E-Paper
Advertisement

పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్

పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Survival Thriller: ప్రపంచం మొత్తం మంచు గడ్డగా మారిపోయింది. బతికి బయటపడిన మనుషులంతా ఒకే రైలులో ఉన్నారు. కానీ ఆ రైలులో కూడా ధనవంతులకు స్వర్గం, పేదలకు నరకం ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? సమాజంలోని వర్గ విభేదాలను సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌తో ముడిపెట్టిన గ్లోబల్ హిట్ మూవీ ‘స్నోపియర్సర్’ (Snowpiercer). మెంటలెక్కించే సస్పెన్స్ ఉన్న ఈ సర్వైవల్ థ్రిల్లర్ ను ఎక్కడ చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

భూతాపాన్ని తగ్గించేందుకు శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం ఊహించని విధంగా విఫలమవుతుంది. ఆ ప్రయోగం కారణంగా భూమి మొత్తం తీవ్రమైన మంచు యుగంలోకి వెళ్లిపోతుంది. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవరాశి, దాదాపు మానవజాతి మొత్తం అంతరించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ విపత్తుకు ముందే విల్‌ఫోర్డ్ అనే శతకోటీశ్వరుడు నిర్మించిన స్నోపియర్సర్ అనే భారీ రైలు మాత్రం కొంతమంది మనుషులకు ఆశ్రయంగా మారుతుంది.

Advertisement

ఈ రైలు సాధారణ రైలు కాదు. భూమి చుట్టూ నాన్‌స్టాప్‌గా ప్రయాణిస్తూ, అందులో ఉన్నవారికి అవసరమైన జీవన సదుపాయాలను అందిస్తుంది. బయట ప్రపంచం మొత్తం మంచుతో కప్పబడి ఉన్నప్పటికీ, రైలు లోపల మాత్రం ఒక ప్రత్యేక ప్రపంచం ఏర్పడుతుంది. కానీ అక్కడ కూడా అందరికీ సమానమైన జీవితం ఉండదు. రైలు ముందు భాగంలో ఉండే సంపన్నులు విలాసవంతమైన భోగీల్లో సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. వారికి మంచి ఆహారం, మద్యం, వినోదం, అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.

అదే సమయంలో రైలు చివరి భాగంలోని టెయిల్ సెక్షన్‌లో నివసించే పేదలకు కనీస సౌకర్యాలు కూడా ఉండవు. చీకటి భోగీల్లో కిక్కిరిసి జీవిస్తూ, పరిమితమైన ప్రోటీన్ బార్స్‌పై ఆధారపడుతూ నరకయాతన అనుభవిస్తుంటారు. ఏళ్ల తరబడి ఈ వివక్షను భరించిన పేద ప్రజల్లో చివరకు తిరుగుబాటు మొదలవుతుంది. కర్టిస్ అనే వ్యక్తి వారి నాయకుడిగా ముందుకు వస్తాడు. రైలు చివరి భాగం నుంచి ప్రారంభమైన ఈ తిరుగుబాటుదారులు ఒక్కో భోగీని స్వాధీనం చేసుకుంటూ ముందుకు సాగుతారు.

Advertisement

వారి లక్ష్యం కేవలం సౌకర్యవంతమైన జీవితం పొందడం కాదు, ఈ అన్యాయ వ్యవస్థకు కారణమైన రైలు యజమాని విల్‌ఫోర్డ్‌ను చేరుకోవడం. అయితే రైలులోని ప్రతి భోగీ ఒక కొత్త ప్రపంచంలా ఉంటుంది. ముందుకు వెళ్లే కొద్దీ కర్టిస్ బృందానికి ఎదురయ్యే ప్రమాదాలు, భయంకరమైన పోరాటాలు, ఊహించని నిజాలు కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తాయి. చివరకు రైలు ఇంజన్ దగ్గరకు చేరుకున్నప్పుడు బయటపడే అసలు రహస్యం మొత్తం కథను మరో కోణంలో చూపిస్తుంది. మరి చివరికి ఈ పోరాటం ఏమైంది ? అన్నది తెరపై చూడాల్సిందే.

తెలుగులో ఉందా లేదా ?

బాంగ్ జూన్ హో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 2013 సినిమా క్రిస్ ఎవాన్స్, సాంగ్ కాంగ్ హో, టిల్డా స్వింటన్, అక్టేవియా స్పెన్సర్ వంటి ప్రముఖ నటులతో రూపొందింది. ప్రస్తుతం ఈ సినిమా Amazon Prime Videoలో అందుబాటులో ఉంది. సైన్స్ ఫిక్షన్, యాక్షన్, సర్వైవల్ థ్రిల్‌తో పాటు సమాజంలోని ధనిక, పేద వర్గాల మధ్య ఉన్న అంతరాన్ని బలంగా చూపించిన ఈ సినిమా ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ సినిమా పూర్తయ్యాక కూడా ఆలోచించేలా చేస్తుంది. సీరియస్ సైన్స్ ఫిక్షన్, సర్వైవల్ థ్రిల్లర్స్, డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఇష్టపడేవారు స్నోపియర్సర్‌ను తప్పకుండా చూడవచ్చు. తెలుగు వెర్షన్ అందుబాటులో లేదు.

Read Also: నమ్మినవాడే వెన్నుపోటు.. డ్రాగన్లతో రణరంగం.. చివర్లో ఊహించని విషాదం

Related News

మనుషుల్ని వేటాడే కోటీశ్వరులు… వేటలో చిక్కుకున్న అమ్మాయే వేటగాళ్లను వేటాడితే ? బ్లడీ సర్వైవల్ థ్రిల్లర్

బిగ్ బాస్ తరహాలో మరో రియాలిటీ షో.. తెలుగులో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

Big Stories

Advertisement
×