగ్ పూర్తి చేసుకుంటే.. సాయంత్రం టైమ్ లేదనే కారణం చెప్పాల్సిన అవసరం ఉండదు.చదువుకునే వాళ్లైతే ఉదయం కాస్త చదువుకుంటే.. రోజులో మిగతా పనులు కూడా కాస్త సులభంగా చేసుకోవచ్చు.
అవసరం లేదు.మీకు 5 గంటలకు లేవడం కుదిరితే లేవండి.6 గంటలకు లేవడం కుదిరితే 6 గంటలకు లేవండి.7 గంటలకు లేవాల్సి వస్తే 7 గంటలకు లేవండి.విషయం ఏంటంటే.. లేచిన తర్వాత మనం ఏం చేస్తున్నామన్నదే ఇక్కడ ముఖ్యం.టైమ్‌కి లేచి.. మళ్లీ రోజంతా ఫోన్‌లోనే ఉంటే ఉపయోగం లేదు.అదే కాస్త లేట్‌గా లేచినా.. మన పనులు సరిగ్గా చేసుకుంటే అదే మంచి అలవాటు.
లైఫ్‌ని మార్చేది ఉదయం 5 గంటల అలారం కాదు.. మనం రోజూ చేసే చిన్న చిన్న అలవాట్లే.5 గంటలకు లేవడం మంచి అలవాటే కావచ్చు. కానీ దాన్ని ఒక రూల్‌లా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
also read:అమ్మాయిలు ప్రేమలో పడితే మొదట చేసే పని ఇదే!
మీకు సరిపోయే టైమ్‌లో లేవండి. సరైన నిద్ర తీసుకోండి. ఉదయం దొరికే టైమ్‌ని ఫోన్‌లో కాకుండా మీ కోసం ఉపయోగించుకోండి.అలా రోజూ కంటిన్యూ చేస్తే.. కొంతకాలానికి మీలోనే మార్పు కనిపిస్తుంది.ఎందుకంటే లైఫ్ ఒక్కరోజులో మారిపోదు.. రోజూ మనం చేసే చిన్న చిన్న మార్పుల వల్లే నెమ్మదిగా మారుతుంది.
గుర్తు పెట్టుకుంటారు కదూ!